haritha restaurant
-
టూరిజం హబ్‌గా నల్లమల
మన్ననూర్ (అచ్చంపేట): ప్రకృతి స హజమైన పర్యాటక ప్రాంతాలు, శైవక్షేత్రాలకు నిలయమైన నల్లమలను టూ రిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం శ్రీశైలం– హైదరాబాద్ ప్రధాన రహదారిలోని మన్ననూర్ చెరువుకొమ్ము లింగమయ్యస్వామి ఆలయ స మీపంలో రూ.14 కోట్ల నిధులతో నిర్మించిన హరిత టూరిజం రెస్టారెంట్ ను ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మె ల్యే గువ్వల బాలరాజుతో కలిసి ఆయ న ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ ప్రాంగణంలో ఆయన వి లేకరులతో మాట్లాడారు. బోటులో పర్యటిస్తున్న మంత్రి 3,500 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న నల్లమల పరివాహక ప్రాంతంలో అనే క శైవక్షేత్రాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రా ల నుంచి కూడా ఈ ప్రాంతానికి పర్యాటకులు వస్తుంటారనే ఉద్దేశంతో ఇక్క డ పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అందుకోసం మన్ననూర్‌తోపాటు ఈగలపెంట సమీపంలోని ఆ క్టోపస్ వద్ద నిర్మించిన హోటళ్లు, విశ్రా ంతి గదులు, లిఫ్టు తదితరా లకు రూ. 50 కోట్లు ఖర్చు చేశామన్నా రు. నల్లమలలో టూరిజంకు పెద్దపీట వేయడంతోపాటు ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పి ంచేందుకు కృషిచేస్తామన్నారు. ఇప్పటి కే సోమశిల నుంచి శ్రీశైలానికి ఏసీ బోటు సౌకర్యం కల్పించామన్నారు. 500 ఎకరాల్లో ఇండస్ట్రీ కారిడార్ జిల్లాలో 500 ఎకరాల్లో ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటు చేసిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అ భి వృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో సైనికులుగా పనిచేస్తామన్నా రు. టూరిస్టులకు అన్ని రకాల సౌకర్యా లు కల్పిస్తూ మర్యాదపూర్వకంగా ఉంటూ టూరిజం అభివృద్ధికి కృషిచేయా లని సూచించారు. ప్రభుత్వ విప్, ఎ మ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ వలసలు వాపస్ రావాలనే సీఎం కేసీఆర్ నినాదం ప్రస్తుతం పూర్తిస్థాయిలో విజయవంతమవుతుందన్నారు. అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. ఇందులో భాగంగానే అన్నిరంగాల్లో వెనుకబడిన నల్లమలలో టూరిజం హబ్‌తోపాటు అమ్రాబాద్‌కు సాగునీరు అందించేందుకు రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామన్నారు. ఈ ప్రాంతాన్ని వ్యవసాయ పరంగా సస్యశ్యామలం చేసి ప్రజలు, ముఖ్యంగా రైతుల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. సీఎంతోపాటు యువనేత కేటీఆర్, కేబినెట్లో ఉన్న ఉద్యమ నాయకుల స హకారంతో అచ్చంపేటను మరో సి ద్ధిపేటగా తీర్చిదిద్దుతానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్ప ర్సన్ పద్మావతి, కలెక్టర్ శ్రీధర్, ఆర్డీఓ పాండు, డీఎంహెచ్ఓ సుధాకర్లాల్, టూరిజం ఎండీ మనోహర్, తిరుపతిరె డ్డి, ఎంపీడీఓ శంకర్, సర్పంచ్ శ్రీరాం, జెడ్పీటీసీ సభ్యుడు రాంబాబు, ఎంపీ పీ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ ప్రణీత, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసులు, బా లమ్మ, నాయకులు రవీందర్‌రెడ్డి, న ర్సింహగౌడ్, రాజేందర్, సతీష్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఏ కష్టమొచ్చిందో..
