800 కిలోల భారీ చేప..వీడియో వైరల్
కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని డిఘా తీర ప్రాంతంలో మత్స్యకారులకు భారీ చేప చిక్కింది. 800 కిలోల బరువున్న ఈ అరుదైన చేపను శంకర్ చేప అని పిలుస్తారని స్థానికులు తెలిపారు. ఏనుగు చెవిని పోలిన ఈ చేప 8 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ భారీ చేపను చూడటానికి స్థానికులు సైతం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తీరప్రాంతంలో చేపలవేటకు వెళ్లిన మత్సకారులకు ఇది చిక్కింది. అయితే ఇంత భారీ చేపను తామెప్పుడూ చూడలేదని తెలిపారు. ఈ అరుదైన చేప 50వేలకు అమ్ముడైంది. రే కుటుంబానికి చెందిన ఈ చేపను శంకర్ చేప అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ తరహా చేపలను బెంగాల్ వాసులు ఇష్టపడుతారట. గతేడాది మార్చిలోనూ ఇదే రకానికి చెందిన 300కిలోల చేప మత్సకారులకు చిక్కింది. (నోరూరించే పీతల కూర.. సరోజ్ దీదీకి సాయం!)