Hayathnagar mandal
-
అక్కకు బై చెప్పేందుకు వెళ్లి.. ఒక్కసారిగా..
సాక్షి, హైదరాబాద్: స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ పసివాడి ప్రాణాన్ని బలితీసుకుంది. అక్కను బస్సు ఎక్కించేందుకు బస్సు దగ్గరికి వెళ్లిన బాలుడు బస్సు ముందు టైరు కింద పడి మృతి చెందిన సంఘటన గురువారం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం, జనంపల్లికి చెందిన తన్నీరు శ్రీకాంత్ పోస్ట్‌మెన్‌గా పనిచేస్తూ పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీలోని కుంట్లూరు గణేష్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతనికి కుమార్తె నిషిక, కుమారుడు పవన్ హర్షకుమార్(3) సంతానం. గురువారం ఉదయం పెద్దఅంబర్‌పేట్‌లోని కాండర్‌షైన్ పాఠశాలలో చదువుతున్న తన కుమార్తెను స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా అతడి కుమారుడు హర్ష కూడా బస్సు వద్దకు వచ్చాడు. అక్కడే ఉన్న బస్సు అటెండర్ మల్లారెడ్డి బాలుడిని గమనించకపోవడంతో బస్సు డ్రైవర్ ఈశ్వర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సును ముందుకు తీశాడు. దీంతో బస్సు ముందు చక్రాలు చిన్నారి తలపై వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ల ముందే కొడుకు ప్రాణాలు పోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా విలపించారు. దీనిని గుర్తించిన కాలనీ వాసులు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చెయ్యి కొరికి మరీ నగలు దోచేశారు
-
చెయ్యి కొరికి మరీ నగలు దోచేశారు
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారుల్లో దోపిడి దొంగల ముఠా గురువారం అర్థరాత్రి రెచ్చిపోయింది. చౌటుప్పల్ నుంచి ఎల్బి నగర్ వైపు వస్తున్న స్టీల్ వ్యాపారీపై దోపిడి దొంగలు దాడి చేసి... అతడి వద్ద నుంచి నగదు, నగలను దోచుకున్నారు. అయితే అతడి చేతి వేళ్లకి ధరించిన ఉంగరాలు ఇవ్వాలని సదరు వ్యాపారీని దొంగలు డిమాండ్ చేశారు. అందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన దొంగలు... ఉంగారాలు ఎందుకు ఇవ్వవంటూ... చేతిని నోటితో కొరికి మరీ ఉంగారాలు లాక్కున్నారు. అనంతరం దొంగలు అక్కడి నుంచి పరారయారు. రక్తము కారుతున్న చేతితో బాధితుడు హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన హయత్ నగర్ మండలం ఇనామ్ గూడ వద్ద చోటు చేసుకుంది. -
హయత్‌నగర్‌లో దొంగలు బీభత్సం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూర్‌లో గత అర్థరాత్రి ఓ ఇంట్లో దొంగలు చోరబడి బీభత్సం సృష్టించారు. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులను బంధించి... 20 తులాల బంగారంతోపాటు రూ. 50 వేల నగదును చోరీ చేశారు. అనంతరం దొంగలు అక్కడి నుంచి పరారైయారు. స్థానికుల సహాయంతో బాధితులు గురువారం ఉదయం హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాస్ ట్యాంకర్ బోల్తా: డ్రైవర్ మృతి
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారుల్లోని హయత్‌నగర్ మండలం కొత్తగూడెం చౌరస్తాలో శుక్రవారం ఇండియన్ అయిల్ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఆ ఘటనలో డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సహా అక్కడికి చేరుకున్నారు. ట్యాంకర్ నుంచి లీక్ అవుతున్న గ్యాస్‌ను అగ్నిమాపక సిబ్బంది అరికట్టారు. అనంతరం ట్యాంకర్‌ను రోడ్డుపై నుంచి పక్కకు జరిపారు. మృతి చెందిన డ్రైవర్ మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన సుమో: ఇద్దరు మృతి
హయత్‌నగర్ మండలం పెద్ద అంబర్‌పేట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని టాటా సుమో ఢీ కొట్టింది. ఆ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన రెండు మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ మండలం విటాయ్పల్లి గ్రామ సమీపంలో కారు చెట్టును ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామస్తులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు డా.శరత్మోహన్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. శరత్మోహన్ కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యునిగా విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.