haritha Project
-
హరిత ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు మోసం: నాగిరెడ్డి
హైదరాబాద్: హరిత ప్రాజెక్టు పేరుతో రైతులను చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. రైతుల గురించి మాట్లాడే ముందు చంద్రబాబు ఆత్మవంచన మాని ఆత్మవిమర్మ చేసుకోవాలి సూచించారు. కష్టపడి పండించిన పంటకు సరైన మద్దతు ధరలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరలస్థిరీకరణ అన్నారు... ఇప్పుడు ఆ మాటే ఎత్తడంలేదంటూ ధ్వజమెత్తారు. ముందు ప్రజలకిచ్చిన హమీలు అమలు చేసి కొత్త హామీలివ్వాలని చంద్రబాబుకు నాగిరెడ్డి సలహామిచ్చారు. -
30 వేల కోట్లతో ఏపీలో హరిత ప్రాజెక్టు
హైదరాబాద్: ఏసీ సీఎం చంద్రబాబు వ్యవసాయ నీటిపారుదల అధికారులతో భేటీ అయ్యారు. 30 వేల కోట్లతో హరిత ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. తొలి విడత పైలట్ ప్రాజెక్టుగా మూడు జిల్లాల్లో 30 వేల మంది రైతులు 3 పంటలు వేసేలా ప్రోత్సహించాలని ఆయన అధికారులకు తెలిపారు. తన ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి కష్టం రాకూడదని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే రైతులు తుపానుల వల్ల చేతికందిన పంటను నష్ట పోతున్నారని, హరిత ప్రాజెక్టు ద్వారా రైతులకు సాంకేతిక సహాయాన్ని అందజేయాలని ఆయన పేర్కొన్నారు.