రూ.5.5 కోట్ల నిధులను సమీకరించిన హెల్త్ఎనేబ్లర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ కంపెనీ హెల్త్ఎనేబ్లర్... రూ.5.5 కోట్ల మేర నిధులను సమీకరించింది. సీడ్ రౌండ్ విభాగంలో సిలిక్యాన్ వ్యాలీ, హాంగ్‌కాంగ్‌కు చెందిన పలు బృందాలు ఈ పెట్టుబడులను పెట్టినట్లు సంస్థ కో- ఫౌండర్, సీటీఓ అవిషేక్ ముఖర్జీ చెప్పారు. ఈ నిధులను పేటెంటెడ్ ఈఎంఆర్ టెక్నాలజీ అభివృద్ధి కోసం వినియోగిస్తామన్నారు. ‘‘ప్రస్తుతం ముంబై, కోల్కత్తా నగరాల్లో సేవలందిస్తున్నాం. ఈ ఏడాది చివరికల్లా రెండో రౌండ్ నిధుల సమీకరణపై దృష్టిపెడతాం. వీటి సాయంతో దేశంలోని మరో 8 నగరాలకు విస్తరిస్తాం’’ అని ముఖర్జీ ఒక ప్రకటనలో తెలియజేశారు. మొబైల్ వేదికగా టెలీ హెల్త్ కేర్ సేవలందిస్తున్న హెల్త్ఎనేబ్లర్... గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైంది.