గుండె పోటుతో రైతు మృతి
తురకలాపట్నం(రొద్దం) : మండల పరిధిలోని తురకలాపట్నం గ్రామంలో రైతు ఈశ్వరప్ప(40) శనివారం గుండెపోటుతో మతి చెందారు. ఉదయం ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో ఆయన ఇంట్లోనే కుప్పుకూలిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఐకేపీ అధికారులు మతుడి కుటుంబానికి తక్షణసాయం కింద రూ.5 వేలు అందజేశారు.
చంద్రన్న బీమా కింద ఆ కుటుంబానికి రూ.30 వేలు వస్తుందని, మిగిలిన రూ.25 వేలు భార్య సునందమ్మ ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ఎంపీటీసీ కమలమ్మ, పంచాయతీ కార్యదర్శి శాంతి, బీమా మిత్ర అంజినమ్మ తదితరులు ఈశ్వరప్ప కుటుంబీకులకు సంతాపం తెలిపారు.