స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. చిన్నారి మృతి
అఫ్గానిస్తాన్ స్టార్ ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతడి రెండేళ్ల కుమార్తె మృతి చెందింది. ఈ విషయాన్ని హజ్రతుల్లా టీమ్మేట్ కరీం జనత్ ధృవీకరించాడు. తన సహచరుడి కుమార్తె మృతి పట్ల జనత్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపాడు. "నా సన్నిహిత మిత్రుడు హజ్రతుల్లా జజాయ్ తన కుమార్తెను కోల్పోవడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని బరువెక్కిన హృదయంతో అందరితో పంచుకుంటున్నాను.ఈ కష్ట సమయంలో వారి కటుంబానికి దేవుడు అండగా నిలవాలని కోరుకుంటున్నాను. హజ్రతుల్లా జజాయ్ , అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని జనత్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. అయితే చిన్నారి మృతికి కారణం ఏంటి అన్నది జనత్ వెల్లడించలేదు. జజాయ్ కుమార్తె మృతి పట్ల అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా సంతాపం వ్యక్తం చేసింది.2016లో యూఏఈతో (UAE)తో జరిగిన వన్డే మ్యచ్‌తో జజాయ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అఫ్గాన్ టీ20 జట్టులో జజాయ్ కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. హజ్రతుల్లా తన కెరీర్లో ఇప్పటివరకు అఫ్గాన్ తరపున 16 వన్డేలు 45 టీ20లు ఆడాడు. వన్డేల్లో 361 పరుగులు చేయగా.. టీ20ల్లో 1160 రన్స్ చేశాడు.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న అఫ్గాన్ జట్టులో అతను భాగం కాదు. కాగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో ప్లేయర్‌గా జజాయ్ కొనసాగుతున్నాడు. జజాయ్ డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్‌పై 62 బంతుల్లో 162 పరుగులు చేశాడు.అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. జజాయ్ చివరిసారిగా 2024 డిసెంబర్లో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున ఆడాడు.చదవండి: IPL 2025 Teams And Captains: అందరూ ఇండియన్సే.. ప్యాట్ కమ్మిన్స్ ఒక్కడే View this post on Instagram A post shared by Karim Janat (@karimjanat_11)