మా హెలికాప్టర్ను కుప్పకూల్చారు | Russia says helicopter shot down after delivering aid to Aleppo | Sakshi
Sakshi News home page

మా హెలికాప్టర్ను కుప్పకూల్చారు

Published Mon, Aug 1 2016 4:36 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

మా హెలికాప్టర్ను కుప్పకూల్చారు

మా హెలికాప్టర్ను కుప్పకూల్చారు

రష్యా మిలటరీకి చెందిన హెలికాప్టర్ను సిరియాలో తిరుగుబాటుదారులు కూల్చివేశారు. సిరియాలోని అలెప్పొకు మానవతాసాయం వస్తువులను చేరవేసి రష్యాకు తిరిగి వస్తుండగా, ఇడ్లిబ్ ప్రావిన్స్లో ఎంఐ-8 హెలికాప్టర్ను కూల్చివేశారని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. హెలికాప్టర్లో ముగ్గురు సిబ్బంది, ఇద్దరు అధికారులు ఉన్నారు.

హెలికాప్టర్లో ఉన్న వారి పరిస్థితి తెలియరాలేదని రష్యా రక్షణ శాఖ వెల్లడించగా.. ఈ ప్రమాద ఘటన దృశ్యాలకు సంబంధించిన ఫొటోలను తిరుగుబాటుదారులు ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలను బట్టి హెలికాప్టర్ ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారని భావిస్తున్నారు. తిరుగుబాటుదారులు కూల్చిన హెలికాప్టర్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ప్రమాదస్థలితో సాయుధులు, కొందరు యువకులు, మోటార్ బైకులు కనిపించారు. హెలికాప్టర్ శకలాల నుంచి పైలట్ బాడీని ఈడ్చుకెళ్తున్నట్టుగా ఫొటోల్లో కనిపించింది. ఫైలట్ బాడీని ఓ దుండగుడు ఈడ్చుకెళ్లి ట్రక్లో వేయగా, కొందరు యువకులు మొబైల్ ఫోన్లతో ఈ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. నెలరోజుల క్రితం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సిరియాలో రష్యా హెలికాప్టర్ను కూల్చివేసిన ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement