ఈ చేతిరేఖలు మీకున్నాయేమో చూసుకోండి!
హస్తవాసి మంచిగుండాలేగానీ పట్టిందల్లా బంగారం అంటుంటారు. 21 శతాబ్ధంలోకి అడుగుపెట్టినా, సాంకేతిక పరిజ్ఞానం కుప్పలుగా పుట్టుకొస్తున్నా నేటికి మనవాళ్లకు జాతకాలు పిచ్చి మాత్రం వదలదు. తప్పని అనకూడదు కానీ, జీవితంలో జాతకాలు చూపించుకోవడం ఒక సాంప్రదాయంగా ఉండిపోయింది. ఆపద సమయాల్లో, జరగకూడనివి జరుగుతున్నప్పుడు జాతకాలు బాగా గుర్తుకొస్తుంటాయి. ఆ సమయంలో సాధరణంగా జ్యోతిష్యులను ఆశ్రయిస్తుంటారు.
అందులో ముఖం చూసి చెప్పేవారు, చేయి చూసి చెప్పేవారు, పుట్టిన సమయం ఆధారంగా జాతకం చెప్పేవారు ఇలా రకరకాలుగా ఉన్నారు. ముఖ్యంగా హస్త రేఖలు చూసి చెప్పే జాతకాలే సరైనవని ఎక్కువమంది నమ్ముతుంటారు. సాధారణంగా మన చేతిలో మూడు గీతలు ఉంటే అందులో వేళ్లకు దగ్గరగా ఉన్న మూడో గీతను హార్ట్ లైన్ అంటారు. ఈ హార్ట్ లైన్ ఆధారంగా ఎవరి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. ఈ క్రింద ఎ,బి,సి,డి కేటగిరీల్లో ఆ జాతక ఫలాల వివరాలు ఉన్నాయి.
(ఎ) అర చేతిలోని మూడో గీత(హార్ట్ లైన్) మధ్య వేలుకు కొంచెం కింది నుంచి ప్రారంభమైతే మీరు నాయకుడిగా రాణిస్తారంట. మంచి లక్ష్యాన్ని కలిగిఉండటంతోపాటు స్వతంత్ర్యంగా వ్యవహరిస్తూ తెలివితో ముందుకెళతారట. అంతేకాదు నిర్ణయాలు కూడా స్వయంగా తీసుకొని విజయం సాధిస్తారంట. కొంచెం తక్కువ సున్నితత్వాన్ని కలిగి ఉండి ఇతరుల విషయంలో మాత్రం నిర్మలంగా వ్యవహరిస్తారంట.
(బి) హార్ట్ లైన్ మధ్య వేలు చూపుడు వేలుకు మధ్యలో నుంచి ప్రారంభమైతే ఆ వ్యక్తులు దయగలవారై ఉంటారంట. ఎదుటవారు చెప్పిన అంశాలు పరిగణనలోకి తీసుకుంటారంట. మంచి సూచన ప్రాయంగా ఉంటారంట. తన తోటి వారు ఏవైన తప్పులు చేస్తే నిర్మొహమాటం లేకుండా హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. వారి మాటలు ఎదుటి వ్యక్తులు కూడా నమ్ముతారు. నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తారు.
(సి) చూపుడు వేలుకు కింద నుంచి హార్ట్ లైన్ స్టార్ట్ అయిన వ్యక్తులు (ఎ)లో కేటగిరిలో చెప్పినట్లుగా ఉంటారు.
(డి) హార్ట్ లైన్ చూపుడు వేలకు బొటన వేలుకు మధ్య నుంచి ప్రారంభమైతే మంచి సహనం కలిగినవారిగా ఉండటంతోపాటు సంరక్షణ సామర్థ్యం కలిగి ఉంటారు. మంచి ఆలోచనలు కలిగి ఉండి సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు.