ఆత్మీయ వాయినం..
త్రిపురారం : నాగార్జున సాగర్లోని శివాలయం ఘాట్లో కృష్ణా పుష్కరస్నానం ఆచరించిన అనంతరం హైదరాబాద్లోని దిల్షుక్ నగర్ చెందిన డాక్టర్ శారదా, రంగారెడ్డి జిల్లాలోని కీసర ప్రాంతానికి చెందిన పి.రాజేశ్వరి అక్కడి భక్తులకు, ముత్తదువులకు వాయినం ఇచ్చారు. ‘ఇస్తినమ్మా వాయినం’ అంటూ చీరలు, జాకెట్లు ఉచితంగా దానం చేశారు. ప్రతి పుష్కరాల్లో చీరలు దానం చేయడం తమ కుటుంబ సంప్రదాయమని వారు పేర్కొన్నారు.