Health minister Laxma Reddy
-
పీసీసీ అధ్యక్షునిపై విమర్శలు సరికాదు: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: పార్టీలో సమస్యలుంటే అంతర్గత వేదికలపై చర్చించుకోవాలని, పీసీసీ అధ్యక్షునిపై బహిరంగంగా మాట్లాడటం సరికాదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇలా బహిరంగంగా మాట్లాడటం పార్టీకి ఏ కోణంలోనూ మంచిదికాదని, రాజకీయపార్టీల్లో గ్రూపు తగాదాలు సహజమని, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో మరణాలపై న్యాయ విచారణ జరిపించాలని, బాధితులకు 10 లక్షలు ఆర్థికసాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలకే మంత్రి లక్ష్మారెడ్డి పరిమితమైయ్యారని, శాఖను పట్టించుకోవడంలేదని పొంగులేటి విమర్శించారు. రైతు సమితుల పేరుతో టీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాన్ని కోరుకుంటున్నదని మండిపడ్డారు. వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై టీఆర్ఎస్ నేతల దాడిని ఖండించిన పొంగులేటి నల్లగొండ పార్లమెంటుకు ఉప ఎన్నికలు కాదు, మొత్త రాష్ట్రంలో ఎన్నికలు జరిపితే టీఆర్ఎస్ అసలు బలం ఏమిటో తేలిపోతుందన్నారు. అధికార దుర్వినియోగం, విచ్చలవిడిగా డబ్బు పంపిణీ లేకుండా టీఆర్ఎస్ ఎక్కడా గెలవదని జోస్యం చేప్పారు. -
ఈ-పీహెచ్‌సీల్లో ఫ్రీ టెస్టులు: హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి
షాద్‌నగర్: నూతనంగా ఏర్పాటుచేస్తోన్న ఎలక్ట్రానిక్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్(ఈ-పీహెచ్సీ)లో ఔట్ పేషెంట్ సేవలేకాక ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తారని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. షాద్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన ఈ-పీహెచ్‌సీని రవాణా శాఖ మంత్రి మహేదర్‌రెడ్డితో కలిసి లక్ష్మారెడ్డి ఆదివారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం, ఈ -వైద్య సంస్థ సంయుక్తంగా ప్రయోగాత్మకంగా ఈ-పీహెచ్‌సీలను ఏర్పటుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ- హెల్త్ సెంటర్‌కు వచ్చే ప్రతి రోగి వివరాలను కంప్యూటరైజ్ చేస్తారని, దీంతో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించడం సులభతరమవుతుందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వైద్యం అందిస్తారని తద్వారా ప్రజలకు వైద్యం మరింత చేరువ అవుతుందని వివరించారు. కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యం అందించాలి
ఏటూరునాగారం : ఏజెన్సీలోని పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మా రెడ్డి అన్నారు. మంగళవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏజెన్సీ పరిధిలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పీహెచ్‌సీల్లోని సమస్యలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే మెరుగైన వైద్యం తెలంగాణ రాష్ట్రం లో అందుతుందనే స్థాయికి తీసుకెళ్లాలన్నారు. సర్కారు వైద్యంపై ఉన్న అపనమ్మకాన్ని పోగొట్టేలా వైద్య చికిత్సలు ప్రజలకు అందాలని కోరారు. ఈ రెండేళ్ల పాలనలో సర్కారు దవాఖానాల్లో ఓపీ, ఐపీ, డెలవరీలు పెరిగాయని వివరించారు. వరంగల్‌కు హెల్త్ హెడ్ క్వార్టర్‌గా పేరు రావడానికి స్థానిక మంత్రి చందూలాల్, జిల్లా కలెక్టర్ కరుణ, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కృషే కారణమన్నారు. వందశాతం సౌకర్యాలు కల్పిస్తాం సీఎస్సీలు, పీహెచ్‌సీలకు వంద శాతం సౌకర్యాలు కల్పించే బాధ్యత తమదని, మెరుగైన చికిత్సలు అందించే బాధ్యత వైద్యులపై ఉందని మంత్రి అన్నారు. ఇష్టంతో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహక బహుమతులు ఉంటాయని, డుమ్మాకొట్టే సిబ్బంది, వైద్యులపై చర్యలు తప్పవన్నారు. స్థానిక సామాజిక ఆస్పత్రిని 30 పడకల నుంచి 50 పడకలకు అప్‌గ్రేడ్ 15 రోజుల్లో చేసేలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే పహరీ నిర్మాణంతోపాటు కౌంటింగ్ మిషన్, అల్ట్రా సౌండ్ స్కానర్, బెడ్స్, ప్రసూతి ఆస్పత్రికి సామగ్రి అందజేస్తామన్నారు. సీజనల్ వ్యాధులపై దృష్టిపెట్టాలి ఏజెన్సీలో సీజనల్ వ్యాధులపై అందరూ దృష్టిపెట్టాలని మంత్రి సూచించారు. 