breaking news
hegemony
-
మూడు దేశాలు ఒక్కటైతే..!
అగ్రరాజ్యమన్న దురహంకారం, ఆధిపత్యధోరణితో ట్రంప్ టారిఫ్‌ల బాంబులు విసిరితే బాధిత దేశాలు జట్టుకట్టి పోరుసల్పే ప్రయత్నాలు మొదలెట్టాయా? అంటే తాజా అంతర్జాతీయ పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. వినిమయ ప్రపంచంగా పేరొందిన అమెరికాకు అన్ని దేశాల వస్తూత్పత్తులు పోటెత్తుతాయి. చాలా దేశాల ఖజానా నిండటానికి అమెరికా కొనుగోళ్లే కారణం. దీనిని అలుసుగా తీసుకుని, ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని కారణంగా చూపి తమతో వాణిజ్యంచేసే దేశాలపై ట్రంప్ టారిఫ్‌ల గుదిబండలు పడేస్తుండటంతో ఆయా దేశాల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. భారత్, చైనా వంటి దేశాలు అంతటితో ఆగకుండా రష్యాతో జట్టుకట్టి అగ్రరాజ్య దుందుడుకు చర్యలకు ముకుతాడు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా జాతీయ భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగుతో గురువారం ఎన్ఎస్ఏ ధోవల్ సమావేశమయ్యారు. ఇంధన, రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపానని ధోవల్ చెబుతున్నప్పటికీ వాస్తవానికి ట్రంప్‌ను ఎలా నిలువరించాలనే దానిపైనే ప్రధానంగా చర్చ జరిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ట్రంప్ దూకుడుకు ఎలా కళ్లెం వేయాలని అంశంపై చర్చించేందుకు త్వరలో భారతవిదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సైతం రష్యాకు వెళ్లి పుతిన్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడనున్నారు. గల్వాన్ లోయలో ఇరుదేశాల జవాన్ల ముష్టిఘాతం, ఘర్షణలు, 20కిపైగా భారత జవాన్ల వీరమరణంతో ఎగసిపడిన కోపాన్ని సైతం కాసేపు పక్కనబెట్టి ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటించనున్నారు. చైనాకు బద్దశత్రువైన అమెరికాను ఆర్థికాంశాల్లో ఎలా ఎదుర్కోవాలనే దానిపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ చర్చించనున్నట్లు వార్తలొచ్చాయి. మారుతున్న భారత్ వ్యూహం చైనాతో మైత్రీ విషయంలో ఇన్నాళ్లూ సమదూరం పాటించిన భారత్ ఇకపై అమెరికా కారణంగా స్నేహబంధాన్ని బలపర్చుకునే అవకాశముంది. చైనా, భారత్, రష్యా కూటమిలో తానూ చేరతానని ఇప్పటికే బ్రెజిల్ సూచనప్రాయంగా తెలిపింది. వ్యవసాయం, డైయిరీ రంగంలో అమెరికన్ కంపెనీల రాకను భారత్ అడ్డుకుంటుండటంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు తరహాలో అటు సుంకాలతో, ఇటు వాణిజ్య ఒప్పందంలో తనకు అనుకూల షరతులతో భారత్ మెడలు వంచాలని ట్రంప్ చూస్తున్నారు. ఇందుకు భారత్ ససేమిరా అనడంతో ఆగ్రహంతో ట్రంప్ మోపిన టారిఫ్ ఇప్పుడు భారత్‌ను చైనాకు దగ్గరచేస్తోందని తెలుస్తోంది. ఏడేళ్ల తర్వాత మోదీ చైనా పర్యటన ఖరారుకావడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాను నిలువరించేందుకు ఇన్నాళ్లూ భారత్‌ను మచి్చకచేసుకునేందుకు గత అమెరికా ప్రభుత్వాలు చేసిన సఫలయత్నాలను ట్రంప్ ఒక్క టారిఫ్ దెబ్బతో నాశనంచేస్తున్నారు. 25 శాతం టారిఫ్ అమల్లోకి వచి్చనరోజు మాస్కోలో దోవల్ పర్యటించడం యాదృచి్ఛకం కాదని తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం చేసుకోవాలంటూ ట్రంప్ పంపిన దూత, అమెరికా ఉన్నతాధికారి స్టీవ్ విట్కాఫ్.. వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయిన కొద్దిగంటల తేడాతోనే ధోవల్ సైతం మాస్కోలో కీలక చర్చలు జరపడం గమనార్హం. షాంఘై శిఖరాగ్ర సదస్సు వేదికగా.. త్వరలో చైనాలో జరగబోయే షాంఘై సహకార సంఘం శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసి ట్రంప్ ప్రభుత్వ వ్యతిరేక వ్యూహాలను రచించనున్నట్లు వార్తలొచ్చాయి. ఇటీవలికాలంలో చైనా, భారత్ మధ్య సారూప్యతలు కనిపిస్తున్నాయి. రష్యా ముడిచమురును చైనా, భారత్‌లు అత్యధికంగా కొనుగోలుచేస్తున్నాయి. ట్రంప్ బెదిరింపులను భారత్, చైనా రెండూ చవిచూశాయి. దేశ స్వప్రయోజనాలు, జాతీయ భద్రతకే తాము పెద్దపీట వేస్తామని చైనా, భారత్ ఒకే తరహాలో తమ వాణిని గట్టిగా వినిపించాయి. యురేనియం, ఎరువులు, ఇతర కీలక మిశ్రమ ధాతువులను రష్యా నుంచి కొంటూ మాకు సుద్దులు నేర్పుతావా? అని రెండు దేశాలు అమెరికాపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. శత్రువుకు శత్రువు మిత్రువు అన్న సూత్రాన్ని భారత్, చైనాలు తూ.చ. తప్పకుండా పాటిస్తాయని తెలుస్తోంది. కలిసి నడుస్తానన్న బ్రెజిల్ తమపై ఏకంగా 50 శాతం టారిఫ్ విధించడంపై అమెరికాపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా గుర్రుగా ఉన్నారు. ‘‘ ఇంతటి భారం మోపిన ట్రంప్‌కు అస్సలు ఫోన్ చేయను. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని మోదీకి ఫోన్చేస్తా. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఈ టారిఫ్‌లపై తేల్చుకుంటాం. ఈ దేశాలతో కలిసి నడుస్తా’’ అని డసిల్వా అన్నారు. రష్యా, ఇండియా, చైనా త్రయం మళ్లీ క్రియాశీలకం కావాల్సిన తరుణం వచి్చందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గూగుల్‌ది ఆధిపత్య దుర్వినియోగమే
న్యూఢిల్లీ: టెక్ సంస్థ గూగుల్ .. డిజిటల్ డేటాపరమైన పెత్తనం సాగిస్తోందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆరోపించింది. కంపెనీ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని స్పష్టం చేసింది. గూగుల్‌పై జరిమానా విధించిన కేసుకు సంబంధించి నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో సీసీఐ ఈ మేరకు తన వాదనలు వినిపించింది. భారీగా ఆదాయం తెచ్చిపెడుతున్న సెర్చి ఇంజిన్‌ను గూగుల్ ఒక ’కోట’లాగా మార్చుకుందని, దానికి రక్షణగా చిన్న చితకా యాప్‌లను ఒక ’అగడ్త’లాగా ఉపయోగించుకుంటోందని పేర్కొంది. సెర్చి ఇంజిన్ ద్వారా సేకరించే డేటాను తన గుప్పిట్లో ఉంచుకుని ఇతరత్రా పోటీ సంస్థలపై ఆధిపత్యం చలాయిస్తోందని సీసీఐ తెలిపింది. డేటా సేకరణ, డేటా వినియోగాన్ని దుర్వినియోగం చేసి, ప్రకటనలపరమైన ఆదాయార్జన కోసం వాడుకుంటోందని పేర్కొంది. ప్రత్యామ్నాయం ఉండాలనేది సీసీఐ సూత్రం కాగా .. గూగుల్ పెత్తనం వల్ల ప్రత్యామ్నాయం, పోటీ లేకుండా పోతోందని ఆరోపించింది. ఇలాంటి ధోరణులను అరికట్టేందుకు సీసీఐ జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడం వల్ల మార్కెట్లో సంస్థలన్నింటికీ మరింత స్వేచ్ఛగా పోటీపడేందుకు అవకాశం లభించగలదని పేర్కొంది. ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాల్లో పోటీని దెబ్బతీసే విధానాలు పాటిస్తోందంటూ గూగుల్‌కు సీసీఐ గతేడాది అక్టోబర్ 20న రూ. 1,338 కోట్ల జరిమానా విధించింది. దీన్ని ఎన్సీఎల్ఏటీలో గూగుల్ సవాలు చేసింది. మార్చి 31లోగా దీన్ని తేల్చాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఫిబ్రవరి 15 నుంచి ఎన్సీఎల్ఏటీ విచారణ ప్రారంభించింది. -
