Harsh varthan
-
ఫిబ్రవరి నాటికి అదుపులోకి కరోనా!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజలు కోవిడ్-19 నిబంధనలను పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో కేవలం 40,000 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఉంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. కేసుల మోడల్‌ను అనుసరించి శాస్త్ర సాంకేతిక శాఖ శాస్త్రవేత్తల నుంచి ఈ అంచనాకు వచ్చిందని చెప్పారు. మూడు నాలుగు నెలల్లో కరోనా వైరస్ తీరు మార్చుకుని ఫిబ్రవరి నాటికి భారత్‌లో బలహీనపడుతుందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్-19 కేసుల సంఖ్య పెరగకుండా నిరోధించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. ఇక వ్యాక్సినేషన్ పద్ధతులు, సిబ్బందికి శిక్షణ, వ్యాక్సిన్ సరఫరాకు రవాణా ఏర్పాట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని కోవిడ్-19పై నిపుణుల కమిటీ చీఫ్ పేర్కొన్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత మూడు వారాలుగా తాజా కేసులు, మరణాలు తగ్గాయని నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్ ఇటీవల పేర్కొన్నారు. అయితే శీతాకాలంలో కరోనా వైరస్ మరోసారి తీవ్రరూపు దాల్చే అవకాశాలు లేకపోలేదని ఆయన హెచ్చరించారు. చదవండి : భారత్‌లో 75 లక్షలు దాటిన కరోనా కేసులు -
కోవిడ్-19 : జులై నాటికి 25 కోట్ల మందికి వ్యాక్సినేషన్
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జులై నాటికి 130 కోట్ల దేశ జనాభాలో 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందచేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆదివారం వెల్లడించారు. ఈ దిశగా ప్రభుత్వం 40 నుంచి 50 కోట్ల వ్యాక్సిన్ డోసులను సేకరిస్తుందని, వ్యాక్సిన్‌ను సమంగా పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతుందని చెప్పారు. ఏయే గ్రూపులకు ముందుగా వ్యాక్సిన్ అందచేయాలనే వివరాలతో ప్రాధాన్యతా గ్రూప్‌లను పేర్కొంటూ ఈ నెలాఖరులోగా జాబితాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరామని చెప్పారు. వ్యాక్సిన్ సేకరణను కేంద్రకృతంగా చేపట్టి ప్రతి కన్సైన్మెంట్ను రియల్‌టైంలో ట్రాక్ చేస్తామని చెప్పారు. వ్యాక్సిన్‌ను ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు అందచేస్తామని డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, నర్సులు, పారామెడికల్, పారిశుద్ధ సిబ్బంది, ఆశా కార్యకర్తలతో పాటు వైరస్ ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ ప్రక్రియలో నిమగ్నమైన ఇతరులకు ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ను వేస్తామని చెప్పారు. వ్యాక్సిన్ సమంగా అందరికీ అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని, భారత వ్యాక్సిన్ తయారీదారులకు పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భారత్‌లో పలు వ్యాక్సిన్లు కీలక దశ పరీక్షలకు చేరుకోవడంతో ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజా పాజిటివ్ కేసులతో కలిపి భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 65 లక్షలు దాటింది. చదవండి : ‘కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ప్రారంభం’ -
వాయిస్ ఓవర్...
సంగీత దర్శకులు వాయిస్ ఓవర్ చెప్పడం అనేది చాలా అరుదైన విషయం. కీరవాణి తన కెరీర్లోనే తొలిసారిగా ఓ చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పారు. గుణ్ణం గంగరాజు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న ‘చందమామలో అమృతం’ సినిమాకు కీరవాణి ఇటీవలే వాయిస్ ఓవర్ చెప్పారు. అవసరాల శ్రీనివాస్, హర్షవర్థన్, శివన్నారాయణ తదితరులు ఇందులో నటించారు. బుల్లితెరపై ‘అమృతం’ సీరియల్ విశేషాదరణ పొందిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపు లాంటిది ఈ సినిమా.