75 వేల దోమ తెరలు కావాలని మలేరియా జిల్లా వైద్యాధికారి పైడిరాజు మంత్రిని కోరారు. అవి కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రం నుంచైనా వచ్చేలా చూస్తానని మంత్రి అన్నారు. ప్రతి ఆస్పత్రిలో ల్యాబ్ పరీక్షలు జరగాలని, బయటకు పంపించొద్దని చెప్పారు. పరీక్షలతో రోగాలు తెలిసి సరైన వైద్యం అందుతుందన్నారు. కళాజాత ప్రోగ్రాంలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ సాంబశివరావును ఆదేశించారు. మూఢనమ్మకాలు వీడాలి ఏజెన్సీ ప్రజలు మూఢనమ్మకాలతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని, వాటిని వీడాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్ అన్నారు. రొయ్యూర్ పీహెచ్సీలో వైద్యులు లేక రోగులు రావడం లేదని, మూడు నెలల వరకు రోగుల సంఖ్య పెంచాలని వైద్యాధికారి రవికుమార్‌ను ఆదేశించారు. హరితహారం కూడా వైద్యశాఖకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయాలని సూచించారు. సమీక్షలో పీఓ అమయ్‌కుమార్, జెడ్పీటీసీ వలియాబీ, ఎంపీపీ మెహరున్నీసా, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీసీహెచ్ఓ సంజీవయ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ అప్పయ్య, ఏపీఓ వసంతరావుతోపాటు అధికారులు పాల్గొన్నారు. అనంతరం సీజనల్ వ్యాధులపై రూపొందించిన పోస్టర్‌ను మంత్రులు ఆవిష్కరించారు. -
వైద్య సేవలు మెరుగుపరుస్తాం
వికారాబాద్ రూరల్ : వైద్య సేవలు సామాన్యుడికి చేరువయ్యేలా మెరుగుపరుస్తామని రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. అనంతగిరిలో ఆయూష్ ఆధ్వర్యంలో శనివారం హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగాఽ రాష్ర్ట రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి వికారాబాద్ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో వార్డు వార్డుకు తిరిగి పరిశీలించారు. రోగులతో వైద్య సేవల తీరుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులకు సరఫరా చేసే మందుల గదికి వెళ్లి ఏ ఏ మందులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకున్నారు. వర్షాకాలంలో సీజన్ వ్యాధులు విజృంభించే నేపథ్యంలో మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. త్వరలో 100 పడకల ఆస్పత్రి పూర్తవుతుందని, పనులు ప్రారంభమై శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అప్పటి వరకు ఈ ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆస్పత్రిలో డాక్టర్ల కొరత ఉందని పలువురు తెల్పడంతో చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. మార్చురీ కూడా ఇబ్బందులు వస్తున్నాయని రైల్వేకు జనరల్‌కు ఒకే మార్చురీకి కావడంతో ఒక్కో రోజు ఐదు మృతదేహాలు అక్కడ ఉంటున్నాయని మంత్రి దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. దీంతో వెంటనే దాని గురించి అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రుల వెంట ఎమ్మెల్యే సంజీవరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, వైస్ చైర్మన్ సురేష్, జెడ్పీటీసీ ముత్తార్ షరీఫ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, కార్మిక విభాగం అధ్యక్షుడు కృష్ణ, టీఆర్ఎస్వీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శుభప్రద్‌పటేల్, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.