Helf
-
రైతులను ఆదుకోవాలి
కోదాడ : నానాటికీ సంక్షోభంలోకి నెట్టబడుతున్న వ్యవసాయరంగం అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి.. అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఆత్మహత్యలకు పాల్పడకుండా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతుసంఘం నాయకులు కోరారు. శనివారం కోదాడలో జరిగిన ఆ సంఘం డివిజన్ సమావేశంలో నాయకులు కుక్కడపు ప్రసాద్, ఏనుగుల వీరాంజనేయులు మాట్లాడారు. ఆత్యహత్యలకు పాల్పడిన రైతులకు రూ.6 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూలై 25న నడిగూడెం మండల కేంద్రంలో జరిగే డివిజన్ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు బుర్రి శ్రీరాములు, జుట్టుకొండ వీరయ్య, ముత్యాలు, బ్రహ్మయ్య, భిక్షం, ధనయ్య, నన్నెసాహెబ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఆదుకోవాలి
కోదాడ : నానాటికీ సంక్షోభంలోకి నెట్టబడుతున్న వ్యవసాయరంగం అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి.. అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఆత్మహత్యలకు పాల్పడకుండా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతుసంఘం నాయకులు కోరారు. శనివారం కోదాడలో జరిగిన ఆ సంఘం డివిజన్ సమావేశంలో నాయకులు కుక్కడపు ప్రసాద్, ఏనుగుల వీరాంజనేయులు మాట్లాడారు. ఆత్యహత్యలకు పాల్పడిన రైతులకు రూ.6 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూలై 25న నడిగూడెం మండల కేంద్రంలో జరిగే డివిజన్ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు బుర్రి శ్రీరాములు, జుట్టుకొండ వీరయ్య, ముత్యాలు, బ్రహ్మయ్య, భిక్షం, ధనయ్య, నన్నెసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.