మాట్లాడుతున్న చంద్రారెడ్డి
దుమ్ముగూడెం సర్కిల్‌లోని ఆంధ్రా ఇంజనీర్లు పద్ధతి మర్చుకోవాలి
పనులు కేటాయింపులో తెలంగాణ ఇంజనీర్ల అన్యాయం.
ఇంజినీర్ల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం
ఇంజినీర్ల జేఏసీ చైర్మన్ చంద్రారెడ్డి
ఖమ్మంఅర్బన్:ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా అంధ్రా అధికారుల పెత్తనమే సాగుతుందని ఇంజినీర్లు జేఏసీ చైర్మన్ చంద్రారెడ్డి అన్నారు.మంగళవారం దుమ్ముగూడెం సర్కిల్ కార్యాలయంలో ఇంజినీర్ల జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.కరువు కోరల్లో ఉన్న తిరుమలాయపాలెం మండలంలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి తెలంగాణ ఇంజినీర్లు కష్టపడి సర్వే,అంచనాలు పనులు పూర్తిచేశారని తెలిపారు.ఇప్పుడు ఆంధ్రా అధికారులు తెలంగాణ ఇంజినీర్లను అవమాన పరిచే విధంగా ప్రవర్తిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని విమర్శించారు. దుమ్ముగూడెం సర్కిల్ కార్యాలయంలోని ఎస్‌ఈ, ఈఈలు ఆంధ్రాకు చెందిన వారు కావడంతో ముగ్గురు డీఈలు,ఏడుగురు ఏఈలు చేయాల్సిన పనులను ఆంధ్రాకు చెందిన డీఈ, ఏఈలకు కేటాయించారన్నారు.సర్వేలు సమయంలో తెలంగాణ ఇంజినీర్లు కష్టపడితే పనులు ప్రారంభంలో మాత్రం ఆంధ్రా అధికారులే పెత్తనం చలాయిస్తున్నారన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందన్నారు. సమావేశంలో టీఎన్‌జీఓస్ నాయకుడు కె.రంగరాజు పీఆర్,ఆర్‌డబ్ల్యూఎస్,ఇరిగేషన్,గృహనిర్మాణ తదితర ఇంజనీరింగ్ విభాగాల డీఈలు,ఏఈలు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, మాణిక్యాలరావు, వెంకటరామ్, వెంకటరామ్‌రెడ్డి,అర్జన్‌ు ఉన్నారు.