Hedge funds
-
డీప్సీకర్ లియాంగ్
అత్యంత శక్తిమంతమైన చౌక ఏఐ అసిస్టెంట్‌తో కృత్రిమ మేథ (ఏఐ) ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్న డీప్‌సీక్ సృష్టికర్త లియాంగ్ వెన్ఫెంగ్ (40) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు టెక్ ప్రపంచంలో ఎక్కడా కనీసం వినబడని, కనబడని లియాంగ్ పేరు ఇప్పుడు ఎలాన్ మస్క్ (టెస్లా), శామ్ ఆల్ట్‌మన్‌ను (ఓపెన్ ఏఐ) మించి మార్మోగిపోతోంది. ఆయన గురించి మరింతగా తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. లియాంగ్ దక్షిణ చైనాలోని అయిదో శ్రేణి పట్టణమైన గ్వాంగ్‌డాంగ్‌లో జన్మించారు. ఆయన తండ్రి ఒక స్కూల్ టీచరు. ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా సహా టెక్ దిగ్గజాలకు కేంద్రమైన ఝెజియాంగ్ ప్రావిన్స్‌లో లియాంగ్ విద్యాభ్యాసం చేశారు. ఎల్రక్టానిక్స్, కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ, 2010లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. హెడ్జ్ఫండ్తో వ్యాపార రంగంలోకి.. లియాంగ్ 2015లో ఇద్దరు క్లాస్‌మేట్స్‌తో కలిసి హై–ఫ్లయర్ అసెట్ మేనేజ్మెంట్ పేరిట చైనాలో ఒక హెడ్జ్ ఫండ్‌ను ఏర్పాటు చేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. సంక్లిష్టమైన అల్గోరిథంలతో ట్రేడింగ్ వ్యూహాలను అమలు చేసే ఈ ఫండ్ చాలా వేగంగా ఎదిగింది. కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే ఫండ్ పోర్ట్‌ఫోలియో ఏకంగా 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.19 లక్షల కోట్లకు) చేరింది. అదే సమయంలో స్వంత ఏఐ ప్రాజెక్టు కోసం అంటూ శక్తివంతమైన ఎన్విడియా చిప్‌లను వేల సంఖ్యలో ఆయన కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అటుపైన 2023లో కృత్రిమ మేథకు సంబంధించిన డీప్‌సీక్ స్టార్టప్‌ను ప్రారంభించారు. సాధారణ ఏఐ అవసరాలకు ఉపయోగపడే కోడర్, ఎల్ఎల్ఎం, వీ2 లాంటి మోడల్స్‌ను చకచకా ప్రవేశపెట్టి, బైట్‌డ్యాన్స్, బైదులాంటి దిగ్గజాలకు కాస్త కుదుపునిచ్చారు. కట్ చేస్తే, 2025 జనవరి వచ్చేసరికి అత్యంత సంక్లిష్టమైన రీజనింగ్ సామర్థ్యాలతో, ఓపెన్ఏఐ జీపీటీ–4కి పోటీగా డీప్‌సీక్–ఆర్1 ఏఐ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టారు. ఒకవైపు బడా టెక్ దిగ్గజాలన్నీ తమ తమ మోడల్స్‌ను అభివృద్ధి చేసేందుకు మిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరిస్తూ, యూజర్ల నుంచి చార్జీలు కూడా వసూలు చేస్తుండగా.. డీప్‌సీక్ చాట్‌బాట్‌ను అత్యంత చౌకగా కేవలం 6 మిలియన్ డాలర్లకే (దాదాపు రూ. 52 కోట్లు) తయారు చేసి షాకిచ్చారు. పైగా ఇది అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఓపెన్‌సోర్స్ మోడల్‌గానే ఉంచుతామంటున్నారు. కృత్రిమ మేథ విషయంలో చైనాను అగ్రస్థానంలో నిలబెట్టడమే తన లక్ష్యమని లియాంగ్ చెబుతున్న నేపథ్యంలో అమెరికన్ టెక్ దిగ్గజాలు దీనికి ఎలా చెక్ పెట్టబోతున్నాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
హెడ్జ్ ఫండ్ డిఫాల్టుతో బ్యాంకులకు భారీ నష్టాలు
బెర్లిన్: అమెరికాకు చెందిన ఓ హెడ్జ్ ఫండ్ డిఫాల్ట్ కావడంతో పలు పెద్ద బ్యాంకులు భారీగా నష్టాలు నమోదు చేయనున్నాయి. మార్జిన్ కాల్స్‌కి అవసరమైన నిధులను సమకూర్చడంలో సదరు సంస్థ విఫలం కావడమే ఇందుకు కారణం. ఆర్చిగోస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనే హెడ్జ్ ఫండ్ లావాదేవీలు ఈ పరిస్థితికి దారి తీసినట్లు సమాచారం. ‘మార్జిన్ అవసరాలకు అనుగుణంగా నిధులు సమకూర్చడంలో ఫండ్ విఫలం కావడంతో మా సంస్థ సహా పెద్ద సంఖ్యలో ఇతర బ్యాంకులకు ’గణనీయంగా నష్టాలు’ వాటిల్లాయి అని స్విట్జర్లాండ్‌కి చెందిన క్రెడిట్ సూసీ తెలిపింది. జపాన్ దిగ్గజం నొమురా తమ నష్టాలు 2 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని అంచనా వేసింది. హెడ్జ్ ఫండ్లు తమ స్టాక్స్ పోర్ట్‌ఫోలియోనూ పూచీకత్తుగా ఉంచి, ట్రేడింగ్ అవసరాల కోసం నిధులను సమకూర్చుకుంటూ ఉంటాయి. ఒకవేళ షేర్ల విలువ పడిపోతే నిర్దేశిత మార్జిన్ మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడంలో విఫలమైతే ప్రతికూల పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. తాజాగా ఆర్చిగోస్ కూడా ఇలాంటి పరిస్థితిలోనే చిక్కుకుంది. వయాకామ్సీబీఎస్తో పాటు పలు చైనా టెక్నాలజీ కంపెనీల స్టాక్స్‌లో ఆర్చిగోస్ భారీగా పొజిషన్లు తీసుకుంది. కానీ, వయాకామ్‌సీబీఎస్ షేర్ల ధరలు గణనీయంగా పతనం కావడంతో ఆర్చిగోస్కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దానికి నిధులిచ్చిన ఆర్థిక సంస్థలపైనా ప్రతికూల ప్రభావం పడింది. -
