జిల్లాకు వచ్చిన ఈవీఎంలు, (ఇన్‌సెట్‌లో) బ్యాలెట్ యూనిట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు ఆదివారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వచ్చాయి. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి 3 వేల కంట్రోల్ యూనిట్లు జిల్లాకు చేరాయి. వీటిని కలెక్టరేట్ వెనుకవైపు ఉన్న సివిల్ సప్లయ్ గోదాములో భద్రపరిచారు. జిల్లాల్లో 3,258 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాకు 7,200 కంట్రోల్ యూనిట్లు, 9,100 బ్యాలెట్ యూనిట్ రావాల్సి ఉంది. ఇప్పటివరకు 3000 కంట్రోల్ యూనిట్లు మాత్రమే వచ్చాయి.
మిగిలినవన్నీ రెండు రోజుల్లో జిల్లాకు చేరనున్నాయి. ఈవీఎంలు రావడంతో కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్‌కు వెళ్లి పరిశీలించారు. ఈవీఎంలకు రక్షణగా ప్రత్యేక పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు అయింది. ఈవీఎంలు భద్రపరచిన గోదాముకు సీసీ కెమెరాలు, సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో వస్తాయని, ఆ తర్వాత ఫస్ట్ లెవల్ చెకింగ్ మొదలుపెడతామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఫస్ట్ లెవల్ చెకింగ్ ప్రక్రియ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వారంరోజులపాటు జరుగుతుందని, దీనిని వీడియో కూడా తీస్తామని పేర్కొన్నారు. ఈవీఎంలు భద్రపరిచే గోదాములో ఎటువంటి విద్యుత్ సౌకర్యం ఉండరాదని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, డీపీఓ శోభాస్వరూపరాని, కలెక్టర్ కార్యాలయ ఇ-సెక్షన్ సూపరింటెండెంట్ రమణరావు, ఎన్నికల సెల్ ఓఎస్‌డీ సంపత్‌కుమార్, ఎన్నికల సెల్ డీటీలు శివరాముడు, లక్ష్మీరాజు తదితరులు పాల్గొన్నారు.