ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ పై హైకోర్టు స్టే
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్ట్‌పై హైకోర్టు స్టే విధించింది. గుంటూరు జిల్లా సరస్వతి భూముల వ్యవహారంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వెంకట రమణా రెడ్డి, వేణుగోపాల రాజులతోపాటు మరికొంతమంది అరెస్ట్‌పై స్టే విధించింది.
తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిందితులను అరెస్ట్ చేయరాదని కోర్టు తెలిపినట్లు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు.
**