Heartburn
-
గుండెలో మంటా?.. కంగారొద్దు.. ఇలా చేసి చూడండి
మధ్యాహ్నం లేదా రాత్రివేళ కడుపునిండా తిన్న తర్వాత కాసేపటికి పొట్ట పైభాగం నుండి ప్రారంభమై సన్నని మంట లాంటి నొప్పి నెమ్మదిగా తీవ్రమవుతూ ఛాతీ వరకు పాకుతుంది. కొన్ని సందర్భాలలో తీవ్రమైన నొప్పి కూడా వస్తుంది. దీనిని బట్టి చూస్తే గుండె నొప్పి అనుకుని కంగారు పడతాం. కానీ ఇది ఎసిడిటీ వలన వచ్చే సమస్య. అందువలన కంగారుపడి డాక్టర్ దగ్గరకు వెళ్ళకుండా ఇంటిలో సులభంగా దొరికే వస్తువులతో ఛాతీ మంటను తగ్గించుకోవచ్చు. చదవండి: మూడ్స్ బాగు చేసి ఆరోగ్యాన్నీ, ఆనందాన్నిపెంచే చాక్లెట్స్! గుప్పెడు పుదీనా ఆకులను కప్పు నీటిలో నానబెట్టి భోజనం అనంతరం ఆ నీటిని తీసుకోవాలి. ఆ విధంగా కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే గుండెలో మంట తగ్గుతుంది. భోజనం చేసిన వెంటనే చిన్న బెల్లం ముక్కను బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉంటే ఎసిడిటీ తగ్గుతుంది. భోజనం అనంతరం కొన్ని తులసి ఆకులను నమిలి మింగాలి. ఈ విధంగా కొన్ని రోజులు చేస్తుంటే ఎసిడిటీ, గుండెలో మంట తగ్గుతాయి. ఒక కప్పు నీటిలోసోంపు గింజలు వేసి ఉడికించి రాత్రిపూట అలా ఉంచి ఉదయమే వడకట్టి ఆ నీటిలో తేనె కలిపి పరగడుపున తాగాలి. గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ వేసి ఉదయం పరగడుపున తీసుకుంటే అనుకున్న ఫలితం కనపడుతుంది. మధ్యాహ్నం, రాత్రి సమయంలో భోజనం అయిన వెంటనే ఐదు లేదా పది నిముషాల పాటు నడవటం అలవాటు చేసుకుంటే తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. అలాగే ఎసిడిటీ తగ్గుతుంది. ఆహారంలో పీచుపదార్థం ఉండేలా చూసుకుంటే జీర్ణ శక్తి పెరుగుతుంది. తద్వారా గుండె మంట, ఎసిడిటీ తగ్గుతుంది. ఎసిడిటీతో బాధపడేవారు ఒకేసారి కాకుండా నాలుగయిదుసార్లు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలి. పొట్టను ఖాళీగా ఉంచకూడదు. అలాగే వేపుడు కూరలు, మసాలాలకు దూరంగా ఉండాలి -
గుండె బరువుగా, ఛాతీ నొప్పిగా ఉంటోందా?
సాధారణంగా బీపీ లేదా గుండెజబ్బులు మొదట్లో కాస్తంత పెద్ద వయసు వారికి, మధ్య వయసు దాటిన వారికి మాత్రమే వచ్చేవి. కానీ గత కొన్నేళ్లుగా ఈ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఉద్యోగం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి లేదా ఇతరత్రా కారణాల వల్ల నిండా పాతికేళ్లు నిండని వయసు వాళ్లలో కూడా గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. ఒక్కోసారి తీవ్రమైన అనర్థాలు కూడా జరుగుతున్నాయి. బీపీతో మొదలైన సమస్య తీవ్రమైన గుండెపోటుకు దారితీస్తుంది. గుండె బరువుగా ఉండటం, ఛాతీలో నొప్పిగా ఉండటం లేదా గుండెదడగా అనిపించడం వంటి లక్షణాలు కొన్నిసార్లు తీవ్రమైన గుండెకు సంబంధించిన రుగ్మతలను సూచిస్తాయి. గుండె సమస్యలనేవి ఆ స్థాయిలో లోలోపలే చేయాల్సిన చేటును చేసేస్తాయి. పని ఒత్తిడి తీవ్రంగా ఉన్నవారు హైబీపీ సమస్యకు లోనవుతారు. అలాగే పనిఒత్తిడి చాలా ఎక్కువగా ఉండటం అన్నది తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు. ఫలితంగా గుండెదడ, గుండె లయలోనూ మార్పులు కనిపించవచ్చు. ఇలాంటివారు... తమ కుటుంబాల్లో ఏవైనా గుండెజబ్బుల చరిత్ర ఉందేమో చూసుకోవాలి. అలా ఉన్నవారు తప్పనిసరిగా ఒకసారి హృద్రోగనిపుణులను కలిసి గుండె పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. ఆ పరీక్షల్లో తేలిన ఫలితాలను బట్టి అవసరమైతే మందులు వాడాల్సి రావచ్చు. అయితే ఈలోపు ఇలాంటివారందరూ తమ పని లక్ష్యాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్త వహించాలి. రోజుకు కనీసం అరగంటపాటు వ్యాయాయం లేదా వాకింగ్ చేయాలి. మంచి జీవనశైలి నియమాలు పాటిస్తూ మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యమూ కుదుట పడుతుంది. భవిష్యత్తులో గుండెజబ్బులను నివారించుకోవచ్చు. -
వారిని గుండెల్లో పెట్టుకుంటాం
సంగారెడ్డి: 'తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతోనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది.. వారి కుటుంబాలను గుండెల్లో పెట్టుకుంటాం.. వారి కాళ్లకు ముళ్లు గుచ్చుకున్నా తమ పంటితో తీస్తాం..' అని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలోని కలెక్టరేట్లో గురువా రం 52 మంది అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరుల కుటుంబాలకు ఎలాంటి బాధలు లేకుండా చేయడానికి సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. బాధితులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 'నిర్భయ'కు శ్రీకారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నిర్భయ సహాయ కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో ఇదే తొలి కేంద్రం. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ఢిల్లీ తరహా నిర్భయ సంఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకోవద్దనే ఉద్దేశంతో ‘షీ’ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే నేరుగా నిర్భయ కేంద్రాన్ని ఆశ్రయించవచ్చని సూచించారు.