చెయ్యి కొరికి మరీ నగలు దోచేశారు | Businessman attacked by gang in robbery at Hayathnagar Mandal | Sakshi
Sakshi News home page

చెయ్యి కొరికి మరీ నగలు దోచేశారు

Published Fri, Sep 26 2014 8:17 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Businessman attacked by gang in robbery at Hayathnagar Mandal

హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారుల్లో దోపిడి దొంగల ముఠా గురువారం అర్థరాత్రి రెచ్చిపోయింది. చౌటుప్పల్ నుంచి ఎల్బి నగర్ వైపు వస్తున్న స్టీల్ వ్యాపారీపై దోపిడి దొంగలు దాడి చేసి... అతడి వద్ద నుంచి నగదు, నగలను దోచుకున్నారు. అయితే అతడి చేతి వేళ్లకి ధరించిన ఉంగరాలు ఇవ్వాలని సదరు వ్యాపారీని దొంగలు డిమాండ్ చేశారు.

అందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన దొంగలు... ఉంగారాలు ఎందుకు ఇవ్వవంటూ... చేతిని నోటితో కొరికి మరీ ఉంగారాలు లాక్కున్నారు.  అనంతరం దొంగలు అక్కడి నుంచి పరారయారు. రక్తము కారుతున్న చేతితో బాధితుడు హయత్నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  ఈ ఘటన హయత్ నగర్ మండలం ఇనామ్ గూడ వద్ద చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement