
చేప పొట్టలో విలువైన సంపద?
ఇందుకూరుపేట: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం రాముడుపాళెం పల్లిపాళెం సముద్ర తీరానికి ఆదివారం సుమారు 35 అడుగుల పొడవు ఉన్న భారీ చేప కొట్టుకొచ్చింది. ఈ చేప నాలుగు నుంచి ఐదు టన్నులు బరువు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.
రెండు మూడు రోజుల క్రితమే ఇది మృతిచెంది ఉంటుందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికుల్లో కొందరు చేప పొట్ట భాగంలో కోసి చూడగా లక్షలాది రూపాయల విలువైన సంపద దొరికినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.