రెండేళ్లకు నిండిన ‘సాగర్’
నిజాంసాగర్, న్యూస్‌లైన్ :రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే నిజాంసాగర్ ప్రాజెక్టు రెండేళ్లకు నిండింది. ఎగువ ప్రాంతా ల్లో కురిసిన వ ర్షాల వల్ల వచ్చిన వరద నీటితో ప్రాజెక్టును ఆదుకున్నాయి. వర్షాకాలం ఆరంభం నుంచి వర్షాలు కురవడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో జిల్లాలోని ఆయకట్టు పంటలకు సాగు, బాన్సువాడ, బోధన్, నిజామాబాద్ పట్టణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందనుంది. అంతే కాకుండా ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న హెడ్‌స్లూయిస్ వి ద్యుదుత్పత్తి కేంద్రంలో జలవిద్యుదుత్పత్తి జరగనుంది. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి 1405 అడుగులు 17.8 టీఎంసీలకు ప్రస్తుతం 1403.42 అడుగులతో 15.557 టీఎం సీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,878 క్యూసెక్కుల మేర నీరు వచ్చిచేరుతోంది. ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న ఖరీఫ్ పంటలతో పాటు రబీసీజన్‌లో చివరి ఆయకట్టు వరకు పంటల సాగు కు ఢోకా లేదు. ప్రాజెక్టుకు ఎగువన ఉన్న సింగూరు జలాశయం సైతం ఆశించిన నీటితో నిండుకుండలా మారింది. దీంతో సింగూరు నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు రావాల్సిన వాటా నీరు యథాతథంగా రానుంది.
తాగు, సాగుకు నీరు పుష్కలం
నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో ఆయకట్టు కింద ఖరీఫ్, రబీపంటలకు సాగు నీరు పుష్కలంగా అందనుంది. చివరి ఆయకట్టు వరకు 2.5లక్షల ఎకరాల్లో పంటలను రైతులు సాగు చేస్తున్నారు. చివరి ఆయకట్టు ప్రాంతంలో సాగవుతున్న పంటలకు మాసాని, గుత్ప ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరందుతుంది. అందు వల్ల అలీసాగర్ రిజర్వాయర్ దిగువ వరకు ఉన్న పంటలకు సాగర్ నీరు అందుతోంది.
ఆశించిన స్థాయిలో జల విద్యుదుత్పత్తి
నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీరు నిండటంతో హెడ్స్లూ యిస్ విద్యుదుత్పత్తి కేంద్రంలో జల విద్యుదుత్పత్తికి ఢోకా లేదు. రెండు టర్బయిన్లద్వారా పది మెగా వాట్ల విద్యుదుత్పత్తి జరుగనుంది. ఈ ఏడాది స్థానిక విద్యుదుత్పత్తి కేం ద్రంలో విద్యుదుత్పత్తి ఇప్పటికే ప్రారంభమైయింది. దీనికి తోడు ప్రా జెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో రబీ పంటలకు సాగు నీరు విడుదల చేస్తే ఆశించిన స్థాయిలో విద్యుదుత్పత్తి జరుగనుంది.
గతేడాది ప్రతికూల పరిస్థితులతో వెలవెల గతేడాది వర్షాభావం, ప్రతికూల పరిస్థితుల వల్ల ప్రాజెక్టు నిండలేదు. తద్వారా ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో ఆయకట్టు కింద పంటలు సాగుకు నోచుకోలేదు. దీనికి తోడు హెడ్‌స్లూయిస్ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పాదనకు నోచుకోలేదు. గతేడాది ప్రాజెక్టులో 1392.34 అడుగులతో 5.17 టీఎంసీల నీరు నిల్వ మాత్రం ఉంది.