Hernia operation
-
భువీకి శస్త్రచికిత్స.. ఐపీఎల్ డౌటేనా?
టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు లండన్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో హెర్నియా శస్త్రచికిత్స జరిగిందని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. గత కొంతకాలంగా వరుస గాయాలతో సతమతమవుతున్న ఈ మీడియం పేసర్ జట్టులోకి వస్తూ వెళుతున్నాడు. తాజాగా వెస్టిండీస్ సిరీస్‌లో ఇబ్బంది పడిన ఈ బౌలర్‌ను జట్టు నుంచి తప్పించారు. అయితే తాజాగా భారత ఫిజియోథెరపిస్ట్ యోగేశ్వర్ పర్మార్ పర్యవేక్షనలో భువీకి శస్త్రచికిత్స జరిగిందని, పునరావాస శిక్షణ కోసం త్వరలోనే జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో చేరతాడని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. అయితే విశ్రాంతి ఎన్ని రోజులు అనే దానిపై అయన స్పష్టతనివ్వలేదు. దీంతో భువీ ఐపీఎల్ ఆడటం అనుమానమేనని పలువురు క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రధానమైన బౌలరైన భువీ ఐపీఎల్ ఆడకపోతే ఆ జట్టుకు తీవ్ర నష్టం జరగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా ఏడు నెలల నిషేధం, తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన యువ క్రికెటర్ పృథ్వీ షా విషయంపై కూడా బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ప్రథ్వీ షా గాయం నుంచి కోలుకున్నాడని, పునరావాస కేంద్రం ఎన్సీఏలో పూర్తి ఫిట్నెస్ సాధించాడని జైషా పేర్కొన్నాడు. అంతేకాకుండా సెలక్షన్స్‌కు అతడు పూర్తిగా అందుబాటులో ఉంటాడని, త్వరలో న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత-ఏ జట్టుతో కలుస్తాడని తెలిపాడు. ఇక ఆటగాళ్లు పదేపదే గాయాల పాలవడంతో ఎన్సీఏ తీరు పట్ల మాజీ క్రికెటర్లు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. పునరావాసా కేంద్రంలో ఆటగాళ్లకు కావాల్సిన కనీస సౌకర్యాలు లేవని, అందుకే జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు ఎనీసీఏపై నమ్మకం లేకనే ప్రయివేట్‌గా ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. -
ముక్కు ఆపరేషన్ కోసం వెడితే దారుణం
వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ ఘటన.ముక్కు ఆపరేషన్‌కోసం ఆసుపత్రిలో చేరిన బాలుడికి హెర్నియా ఆపరేషన్ నిర్వహించిన ఘటన కలకలం రేపింది. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే హెర్నియా ఆపరేషన్ కోసం ధనుష్ మరో రోగి ఇదే ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో ఇద్దరు రోగుల మధ్య కన్ఫ్యూజన్కు లోనైన వైద్యులు..ఒకటికి నాలుగు సార్లు ధృవీకరించుకోవాల్సింది పోయి.. వెనకా ముందు చూడకుండా బాలుడికి శస్త్ర చికిత్స పూర్తి చేశారు. దీంతో ముక్కు ప్రాంతంలో (నాసిల్ ఫాలిప్స్)సర్జరీ జరగాల్సిన తమ కుమారుడు మహ్మమద్ డానిష్ (7) పొట్టపై కుట్లు ఉండటం చూసి తల్లితండ్రులు షాక్ అయ్యారు. దీంతో ఆసుపత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు బాధపడకూడదని అని రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి కె.కె.శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు ఈ కేసులో బాధ్యతా రాహిత్యంగా వ్యవరించిన డాక్టర్ ఎ సురేష్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. బాధిత బాలుడికి ఉచిత చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. అటు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా వైద్య కళాశాల సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. -
హెర్నియా ఆపరేషన్‌కు వస్తే ప్రాణాలే తీశారు
మత్తుమందు ఎక్కువై చిన్నారి మృతి పోలీసులకు ఫిర్యాదు రాంగోపాల్‌పేట్: హెర్నియాతో బాధపడుతున్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకురాగా నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన సం ఘటన రసూల్‌పుర చౌరస్తా సమీపంలోని అంకుర ఉమెన్స్, చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ములుగుకు చెందిన జగదీశ్, పల్లవి దంపతుల కుమారుడు అనిర్పన్ (18 నెలలు)కు హెర్నియాతో బాధపడుతుండటంతో వరంగల్‌లోని ఓ ఆస్పత్రిలో చూపించారు. శస్త్ర చికిత్స చేయించాల్సి ఉంటుందని వారు చెప్పడంతో ఈ నెల 24న ఉప్పల్‌లోని అంకుర ఆస్పత్రిలో డాక్టర్ కరుణ సాగర్‌కు చూపించారు. బాబుకు శస్త్ర చికిత్స చేయాలని చెప్పడంతో వారు అంగీకరించారు. అదే రోజు మధ్యాహ్నం 1గంటకు ఆపరేషన్ ధియేటర్లోకి తీసుకుని వెళ్లిన వైద్యులు 2.30గంటల తర్వాత బయటికి వచ్చి కొద్దిగా మత్తులో ఉన్నాడని ఐసీయూలో ఉంచినట్లు తెలిపారు. తెల్లవారిన తర్వాత బాబు మెలకువలోకి రాగా, మత్తు ఎక్కువ అయిందని కళ్లు, కాళ్లకు ఇబ్బంది ఏర్పడిందని ప్రాణాలకు ముప్పులేదని చెప్పారు. అటు తర్వాత సీటీ, స్కాన్, ఎంఆర్ఐ తీసి పరిస్థితి విషమంగా ఉందని చెప్పి ఈ నెల 27న ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రికి బాబు చనిపోయినట్లు చెప్పడంతో రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.