సేవతో తృప్తి
‘సేవా కార్యక్రమాలకు చేయూతని అందించడం ద్వారా ఎంతో
సంతృప్తి కలుగుతుంది’ అన్నారు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్. గతంలో హుద్ హుద్ బాధితుల కోసం హార్డ్‌రాక్ కెఫెలో మ్యూజిక్ షో నిర్వహించి, రూ.6లక్షలు అందించామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అదే విధంగా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం కోసం ఈ నెల 28న శిల్పకళావేదికలో సాయంత్రం 6గంటల నుంచి సంగీత ప్రదర్శన నిర్వహించనున్నామన్నారు.
తన ట్రూప్‌తో పాటు పలువురు ప్రసిద్ధ గాయనీ గాయకులు పాల్గొంటారని, వేరే ఎటువంటి ప్రసంగాలు, ప్రదర్శనలు లేకుండా నిర్విరామంగా రెండున్నర గంటల పాటు సంగీత సందడి కొనసాగుతుందని చెప్పారు.