harthal
-
అంతటా హర్తాళ్
వైఎస్సార్సీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల నిరసనలు నో క్యాష్ బోర్డులతో విసుగు చెందిన బాధితుల మద్దతు ఓవైపు నిరసనలు.. ఇంకోవైపు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు జనంతో కలిసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు పలు ప్రాంతాల్లో స్వచ్ఛందంగా చేయూత అరెస్టులతో అణగదొక్కేందుకు సర్కారు ప్రయత్నం ప్రజాగ్రహం ముందు కుయుక్తులు బలాదూర్ నల్లధనం బయటకు తెస్తామని చెప్పి సామాన్య, మధ్య తరగతి ప్రజలను రోడ్డున పడేశారు ...చిన్న, చిన్న అవసరాలకు కూడా అవస్థలు పడాల్సిన పరిస్థితి. బ్యాంకులకు వెళ్తే నో క్యాష్ బోర్డులు ప్రత్యక్షం...ఏటీఎంలను ఆశ్రయిస్తే అక్కడా నిరాశే ఎదురవడంతో అన్ని వర్గాల ప్రజల ఇక్కట్లు తారస్థాయికి చేరాయి. ఈ కష్టాలనుంచి తక్షణం గట్టెక్కించాలని సోమవారం విపక్షాలు ఇచ్చిన పిలుపును అందుకొని అన్ని వర్గాలూ నిరసన గళాలు వినిపించి హర్తాళ్‌ను జయప్రదం చేశాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : గడచిన మూడు వారాలుగా పెద్ద నోట్ల రద్దుతో జిల్లాలో సామాన్య, మధ్య తరగతి వర్గాలు పడుతున్నపాట్లు ప్రజాగ్రహం రూపంలో హర్తాళ్ ప్రతిధ్వనించింది. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతుతో వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రాజోలు తదితర ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. హర్తాళ్‌కు సంఘీభావంగా సినిమా హాళ్ల యాజమాన్యాలు ఉదయం ఆటను నిలిపివేశాయి. పెద్ద నోట్లు రద్దుతో ప్రజల ఇబ్బందులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు వేర్వేరుగా ఇచ్చిన పిలుపుతో సోమవారం ఆయా పార్టీల నేతలు జిల్లా అంతటా హర్తాళ్లు, నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన మంత్రి మోదీ దిష్టిబొమ్మలను పలుచోట్ల దహనం చేశారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద నగదు కోసం క్యూల్లో గంటల తరబడి నిలబడ్డ జనం విసుగు చెంది ర్యాలీల్లో పాల్గొనడం కనిపించింది. కాకినాడలో భారీ మోటార్ ర్యాలీ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో సర్పవరం, భానుగుడి, మెయి¯ŒSరోడ్డు, బాలాజీచెర్వు సెంటర్ మీదుగా భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు పాల్గొన్నారు. కాకినాడ సిటీలో పార్టీ నగర అధ్యక్షుడు రాగిరెడ్డి ఫ్రూటీకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ హాజరుకాగా, రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి గోవిందు తదితరులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. సీపీఐ, సీపీఎం నాయకులు వేరుగా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి తలలేని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, అమ్ఆద్మీ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి పళ్లంరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరంలో పోలీసుల జులుం రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డు సహా పలు ప్రాంతా ల్లో వ్యాపార్లు హర్తాళ్‌కు మద్ధతుగా దుకాణాలు మూసివేసి నిరసన తెలిపారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ శ్రేణులు భారీ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు చేయిచేసుకోవడంతో పోలీసులు, రాజా మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. ప్లోర్, డిప్యుటీ ఫ్లోర్‌లీడర్లు మేడపాటి షర్మిలారెడ్డి, గుత్తుల మురళీధర్, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకరచిన్ని, పోలు కిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ∙కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బోడుపాలెం వంతెన వరకు బైక్æర్యాలీ చేయగా డేవిడ్‌రాజు తదితరుల పాల్గొన్నారు. రావులపాలెం ఎన్ హెచ్‌పై మానవహారం నిర్వహించిన కాంగ్రెస్ ఇన్ చార్జి ఆకుల రామకృష్ణ, సీపీఐ నాయకులు రామిరెడ్డి సహా 21 మందిని పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. సామర్లకోటలో ర్యాలీ చేస్తున్న సమయంలో బస్ కాంప్లెక్ వద్ద వైఎస్ఆర్ సీపీ కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడుతోపాటు 20 మందిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. పెద్దాపురంలో సీపీఐ, సీపీఎం, వైఎస్ఆర్ సీపీ నాయకులు ప్రదర్శనలు నిర్వహించారు. ∙రంపచోడవరం ఏజెన్సీ గంగవరం రహదారిపై ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, అడ్డతీగలలో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ రాస్తారోకో నిర్వహించారు. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో ర్యాలీ చేయగా చర్చిసెంటర్లో సీపీఎం నాయకులు రాస్తారోకో చేశారు. ∙అమలాపురంలో వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో హైస్కూల్సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించగా రాష్ట్ర కార్యదర్శి బొమ్మి ఇజ్రాయిల్, విద్యార్థి విభాగం జక్కంపూడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులు మోర్త రాజశేఖర్, కె సత్తిబాబు తదితరులు హర్తాల్ నిర్వహించారు. రాజానగరంలో వైఎస్సార్ సీపీ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ సంయుక్తంగా బంద్ చేశాయి, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి సీతానగరంలో హర్తాళ్ నిర్వహించారు. పి.గన్నవరం కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు తదితరులు మామిడికుదురు సెంటర్ నుంచి మండల రెవెన్యూ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన, అక్విడెక్ట్ వద్ద రాస్తారోకో చేశారు. వైఎస్ఆర్ సీపీ కో–ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆ««దl్వర్యంలో అనపర్తిలో జరిగిన హర్తాళ్‌లో అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి తదితరులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. పెదపూడిలో సీపీఐ (ఎంఎల్), ఐఎఫ్టీయు నాయకులు ఎండీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ∙వైఎస్ఆర్సీపీ కో–ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట, గోకవరంలలో ర్యాలీ నిర్వహించి బంద్ చేయించారు. ముమ్మిడివరంలో 216 జాతీయ రహదారిపై కో–ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్‌కు ఆటంకం ఏర్పడింది.వ్యాపారులు స్వచ్ఛందం గా దుకాణాలు మూసి వేసి మద్ధతు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ కో–ఆర్డినేటర్ పర్వత ప్రసాద్, సీపీఎం ఆధ్వర్యంలో ఏలేశ్వరం, ప్రత్తిపాడులో బంద్ పాటించారు. ఏలేశ్వరంలో ప్రసాద్ ఆధ్వర్యంలో రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు. సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ప్రధాని మోదీ దిష్టిబొమ్మ ఊరేగించి అంత్యక్రియలు నిర్వహించించారు. రాజమండ్రి రూరల్ కో–ఆర్డినేటర్ గిరిజాల బాబు కడియంలో బైక్‌ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూయించే సందర్భంలో పోలీసులు అరెస్టు చేసి బొమ్మూరు స్టేషనకు తరలించారు. మరో కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ధవళేశ్వరంలో రాజమండ్రిలో బంద్ నిర్వహించారు. మండపేటలో కో–ఆర్డినేటర్ వేగుళ్ళపట్టాభి రామయ్యచౌదరి ఆధ్వర్యంలో కలవపువ్వు సెంటర్లో రాస్తారోకో చేశారు. రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ పాల్గొన్నారు. మరో కో–ఆర్డినేటర్ వేగుళ్ళ లీలాకృష్ణ ఆధ్వర్యంలో పెదకాలువ వంతెన వద్ద «రాస్తారోకో చేశారు. రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, మూడు మండలాల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యాన తునిలో బంద్ నిర్వహించి బైక్‌ర్యాలీ నిర్వహించారు. రాజోలు జాతీయ రహదారిపై వైఎస్ఆర్సీపీ, సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. -
హర్తాళ్ ప్రశాంతం
మూతపడిన విద్యాసంస్థలు తెరుచుకోని దుకాణాలు జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు నేతల అరెస్ట్ సాక్షి ప్రతినిధి, ఏలూరు : తగిన ఏర్పాట్లు చేయకుండా పెద్దనోట్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ.. నోట్ల రద్దు సందర్భంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు సోమవారం జిల్లాలో తలపెట్టిన హర్తాళ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పలుచోట్ల నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. పలుచోట్ల వాణిజ్య, వ్యాపార సంస్థళను స్వచ్ఛందంగా మూసివేశారు. జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు జరిగాయి. పోలీస్ బందోబస్తు నడుమ ఆర్టీసీ బస్సులను నడిపారు. సరైన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా పెద్దనోట్లను రద్దు చేయడాన్ని, అనంతరం తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాలను విపక్ష నేతలు ఎండగట్టారు. వైఎస్సార్ సీపీ, ఇతర ప్రతిపక్ష నేతలు తణుకు నరేంద్ర సెంటర్లో ధర్నా నిర్వహించి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి బయలుదేరారు. వెంకటేశ్వర థియేటర్ వద్ద మోహరించిన పోలీసులు ర్యాలీని అడ్డుకుని నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు సహా 27 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పాలకొల్లులో గాంధీబొమ్మల సెంటర్లో హర్తాళ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అదనపు కన్వీనర్ గుణ్ణం నాగబాబు, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ చెల్లెం ఆనందప్రకాష్ నేతృత్వం వహించారు. కార్యక్రమంలో వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, సీపీఎం, న్యూడెమోక్రసీ నాయకుల ఆధ్వర్యంలో బుట్టాయగూడెంలో ర్యాలీ, మానవహారం, రాస్తారోకో చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పోలవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. చింతలపూడి బోసుబొమ్మ సెంటర్లో జరిగిన ధర్నాలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దయాల నవీన్‌బాబు, కామవరపుకోటలో నియోజకవర్గ కన్వీనర్ ఘంటా మురళీరామకృష్ణ, జంగారెడ్డిగూడెంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. తాడేపల్లిగూడెంలో ఉదయం 5 గంటలకే ఆర్టీసీ డిపోకు చేరుకుని బస్సులను రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైఎస్సార్ సీపీ, వామపక్ష పార్టీలకు చెందిన 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పట్టణంలో, పెంటపాడు మండలంలో ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ, సీపీఎం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కొవ్యూరు విజయవిహార్ సెంటర్లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తానేటి వనిత ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడి నిరసన తెలియచేశారు. Üసీపీఎం, సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ నాయకుల ఆ«ధ్వర్యంలో ర్యాలీ జరిగింది. పెనుమంట్ర మండలం మార్టేరులో ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆచంటలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఏలూరులో వామపక్షాల నాయకులు జూట్‌మిల్లు వద్ద ధర్నా నిర్వహించారు. వైఎసార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, మంచెం మైబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నగరంలో ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూసివేయాల్సిందిగా కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. నిడదవోలులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ ఎస్.రాజీవ్‌కృష్ణ ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్ల ర్యాలీ జరిగింది. 35 మంది సీపీఎం, సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు నేతృత్వంలో హర్తాళ్ జరిగింది. పలుచోట్ల రాస్తారోకో, «ధర్నా ర్యాలీలు నిర్వహించారు. ఉంగుటూరు మండలంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యాసంస్థలను మూయించి వేశారు. భీమడోలులో రాస్తారోకో నిర్వహించారు. నిడమర్రు, గణపవరంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. బీమవరంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు కోడే యుగంధర్, కౌన్సిలర్లు గాదిరాజు సత్యవెంకటసుబ్రహ్మణ్యం రాజు, భూసారపు సాయిసత్యనారాయణ, పాలవెల్లి మంగ, సీపీఐ నాయకుడు మంతెన సీతారామ్‌ప్రసాద్, సీపీఎం నాయకులు మంతెన సీతారామ్, జేఎన్వీ గోపాలన్, బీవీ వర్మ తదితరుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. నరసారంలో విద్యాసంస్థలు, వ్యాపారవర్గాలు స్వచ్ఛందంగా హర్తాళ్‌కు మద్దతు తెలిపాయి. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ , కాంగ్రె పార్టీల నాయకులు బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని రాస్తారోకో చేపట్టారు. నరసాపురం సీఐ పిరామచంద్రరావు, ఎస్సైలు కె.చంద్రశేఖర్, కె.సతీష్‌కుమార్ వచ్చి ఆందోళనను భగ్నం చేసారు. దీంతో ఆందోళనకారులు శివాలయం సెంటర్ వరకూ ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడీ రాజు, సీపీఎం డివిజన్ కార్యదర్శి కవురు పెద్దిరాజు తదితరులు నేతృత్వం వహించారు. దెందులూరులో విద్యాసంస్థలను మూయించివేశారు. ఉండిలో వైఎస్సార్ కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఆకివీడులో వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. -
హర్తాళ్ సక్సెస్
అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహణ మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తిల హౌస్ అరెస్ట్ నిరసనను అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు హర్తాళ్‌కు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల మద్దతు పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నేతల అరెస్టులు గుంటూరులో బస్సులను అడ్డుకున్న ఎమ్మెల్యే ముస్తఫా, అప్పిరెడ్డి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ సాక్షి, గుంటూరు : పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు పడుతున్న ఇబ్బందులు పరిష్కరించకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ, అఖిల పక్షాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలో జరిగిన హర్తాళ్ కార్యక్రమం విజయవంతమైంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలీసులు తెల్లవారుజాము నుంచే భారీగా రోడ్లపైకి చేరి హర్తాళ్ కార్యక్రమాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. అయితే గుంటూరు నగరంతోపాటు అనేక నియోజకవర్గాల్లో వ్యాపారులు దుకాణాలు మూసివేసి హర్తాళ్‌కు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌తో పాటు, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిలను పోలీసులు తెల్లవారుజామునే హౌస్ అరెస్టులు చేశారు. భారీగా అరెస్టులు... గుంటూరు నగరంలో ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, లాల్పురం రాము, కిలారి రోశయ్యల ఆధ్వర్యంలో భారీగా పార్టీ శ్రేణులు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బైఠాయించి కొంత సేపు అడ్డుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరి పాతబస్టాండ్, మార్కెట్, హిందూ కళాశాల మీదుగా లాడ్జిసెంటర్ నుంచి మదర్‌థెరిస్సా విగ్రహం వరకు సాగారు. ముందుగా జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. శాంతియుతంగా ర్యాలీలు చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యానికి దిగడంపై గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, వైఎస్సార్సీపీకి మద్దతు తెలుపుతూ హర్తాళ్‌లో పాల్గొన్నారు. గుంటూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ నేతలు హర్తాళ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు వైఎస్సార్సీపీకి చెందిన 35 మందిని, కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మందిని, సీపీఐకి చెందిన 15 మందిని అరెస్టు చేశారు. రాస్తారోకోలు, మానవహారాలు... మాచర్ల పట్టణంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డిల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. నరసరావుపేట పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్‌గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హర్తాళ్ నిర్వహించారు. మల్లమసెంటర్లో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాలు కూడా హర్తాళ్ నిర్వహించాయి. సత్తెనపల్లి పట్టణంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నేతృత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ప్రదర్శన నిర్వహించి గడియారస్తంభం సెంటర్లో మానవహారం ఏర్పాటుచేశారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్తాళ్‌లో పాల్గొన్నారు. పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో ప్రదర్శన జరిపి హర్తాళ్ నిర్వహించారు. వినుకొండలో పార్టీ సమన్వకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై పట్టణంలో ప్రదర్శన చేపట్టారు. శివయ్య స్థూపం వద్ద కొంతసేపు నిరసన తెలిపారు. సీపీఐ, సీపీఎం నాయకులు మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి హర్తాళ్ చేశారు. తెనాలి పట్టణంలో సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా మార్కెట్ యార్డు నుంచి ప్రదర్శనగా ఆర్డీవో కార్యాలయం వరకు వెళ్లి ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. పట్టణంలో షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ నేతలు వేర్వేరుగా హర్తాళ్ నిర్వహించారు. తాడికొండ అడ్డరోడ్డు వద్ద వైఎస్సార్సీపీ సమన్వయకర్త కత్తెర హెనిక్రిస్టినా ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ, సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. మంగళగిరిలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు యేళ్ళ జయలక్ష్మి, ఎంపీపీ పచ్చల రత్నకుమారి ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి హర్తాళ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం నేతలు మద్దతు తెలిపారు. పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్‌ను హౌస్ అరెస్టు చేసినప్పటికీ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించి, హర్తాళ్‌ను విజయవంతం చేశారు. సీపీఐ, సీపీఎం నేతలు విడిగా హర్తాళ్ నిర్వహించారు. గురజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తిని హౌస్ అరెస్టు చేసినప్పటికీ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్తాళ్ జరిపారు. బాపట్ల పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో హర్తాళ్ నిర్వహించారు. సీపీఐ, సీపీఎం నాయకులు హర్తాళ్‌కు మద్దతు పలికారు. ప్రత్తిపాడులో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై హర్తాళ్ నిర్వహించారు. షాపులు మూయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు హర్తాళ్‌కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. రేపల్లె, వేమూరు, పెదకూరపాడు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని హర్తాళ్ నిర్వహించారు. -
ఇబ్బందులు చెప్పేందుకే హర్తాళ్‌కు మద్దతు
వైఎస్సార్ సీపీ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు రాజా నగరం (మామిడికుదురు) : పెద్ద నోట్ల రద్దును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నప్పటికీ, దాని వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో ప్రభుత్వ విఫలమవడం వల్లే హర్తాళ్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఆ పార్టీ యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తెలిపారు. నగరంలో కటకంశెట్టి పాండురంగారావు నివాస గృహంలో ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రైతులు, కార్మికులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజా అన్నారు. నోట్ల రద్దు వల్ల ఏర్పడే సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కాపులను బీసీల జాబితాల్లో చేరుస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారని దాన్ని అమలు చేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. బీసీలకు అన్యాయం జరుగకుండా, వారికి ఇబ్బంది లేకుండా కాపులను బీసీల జాబితాల్లో చేర్చాలన్నదే తమ డిమాండ్ అన్నారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహ¯ŒS అన్నారు. సమావేశంలో పి.గన్నవరం కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, నాయకులు పేరి శ్రీనివాస్, బొలిశెట్టి భగవాన్, అడ్డగళ్ల సాయిరామ్, గుత్తుల బాబి, ఎంఎం శెట్టి, జక్కంపూడి వాసు, కిరణ్ పాల్గొన్నారు.