విభజన లెక్క తేలింది..!
భద్రాచలం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. అందులో భాగంగా జూన్ 2 తరువాత జిల్లా నుంచి 211 గ్రామాలు(హేబిటేషన్లు) వేరుకానున్నాయి. సీమాంధ్రలో విలీనం అయ్యే ఈ గ్రామాల జాబితాను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న జిల్లాలోని 7 మండలాల్లో గల 211 హేబిటేషన్లకు చెందిన ప్రజానీకానికి మరో 22 రోజుల తరువాత ఈ ప్రాంతంతో అనుబంధాలు తెగిపోనున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఊహించని రీతిలో జరిగిన ఈ పరిణామాలతో పోలవరం ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంతో, ఇక్కడి వారితో అనుబంధం పెంచుకున్న వీరంతా ఒక్కసారిగా వేరే జిల్లా, అందులోనూ వేరే రాష్ట్రంలోకి వెళ్లిపోతున్నామనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
జిల్లా నుంచి వేరు కానున్న 1,16,796 మంది
భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో 136 రెవెన్యూ గ్రామాలకు(211హేబిటేషన్లు)కు చెందిన మొత్తం 1,16,796 మందిని జిల్లా నుంచి వేరుచే సేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. భద్రాచలం డివిజన్లోని భద్రాచలం మండలంలో 10 రెవెన్యూ గ్రామాల పరిధిలో గల 13 హేబిటేషన్లకు చెందిన 6637 మంది, కూనవరంలోని 39 రెవెన్యూ గ్రామాల పరిధిలో గల 22,795 మందిని జిల్లా నుంచి వేరు చేసి తూర్పు గోదావరి జిల్లాలో కలపనున్నారు.
అదే విధంగా చింతూరు మండలంలోని 14 రెవెన్యూ గ్రామాల పరిధిలో గల 17 హేబిటేషన్లకు చెందిన 14,085 మంది, వీఆర్‌పురం మండలంలోని 35 రెవెన్యూగ్రామాల పరిధిలోని 45 హేబిటేషన్లకు చెందిన 19,983 మందిని వేరు చే యనున్నారు. భద్రాచలం డివిజన్లో మొత్తం 98 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 123 హేబిటేషన్లకు చెందిన 63,500 మందిని జిల్లా నుంచి వేరు చేసి తూర్పుగోదావరి జిల్లాలో కలపనున్నారు.
పాల్వంచ డివిజన్లో : బూర్గంపాడు మండలంలోని 7 రెవెన్యూ గ్రామాల పరిధిలో గల 15 హేబిటేషన్లకు చెందిన 16,943 మంది, వేలేరుపాడులోని 15 రెవెన్యూ గ్రామాల పరిధిలో గల 39 హేబిటేషన్లకు చెందిన 15,205 మంది, కుక్కునూరు మండలంలోని 16 రెవెన్యూ గ్రామాల పరిధిలో గల 34 హేబిటేషన్లకు చెందిన 21,148 మందిని జిల్లా నుంచి వేరు చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆంధ్రలో కలవనున్న గ్రామాలు ఇవే
భద్రాచలం మండలం : గోగుబాక, గొమ్ముకోయగూడెం, కాపవరం, గొమ్ముకొత్తగూడెం, సీతాపురం, త్రిపురపెంటవీడు, గొల్లగూడెం, రాచగొంపెల్లి, గౌరిదేవిపేట, నందిగామ, నందిగామపాడు, మురుమూరు.
కూనవరం మండలం : అభిచర్ల, చూచిరేవుల గూడెం, అయ్యవారి గూడెం, పల్లూరు, కొండవాయిగూడెం, పెదార్కూర్, బండారుగూడెం, ముసూరుగూడెం, రేపాక, పండ్రాజుపల్లి, జిన్నెలగూడెం, వెంకటాయపాలెం, వెంకన్నగూడెం, రేగులపాడు, బొజ్రాయిగూడెం, మర్రిగూడెం, గొమ్ముగూడెం, చూచిరేవుల, కుమారస్వామి గూడెం, వెంకటాయపాలెం, నర్సింగపేట, చిన నర్సింగపేట, దూగుట్ట, కరకగూడెం, కూళ్లపాడు, గొమ్ము అయ్యవారిగూడెం, పొట్లవాయి, పోచవరం, పోచవరం కాలనీ, గునువారిగూడెం, పెద పోలిపాక, చినపోలిపాక, జగ్గవరం, జగ్గవరం కాలనీ, కాచవరం, లింగాపురం, కోడేరు, తాళ్లగూడెం, రాయిగూడెం, కొండ్రాజుపేట, శబరి కొత్తగూడెం, పూసుగూడెం, ఊల్పర్పేట, కూనవరం, టేకులబోరు, కూటూరు, మల్లూరు, టేకుబాక.
చింతూరు మండలం : బండారుగూడెం, చిడుమూరు, కొమ్మూరు, మామిళ్లగూడెం, చట్టి, వీరాపురం, గొర్లెగూడెం, మల్లెతోట, వేలుమూరు, అగ్రహారపు కోడేరు, తిమ్మిరిగూడెం, నర్సింగపేట, ముకునూరు, చిట్టూరు, చింతూరు, కొయిగూరు, కల్లేరు.
వీఆర్‌పురం మండలం : పత్తిపాక, తుష్టివారి గూడెం, సున్నంవారిగూడెం, కన్నాయిగూడెం, గుండుగూడెం, చింతరేగుపల్లి, శబరి రాజుగూడెం, అడవివెంకన్నగూడెం, కోపెల్లె, సోములగూడెం, రామవరం, రామవరపుపాడు, చొప్పెల్లె, ముల్కపల్లె, ముత్యాలమ్మ గండి, జల్లివారిగూడెం, గుర్రంపేట, నూతిగూడెం, ముత్తుగూడెం, ఉమ్మడివరం, అన్నవరం,రేఖపల్లి, రాజుపేట కాలనీ, వడ్డిగూడెం, డీటీగూడెం, తోటపల్లి, వీఆర్‌పురం, రాజుపేట, సీతంపేట, శ్రీరామగిరి, చొప్పనాపల్లి, కొత్తూరు,కల్తునూరు, జీడిగుప్ప, కొటారిగొమ్ము, ఇస్సునూరు, రాయిగూడెం, బీమవరం, ఇప్పూరు, పోచవరం, తుమ్మిలేరు, కొండేపల్లి, కొల్లూరు, బోరిగూడెం, గొందూరు.
బూర్గంపాడు మండలం : సీతారామనగరం, శ్రీధర, వేలేరు, గుంపెనపల్లి, గణపవరం, ఇబ్రహీంపేట, రాయిగూడెం, అల్లిగూడెం, వెంకటాపురం, భువనగిరి, బూర్గంపాడు, టేకులచెరువు, సంజీవరెడ్డిపాలెం, కొతనకిరిపేట, లక్ష్మీపురం.
వేలేరుపాడు మండలం : రేపాకగొమ్ము, పుచిరాల కాలనీ, పుచిరాల, మద్దికట్ల, వేలేరుపాడు, నడిమిగొంపు, రుద్రంకోట, తాటుకురుగొమ్ము, నాగులగూడెం, భూదేవిపేట, శ్రీరామపురం, జగన్నాథపురం, సాగరపల్లి, కొర్రాజుగూడెం, బుర్రతోగు, తిరుమలపాలెం, కన్నవాయిగుట్ట, నారాయివారెం, నారాయివారెం కాలనీ, తూర్పుమెట్ట, పడమటిమెట్ట, కొత్తూరు, చిగురుమామిడి, బొల్లెపల్లె, యాదవ పల్లె, చిత్తమరెడ్డిపాలెం, చింతపాలపాడు, బూరెడ్డగూడెం, సిద్దారం, కట్కూరు, టేకూరు, కొయిదా, తాళ్లగొంది, పూసుగొంది, కాచవరం, టేకపల్లి, కాకిసునూర్, పేరాంటాలపల్లి.
కుక్కునూరు మండలం : తొండిపాక, మిట్టగూడెం, బంజరగూడెం, కొమటాయిగూడెం, అమరవరం, ఉప్పేరు, రెడ్డిగూడెం, దామరచెర్ల, యల్లపుగూడెం, చీరవల్లి, కొత్తూరు, మర్రిపాడు, మాదారం, కౌండిన్యముక్తి, వింజరం, ముత్యలంపాడు, కొండపల్లి, కొయగూడెం, మారేడుబాక, కివ్వాక, కమ్మరిగూడెం, కుక్కునూరు, రామసింగారం, కిష్టారం, కోరాయికుంట, లంక లపల్లి, ఇసుకపాడు, దాచారం,బెస్తగూడెం, రామచంద్రాపురం, కొత్తూరు, గొమ్ముగూడెం, లచ్చిగూడెం, ఉప్పర మద్దిగట్ల.