వేంపల్లె : చక్రాయపేట మండలం గండి పుణ్యక్షేత్రంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరితా రెస్టారెంటులోని నాల్గవ గదిలో మదనపల్లెకు చెందిన కుటుంబ యజమాని ఎలమలకుంట మీరావల్లి (45)తోపాటు అతని భార్య హజరాంబి(40), పెద్దకుమార్తె ఆశ(20), రెండవ కుమార్తె యశ్మిత (18), మూడవ కుమార్తె షర్మిల(16), కుమారుడు దస్తగిరి (14) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడిన గదిలో గోడపై రాసిన నోట్ ప్రకారం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా.. లేక ఎవరైనా పురుగుల మందు బలవంతంగా తాపి వెళ్లిపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పులివెందుల డీఎస్పీ హరినాథబాబు, సీఐ మహేశ్వరరెడ్డి, ఆర్కె వ్యాలీ ఎస్ఐ ప్రదీప్‌నాయుడు మృతదేహాలను పరిశీలించి హరితా రెస్టారెంటు సిబ్బంది, మృతుని బంధువులను విచారించారు. మృతుడు మీరావల్లి తోడల్లుడు భాస్కర్ వివరాల మేరకు... దూదేకుల కులానికి చెందిన ఎర్రమల చింత మీరావల్లి గత 7 నెలల క్రితం వరకు ఎర్రగుంట్లలో నివాసం ఉండేవాడు. పిల్లల చదువు కోసం అక్కడ ఉన్న స్థలాన్ని, ఇంటిని, ట్రాక్టర్‌ను రూ. 33లక్షలకు విక్రయించాడు. కొంతమందికి ఇవ్వాల్సిన అప్పు ఇచ్చి ప్రస్తుతం మదనపల్లె చెంబుకూరు రోడ్డులోని ఈశ్వరమ్మ కాలనీలో నివాసముంటున్నారు. ఈనెల 1వ తేదీ శనివారం సాయంత్రం పుణ్యక్షేత్రమైన గండికి మీరావల్లి కుటుంబంతో చేరుకున్నారు. మూడు రోజుల పాటు నిద్ర చేసేందుకు వచ్చామని హరితా రెస్టారెంటులోని 4వ గదిని తీసుకుని శుక్రవారం సాయంత్రం వరకు అద్దె కూడా చెల్లించారు. శుక్రవారం మధ్యాహ్నం ఎవరూ బయట కనపడకపోవడంతో రెస్టారెంటు సిబ్బంది గది తలుపులు తోశారు. విపరీతమైన పురుగుల మందు వాసన రావడంతోపాటు గదిలో మృతదేహాలు చిందరవందరగా పడి ఉన్నాయి. సిబ్బంది వెంటనే కర్నూలులో ఉన్న మేనేజర్ లక్ష్మణ్‌కు సమాచారం అందించగా.. ఆయన ఆర్కేవ్యాలీ ఎస్ఐ ప్రదీప్నాయుడుకు సమాచారం అందించారు. దీంతో డీఎస్పీ హరినాథబాబు, సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్ఐ ప్రదీప్నాయుడుఘటనా స్థలాన్ని పరిశీలించారు. రెస్టారెంట్ సిబ్బందిని విచారించారు. మృతికి దారితీసిన కారణాలను తెలుసుకుంటున్నామని తెలిపారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు : మృతదేహాలు ఉన్న ఘటనా స్థలంలో గోడపై నోట్ రాసి ఉండటంతో పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేపడుతున్నారు. శుక్రవారం రాత్రికి గానీ.. శనివారం ఉదయం కానీ కర్నూలు నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లను పిలిపించి తనిఖీలు నిర్వహించిన తర్వాత.. వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి మృతదేహాలను తరలిస్తామని పోలీసులు తెలిపారు. సంఘటనపై పలు అనుమానాలు హరితా రెస్టారెంటులోని నాల్గవ గదిలో శుక్రవారం పురుగుల మందు తాగి మీరావల్లీ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన తీరు చూస్తే పలు అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరుమంది కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడితే ఎటువంటి శబ్ధం లేకుండా కేకలు వినిపించకుండానే మృతి చెందడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. సిబ్బంది తలుపులు లాగానే వచ్చిందంటే... గదికి తాళం వేసుకోకుండానే ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడి ఉంటే.. చావు భయంతో ఏ ఒక్కరైనా పరుగులు తీసి ఉండేవారు కదా అనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా గోడపై బొగ్గుతో రాసిన నోట్ మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ‘ రూంలోకి గుంపుగా జనం వచ్చినారు.. వారిలో ప్రొద్దుటూరుకు చెందిన రెహ్మాన్, ఎర్రగుంట్లకు చెందిన గుర్రం మిల్లార్, దస్తగిరి అనేవారిని చూసినాము.. మమ్ములను అణగబట్టి మందుపోసినారు., మా చావుకు వారే కారణం’ అని రాసి ఉంది. దీన్ని బట్టి చూస్తే ఎవరైనా ఆహారంలో పురుగుల మందు కలిపి వీరికి ఇచ్చారా.. లేక బలవంతంగా పురుగుల మందు తాపి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పన్నాగం పడ్డారా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నోట్లో రాసిన ఇద్దరికి మీరావల్లి డబ్బులు బాకీ ఉన్నందువల్లే ఇలా రాసి ఉన్నారా.. లేక డబ్బులు వసూలుకు బలవంతం చేశారా అని మరొక అనుమానం కూడా కలుగుతోంది. -
మూన్నాళ్ల ముచ్చట
మొల్ల పర్యాటక కేంద్రంలో ఏర్పాటు చేసిన హరిత రెస్టారెంట్ పరిస్థితి మూన్నాళ్ల ముచ్చటగా మారింది. గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన ఈ రెస్టారెంట్ నష్టాలలో నడుస్తోంది. ఇక్కడ 5 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి ప్రతినెల రూ. 35 వేలను జీతాలుగా చెల్లిస్తున్నారు. ఇతర ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి. జీతాలకు సరిపడ ఆదాయం కూడా రావడం లేదు. దీంతో మార్చిలోపు హరిత రెస్టారెంట్ మూతపడనుంది. -న్యూస్‌లైన్, గోపవరం