పాక్ సరిహద్దుల్లో ‘హెలిబోర్న్ ఆపరేషన్’
జైసల్మేర్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో, అంతకు రెట్టింపు స్థాయిలో శత్రువును దెబ్బకొట్టేందుకు చేపట్టే కీలక విన్యాసాలను ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లు సంయుక్తంగా చేపట్టాయి. ‘హెలిబోర్న్ ఆపరేషన్’ పేరుతో పాక్ సరిహద్దుకు సమీపంలోని జైసల్మేర్ (రాజస్థాన్) ఎడారి ప్రాంతంలో రెండు రోజులు(ఆది, సోమవారాల్లో) సైనిక పాటవాన్ని పరీక్షించుకుంటున్నారు.
యుద్ధ సమయంలో, అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు, సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సి వచ్చినప్పుడు సైనిక, వైమానిక బలగాలు ఎలాంటి సమన్వయాన్ని కలిగి ఉండాలి? ఇటువైపు తక్కువ నష్టంతో శత్రువును ఎలా మట్టుపెట్టాలి? లాంటి విన్యాసాలను కృత్రిమ యుద్ధ వాతావరణంలో చేపట్టడంతోపాటు కమ్యూనికేషన్ వ్యవస్థ వినియోగంపై విన్యాసాలు ప్రదర్శించారు. యుద్ధ హెలికాప్టర్లు, సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించగల ఆయుధాలను కూడా వినియోగించారు. పలువురు సీనియర్ అధికారుల పర్యవేక్షణలో సాగుతోన్న హెలీబోర్న్ ఆపరేషన్ కు సంబంధించిన ఫొటోలు మీకోసం..