మోస్ట్ హేటెడ్ మ్యాన్‌కు ఏడేళ్ల జైలు శిక్ష
న్యూయార్క్ : అమెరికా అత్యంత అసహ్యించుకునే వ్యక్తి 'ఫార్మా బ్రో' మార్టిన్ షక్రెలీకి ఏడేళ్లు జైలు శిక్ష పడింది. పెట్టుబడిదారులను మోసగించినందుకు గాను న్యూయార్క్ బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు జడ్జ్ శుక్రవారం అతనికి ఈ శిక్ష విధించారు. షక్రెలీ నకిలీ అకౌంట్ స్టేట్మెంట్లను పంపి పెట్టుబడిదారులను మోసగించాడు. అంతేకాక తను నడుపుతున్న హెడ్జ్ ఫండ్స్ నష్టాలను కూడా పెట్టుబడిదారుల వద్ద దాచిపెట్టాడు. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించాడు. దీంతో షక్రెలీకి ఫెడరల్ జడ్జి ఈ శిక్ష విధించింది. ఒక జీవితాన్ని నిలబెట్టే హెచ్ఐవీ మెడికేషన్ డరాప్రిమ్ రేటును రాత్రికి రాత్రి 13 డాలర్ల నుంచి 750 డాలర్లకు పెంచడంతో, షక్రెలీ తొలిసారి 2015లో వెలుగులోకి వచ్చాడు. అంటే ఆ మెడిషిన్ ధరను దాదాపు 5000 శాతం పెంచేశాడు. ఆ సమయంలో ఫార్మా బ్రోగా పేరున్న టూరింగ్ ఫార్మాస్యూటికల్స్‌ను షక్రెలీ నిర్వహించేవాడు. ఎయిడ్స్ చికిత్స కోసం వాడే ఈ మెడిషిన్ రేట్లను ఒక్కసారిగా పెంచడంతో, అమెరికాలో అతన్ని అసహ్యహించుకోని వారంటూ లేరు. దీంతో మోస్ట్ హేటెడ్ మ్యాన్ ఇన్ అమెరికాగా పేరులోకి వచ్చేశాడు. అదే సంవత్సరం డిసెంబర్లో సెక్యురిటీస్ ఫ్రాడ్ కూడా వెలుగులోకి వచ్చింది. అతను నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎంబీ క్యాపిటల్, ఎంఎస్‌ఎంబీ హెల్త్‌కేర్ అనే హెడ్జ్ ఫండ్స్ ద్వారా మిలియన్ కొద్దీ డాలర్లను పెట్టుబడిదారుల నుంచి నొక్కేసినట్టు తేలింది. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వాటిలో అతను దోషిగా కూడా నిర్ధారణ అయింది. అనంతరం షక్రెలీ పెట్టుకున్న బెయిల్‌ను కూడా జడ్జి రద్దు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా షక్రెలీ లాయర్లు 12 నుంచి 18 నెలల శిక్షను కోరాగా.. ప్రాసిక్యూటర్లు మాత్రం ఇతనికి 15 ఏళ్లు జైలు శిక్ష విధించాల్సిందేనని పట్టుబట్టారు. వీరి వాదనలు విన్న తర్వాత షక్రెలీకి ఏడేళ్లు జైలు శిక్షను జడ్జి ఖరారు చేశారు. -
భారత మార్కెట్లోకి ఎజ్సాఫ్ట్వేర్ గ్రూప్
హైదరాబాద్‌లో కార్యాలయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెడ్జ్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ సంస్థలు మొదలైన వాటికి టెక్నాలజీ సేవలు అందించే ఎజ్ సాఫ్ట్వేర్ గ్రూప్ తాజాగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో తమ కార్యాలయం ప్రారంభించింది. ఇందులో ప్రస్తుతం 60 మంది ఉద్యోగులు ఉన్నట్లు సంస్థ సీఈవో పీట్ సినిస్‌గలి సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. త్వరలో సిబ్బంది సంఖ్యను 150కి, ఆ తర్వాత మూడేళ్లలో మొత్తం 500కు పెంచుకోనున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తమకు 12 కార్యాలయాలు, 1,000 పైచిలుకు సిబ్బంది, 2,000 పైగా క్లయింట్లు ఉన్నారని పీట్ వివరించారు. తమ క్లయింట్లలో సింహభాగం గ్లోబల్ హెడ్జ్ ఫండ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. సుమారు 75 శాతం కస్టమర్లు అమెరికాలోను, పదిహేను శాతం మంది యూరప్‌లోనూ ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్ కార్యాలయంలో ప్రాథమికంగా సాఫ్ట్వేర్ అభివృద్ధితో ప్రారంభించి త్వరలో క్లయింట్ సర్వీసులు మొదలైనవి అందించనున్నట్లు పీట్ పేర్కొన్నారు. ప్రస్తుతం తమకు బోస్టన్, లండన్, హాంకాంగ్‌లలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కార్యకలాపాలు ఉన్నట్లు ఆయన వివరించారు.