helicopter shot down
-
హెలికాప్టర్ షాట్ ఇరగదీశాడుగా..!
అఫ్గనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ గురించి క్రికెట్ అభిమానులకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. తన బౌలింగ్‌తో ఎంతటి బ్యాట్స్‌మన్‌ను అయినా తికమక పెట్టే రషీద్.. బ్యాటింగ్‌లో కూడా అప్పడప్పుడూ మెరుస్తూ ఉంటాడు. ఆల్ రౌండర్ రషీద్ ఎక్కువగా 6వ స్థానంలో బ్యాటింగ్‌లో దిగినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు రషీద్ ఖాన్‌కు సంబంధించిన అరుదైన వీడియోను ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్ అఫ్గనిస్తాన్ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించాడు. View this post on Instagram 🚁🤯 #OrangeArmy #SRH @rashid.khan19 A post shared by SunRisers Hyderabad (@sunrisershyd) on Jul 23, 2020 at 8:31pm PDT అయితే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా..?ఇక్కడ స్పెషల్ ఏంటంటే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫేవరెట్ షాట్లలో ఒకటైన హెలికాప్టర్ షాట్‌ను రషీద్ ఇరగదీశాడు.. దీంతో ధోని ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ అభిమానులు కూడా దీనికి మంత్ర ముగ్ధులయ్యారు. రషీద్‌లో సిన్నర్‌తో పాటు టాలెంటెడ్ బ్యాట్స్‌మన్ కూడా ఉన్నాడంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. రషీద్‌ను ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ పంపాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ 2017 ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున రషీద్ అరంగేంట్రం చేశాడు. ప్రతీ సీజన్లోనూ తనదైన మార్కును చూపెడుతున్న రషీద్.. ఇప్పటి వరకూ 46 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 6.55 ఎకానమీతో 55 వికెట్లు పడగొట్టాడు. -
మా హెలికాప్టర్‌ను కుప్పకూల్చారు
రష్యా మిలటరీకి చెందిన హెలికాప్టర్‌ను సిరియాలో తిరుగుబాటుదారులు కూల్చివేశారు. సిరియాలోని అలెప్పొకు మానవతాసాయం వస్తువులను చేరవేసి రష్యాకు తిరిగి వస్తుండగా, ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో ఎంఐ-8 హెలికాప్టర్‌ను కూల్చివేశారని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. హెలికాప్టర్లో ముగ్గురు సిబ్బంది, ఇద్దరు అధికారులు ఉన్నారు. హెలికాప్టర్లో ఉన్న వారి పరిస్థితి తెలియరాలేదని రష్యా రక్షణ శాఖ వెల్లడించగా.. ఈ ప్రమాద ఘటన దృశ్యాలకు సంబంధించిన ఫొటోలను తిరుగుబాటుదారులు ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలను బట్టి హెలికాప్టర్ ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారని భావిస్తున్నారు. తిరుగుబాటుదారులు కూల్చిన హెలికాప్టర్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ప్రమాదస్థలితో సాయుధులు, కొందరు యువకులు, మోటార్ బైకులు కనిపించారు. హెలికాప్టర్ శకలాల నుంచి పైలట్ బాడీని ఈడ్చుకెళ్తున్నట్టుగా ఫొటోల్లో కనిపించింది. ఫైలట్ బాడీని ఓ దుండగుడు ఈడ్చుకెళ్లి ట్రక్‌లో వేయగా, కొందరు యువకులు మొబైల్ ఫోన్లతో ఈ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. నెలరోజుల క్రితం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సిరియాలో రష్యా హెలికాప్టర్‌ను కూల్చివేసిన ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు.