అంతటా హర్తాళ్
అంతటా హర్తాళ్
Published Tue, Nov 29 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM
వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల నిరసనలు
నో క్యాష్ బోర్డులతో విసుగు చెందిన బాధితుల మద్దతు
ఓవైపు నిరసనలు.. ఇంకోవైపు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు
జనంతో కలిసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు
పలు ప్రాంతాల్లో స్వచ్ఛందంగా చేయూత
అరెస్టులతో అణగదొక్కేందుకు సర్కారు ప్రయత్నం
ప్రజాగ్రహం ముందు కుయుక్తులు బలాదూర్
నల్లధనం బయటకు తెస్తామని చెప్పి సామాన్య, మధ్య తరగతి ప్రజలను రోడ్డున పడేశారు ...చిన్న, చిన్న అవసరాలకు కూడా అవస్థలు పడాల్సిన పరిస్థితి. బ్యాంకులకు వెళ్తే నో క్యాష్ బోర్డులు ప్రత్యక్షం...ఏటీఎంలను ఆశ్రయిస్తే అక్కడా నిరాశే ఎదురవడంతో అన్ని వర్గాల ప్రజల ఇక్కట్లు తారస్థాయికి చేరాయి. ఈ కష్టాలనుంచి తక్షణం గట్టెక్కించాలని సోమవారం విపక్షాలు ఇచ్చిన పిలుపును అందుకొని అన్ని వర్గాలూ నిరసన గళాలు వినిపించి హర్తాళ్‌ను జయప్రదం చేశాయి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : గడచిన మూడు వారాలుగా పెద్ద నోట్ల రద్దుతో జిల్లాలో సామాన్య, మధ్య తరగతి వర్గాలు పడుతున్నపాట్లు ప్రజాగ్రహం రూపంలో హర్తాళ్ ప్రతిధ్వనించింది. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతుతో వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రాజోలు తదితర ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. హర్తాళ్‌కు సంఘీభావంగా సినిమా హాళ్ల యాజమాన్యాలు ఉదయం ఆటను నిలిపివేశాయి. పెద్ద నోట్లు రద్దుతో ప్రజల ఇబ్బందులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు వేర్వేరుగా ఇచ్చిన పిలుపుతో సోమవారం ఆయా పార్టీల నేతలు జిల్లా అంతటా హర్తాళ్‌లు, నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన మంత్రి మోదీ దిష్టిబొమ్మలను పలుచోట్ల దహనం చేశారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద నగదు కోసం క్యూల్లో గంటల తరబడి నిలబడ్డ జనం విసుగు చెంది ర్యాలీల్లో పాల్గొనడం కనిపించింది.
కాకినాడలో భారీ మోటార్ ర్యాలీ...
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో సర్పవరం, భానుగుడి, మెయి¯ŒSరోడ్డు, బాలాజీచెర్వు సెంటర్ మీదుగా భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు పాల్గొన్నారు. కాకినాడ సిటీలో పార్టీ నగర అధ్యక్షుడు రాగిరెడ్డి ఫ్రూటీకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ హాజరుకాగా, రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి గోవిందు తదితరులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. సీపీఐ, సీపీఎం నాయకులు వేరుగా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి తలలేని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, అమ్‌ఆద్మీ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి పళ్లంరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
రాజమహేంద్రవరంలో పోలీసుల జులుం
రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డు సహా పలు ప్రాంతా ల్లో వ్యాపార్లు హర్తాళ్‌కు మద్ధతుగా దుకాణాలు మూసివేసి నిరసన తెలిపారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ శ్రేణులు భారీ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు చేయిచేసుకోవడంతో పోలీసులు, రాజా మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. ప్లోర్, డిప్యుటీ ఫ్లోర్‌లీడర్‌లు మేడపాటి షర్మిలారెడ్డి, గుత్తుల మురళీధర్, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకరచిన్ని, పోలు కిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
∙కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బోడుపాలెం వంతెన వరకు బైక్æర్యాలీ చేయగా డేవిడ్‌రాజు తదితరుల పాల్గొన్నారు. రావులపాలెం ఎన్ హెచ్‌పై మానవహారం నిర్వహించిన కాంగ్రెస్ ఇన్ చార్జి ఆకుల రామకృష్ణ, సీపీఐ నాయకులు రామిరెడ్డి సహా 21 మందిని పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. సామర్లకోటలో ర్యాలీ చేస్తున్న సమయంలో బస్ కాంప్లెక్ వద్ద వైఎస్‌ఆర్ సీపీ కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడుతోపాటు 20 మందిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. పెద్దాపురంలో సీపీఐ, సీపీఎం, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ప్రదర్శనలు నిర్వహించారు.
∙రంపచోడవరం ఏజెన్సీ గంగవరం రహదారిపై ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, అడ్డతీగలలో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ రాస్తారోకో నిర్వహించారు. పిఠాపురంలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయం నుంచి కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో ర్యాలీ చేయగా చర్చిసెంటర్‌లో సీపీఎం నాయకులు రాస్తారోకో చేశారు.
∙అమలాపురంలో వైఎస్‌ఆర్‌సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో హైస్కూల్‌సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించగా రాష్ట్ర కార్యదర్శి బొమ్మి ఇజ్రాయిల్, విద్యార్థి విభాగం జక్కంపూడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులు మోర్త రాజశేఖర్, కె సత్తిబాబు తదితరులు హర్తాల్ నిర్వహించారు. రాజానగరంలో వైఎస్సార్ సీపీ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ సంయుక్తంగా బంద్ చేశాయి, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి సీతానగరంలో హర్తాళ్ నిర్వహించారు. పి.గన్నవరం కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు తదితరులు మామిడికుదురు సెంటర్ నుంచి మండల రెవెన్యూ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన, అక్విడెక్ట్ వద్ద రాస్తారోకో చేశారు. వైఎస్‌ఆర్ సీపీ కో–ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆ««దl్వర్యంలో అనపర్తిలో జరిగిన హర్తాళ్‌లో అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి తదితరులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. పెదపూడిలో సీపీఐ (ఎంఎల్), ఐఎఫ్‌టీయు నాయకులు ఎండీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు.
∙వైఎస్‌ఆర్‌సీపీ కో–ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట, గోకవరంలలో ర్యాలీ నిర్వహించి బంద్ చేయించారు. ముమ్మిడివరంలో 216 జాతీయ రహదారిపై కో–ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్‌కు ఆటంకం ఏర్పడింది.వ్యాపారులు స్వచ్ఛందం గా దుకాణాలు మూసి వేసి మద్ధతు ఇచ్చారు. వైఎస్‌ఆర్‌సీపీ కో–ఆర్డినేటర్ పర్వత ప్రసాద్, సీపీఎం ఆధ్వర్యంలో ఏలేశ్వరం, ప్రత్తిపాడులో బంద్ పాటించారు. ఏలేశ్వరంలో ప్రసాద్ ఆధ్వర్యంలో రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు. సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ప్రధాని మోదీ దిష్టిబొమ్మ ఊరేగించి అంత్యక్రియలు నిర్వహించించారు. రాజమండ్రి రూరల్ కో–ఆర్డినేటర్ గిరిజాల బాబు కడియంలో బైక్‌ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూయించే సందర్భంలో పోలీసులు అరెస్టు చేసి బొమ్మూరు స్టేషనకు తరలించారు. మరో కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ధవళేశ్వరంలో రాజమండ్రిలో బంద్ నిర్వహించారు. మండపేటలో కో–ఆర్డినేటర్ వేగుళ్ళపట్టాభి రామయ్యచౌదరి ఆధ్వర్యంలో కలవపువ్వు సెంటర్‌లో రాస్తారోకో చేశారు. రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ పాల్గొన్నారు. మరో కో–ఆర్డినేటర్ వేగుళ్ళ లీలాకృష్ణ ఆధ్వర్యంలో పెదకాలువ వంతెన వద్ద «రాస్తారోకో చేశారు. రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, మూడు మండలాల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యాన తునిలో బంద్ నిర్వహించి బైక్‌ర్యాలీ నిర్వహించారు. రాజోలు జాతీయ రహదారిపై వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు.
Advertisement