వాలెట్ వార్ : వాట్సాప్ (VS) పేటీఎం
న్యూఢిల్లీ: అమెరికా–చైనా సంస్థల మధ్య వాణిజ్య పోరు ఆయా దేశాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. తాజాగా ఆ కంపెనీలు భారత మార్కెట్లోనూ ఒకదానిపై మరొకటి పైచేయి సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత డిజిటల్ చెల్లింపుల రంగంలో ఆధిపత్యం కోసం రెండు దేశాల కంపెనీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఒకవైపు అత్యధిక యూజర్లు ఉపయోగించే అమెరికన్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్, మరోవైపు చైనా ఇన్వెస్టర్ల అండ ఉన్న దేశీ చెల్లింపు సేవల దిగ్గజం పేటీఎం మధ్య గట్టి పోటీ ఉండబోతోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డీమోనిటైజేషన్ అనంతరం భారత్‌లో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరుగుతుండటంతో అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా ఇటువైపు దృష్టి సారిస్తున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ ప్రత్యేకంగా పేమెంట్ యాప్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టగా.. రిటైల్ సంస్థ అమెజాన్ సొంత వాలెట్‌ను ప్రవేశపెట్టింది. పరిశ్రమవర్గాల సమాఖ్య అసోచాం, ఆర్‌ఎన్‌సీవోఎస్ సంస్థ అంచనాల ప్రకారం.. దేశీ మొబైల్ వాలెట్ లావాదేవీల విలువ 2016లో రూ.154 కోట్లు. ఇది 2022 నాటికి రూ.275 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. దీంతో ఈ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దిగ్గజాలు పోటీపడుతున్నాయి. మిగతా వాటన్నింటికంటే ముందుగా రంగంలోకి దిగిన పేటీఎం సంస్థ ప్రస్తుతం ఈ విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 30 కోట్ల మందికి పైగా యూజర్లు, 33% మార్కెట్ వాటాతో దేశీయంగా పేటీఎం అతి పెద్ద మొబైల్ పేమెంట్ కంపెనీగా నిలుస్తోంది. టెక్ దిగ్గజం గూగుల్ నెమ్మదిగా ఈ విభాగంలో ముందుకెళుతోంది. 2017 సెప్టెంబర్‌లో ఈ సంస్థ గూగుల్ పే పేరుతో పేమెంట్స్ సర్వీస్‌ను ప్రారంభించింది. పెద్ద నోట్ల రద్దుకు ముందు దీన్ని ప్రారంభించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నది పరిశ్రమ వర్గాల అభిప్రాయం. నెలవారీ క్రియాశీలకంగా ఉండే యూజర్ల సంఖ్య ఏడాది క్రితం 1.4 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి ఇది 4.5 కోట్లకు చేరింది. ‘వాట్సాప్’కు అంత ఈజీ కాదు.. అమెరికన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో భాగమైన మెసేజింగ్ యాప్.. వాట్సాప్ కూడా భారత్‌లో భారీగా పేమెంట్ సేవలను విస్తరించాలని భావిస్తోంది. విస్తృతంగా యూజర్లు ఉండటం వాట్సాప్‌కు సానుకూలాంశం. దీనికి భారత్‌లో ప్రస్తుతం సుమారు 30 కోట్ల మంది పైగా యూజర్లున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఓటర్లకు చేరువయ్యేందుకు దీన్ని ఉపయోగిస్తున్నాయి. ఇవి వాట్సాప్‌కు సానుకూలాంశాలే అయినప్పటికీ చెల్లింపుల మార్కెట్లో.. అయితే, చైనాకి చెందిన ఆలీబాబా గ్రూప్ అండ ఉన్న దేశీ పేమెంట్ సర్వీసుల సంస్థ పేటీఎం నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి రానుంది. అంతేకాక ఇతరత్రా సవాళ్లూ తక్కువేమీ కాదు. కేంద్రం నిర్దేశించినట్లుగా డేటా లోకలైజేషన్, డేటా భద్రత నిబంధనలను వాట్సాప్ అమలు చేయడం లేదంటూ సుప్రీం కోర్టులో ఇటీవలే పిటిషన్ దాఖలైంది. అటు రిజర్వ్ బ్యాంక్ కూడా చెల్లింపుల డేటాను (ట్రయల్ దశలోనైనా సరే) భారత్‌లోనే భద్రపర్చాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి వాట్సాప్ కూడా అంగీకరించింది. ఈ రకంగా చూస్తే భారత్‌లో వాట్సాప్ పే ఆరంగేట్రం చాలా ఖరీదైన వ్యవహారంగా మారే అవకాశం ఉంది. పోటాపోటీ... ఈ మార్కెట్లో దూసుకుపోవడం వాట్సాప్‌కు అంత ఆషామాషీగా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గూగుల్ పే, అమెజాన్ పే, వాల్‌మార్ట్– ఫ్లిప్‌కార్ట్‌కి చెందిన ఫోన్‌పే లాంటి ఇతర దిగ్గజాలతోనూ పోటీపడాలి. అదీ గాకుండా టెక్ సంస్థ యాపిల్ త్వరలోనే తమ యాపిల్ పే మొబైల్ వాలెట్‌ను కూడా భారత్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అమెజాన్, వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థల పరిస్థితి కాస్త వేరుగా ఉంటుంది. ఈ పేమెంట్స్ వాలెట్స్‌ను వాటి సొంత కస్టమర్లే .. అదీ ఎక్కువగా క్యాష్‌బ్యాక్ కోసమే ఉపయోగించుకుంటూ ఉంటారు. టెలికం కంపెనీల వాలెట్స్ కూడా దాదాపు ఇలాంటివే. ఆ రకంగా చూస్తే ఇలాంటి సంస్థల నుంచి పోటీ కాస్త సాధారణ స్థాయిలోనే ఉన్నా.. పేటీఎంతో చిక్కు తప్పకపోవచ్చన్నది పరిశ్రమవర్గాల అంచనా. డీమోనిటైజేషన్ సమయంలో మొబైల్ వాలెట్ సంస్థలు కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చాయి. కానీ చాలా మటుకు సంస్థలు ఆ తర్వాత క్రమంగా కనుమరుగవుతున్నాయి. 2017 ఆఖరు నాటికి దేశీయంగా 60 పైగా మొబైల్ వాలెట్లు ఉండేవి. కానీ నెమ్మదిగా వ్యవస్థలో నగదు చెలామణీ మళ్లీ పెరగడం మొదలయ్యాక.. వీటి సంఖ్య క్రమంగా తగ్గి.. ప్రస్తుతం 50 లోపునకు పడిపోయింది. వాట్సాప్ ఇలాంటివాటిని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. -
తెలంగాణ వచ్చినా ఆంధ్రా అధికారుల పెత్తనమే
దుమ్ముగూడెం సర్కిల్లోని ఆంధ్రా ఇంజనీర్లు పద్ధతి మర్చుకోవాలి పనులు కేటాయింపులో తెలంగాణ ఇంజనీర్ల అన్యాయం. ఇంజినీర్ల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఇంజినీర్ల జేఏసీ చైర్మన్ చంద్రారెడ్డి ఖమ్మంఅర్బన్:ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా అంధ్రా అధికారుల పెత్తనమే సాగుతుందని ఇంజినీర్లు జేఏసీ చైర్మన్ చంద్రారెడ్డి అన్నారు.మంగళవారం దుమ్ముగూడెం సర్కిల్ కార్యాలయంలో ఇంజినీర్ల జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.కరువు కోరల్లో ఉన్న తిరుమలాయపాలెం మండలంలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి తెలంగాణ ఇంజినీర్లు కష్టపడి సర్వే,అంచనాలు పనులు పూర్తిచేశారని తెలిపారు.ఇప్పుడు ఆంధ్రా అధికారులు తెలంగాణ ఇంజినీర్లను అవమాన పరిచే విధంగా ప్రవర్తిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని విమర్శించారు. దుమ్ముగూడెం సర్కిల్ కార్యాలయంలోని ఎస్ఈ, ఈఈలు ఆంధ్రాకు చెందిన వారు కావడంతో ముగ్గురు డీఈలు,ఏడుగురు ఏఈలు చేయాల్సిన పనులను ఆంధ్రాకు చెందిన డీఈ, ఏఈలకు కేటాయించారన్నారు.సర్వేలు సమయంలో తెలంగాణ ఇంజినీర్లు కష్టపడితే పనులు ప్రారంభంలో మాత్రం ఆంధ్రా అధికారులే పెత్తనం చలాయిస్తున్నారన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందన్నారు. సమావేశంలో టీఎన్జీఓస్ నాయకుడు కె.రంగరాజు పీఆర్,ఆర్డబ్ల్యూఎస్,ఇరిగేషన్,గృహనిర్మాణ తదితర ఇంజనీరింగ్ విభాగాల డీఈలు,ఏఈలు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, మాణిక్యాలరావు, వెంకటరామ్, వెంకటరామ్‌రెడ్డి,అర్జన్ు ఉన్నారు.