heroine kajol
-
ప్రేమ పెళ్లి అంత వీజీ కాదు
కాజోల్ తాజా సినిమా ‘త్రిభంగ’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఫ్యామిలీ అనుబంధాలలోని సవాళ్లను ఈ సినిమా చర్చిస్తూ విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. ‘త్రిభంగ’ అనేది ఒడిస్సీ నృత్యంలో ఒక భంగమ. దానిని కచ్చితంగా ఎవరూ పెట్టలేరు.. అయినా ఒక అందం ఉంటుంది. ఈ సందర్భంగా జరుగుతున్న ఫ్రమోషన్లో కాజోల్ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో అనుబంధాలన్నీ అందరి ఇష్టాల కచ్చితత్వంతో ఉండవని అంది. ‘1999లో అజయ్ దేవగన్‌ను నేను పెళ్లి చేసుకుందామనుకున్నప్పుడు మా నాన్న షోము ముఖర్జీ అందుకు సముఖంగా లేరు. అప్పుడు నా వయసు 23 ఏళ్లు. ఇంకా కొన్నాళ్లు పెళ్లిని వాయిదా వేసి కెరీర్ మీద దృష్టి పెట్టాలని ఆయన ప్రతిపాదన. నాకేమో పెళ్లి చేసుకోవాలని. మరోవైపు అజయ్ తల్లిదండ్రులు మా పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. మా నాన్న మాత్రం నాతో నాలుగురోజులు మాట్లాడలేదు కూడ. అప్పుడు మా అమ్మ (తనూజ) నాకు సపోర్ట్‌గా నిలిచింది. నీ మనసుకు నచ్చినట్టు చెయ్ అని చెప్పింది. మా అమ్మ నా ప్రతి కష్టకాలంలో నాకు తోడు ఉంది. ఆమె అన్నీ నాకు వివరించి చెప్పేది. మా నాన్నంటే మాకు ఎంత ఇష్టమైనా ఆమె వివరించిన దానిని బట్టి వారి విడాకులను పిల్లలం మేము అర్థం చేసుకున్నాం. కుటుంబంలో సవాళ్లు వస్తూనే ఉంటాయి. వాటిని జాగ్రత్తగా నిర్వహించుకోవాలి’ అంది కాజోల్. అజయ్–కాజోల్‌ల జంట బాలీవుడ్లో సక్సెస్ఫుల్ వివాహిత జంటగా గుర్తింపు పొందింది. వారికి ఇద్దరు పిల్లలు. అజయ్, కాజోల్ నటనను కొనసాగిస్తున్నారు.. సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. -
హీరోయిన్‌పై వేటుకు సిద్ధం?
హీరోయిన్ కాజోల్ మీద వేటు వేసేందుకు ప్రసారభారతి సిద్ధం అవుతోంది. సమావేశాలకు హాజరు కాకపోవడంతో ఆమెను తప్పించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పరిశీలనలో ఉంది. దూరదర్శన్, ఆలిండియా రేడియోలతో కూడిన ప్రసారభారతి ఒక స్వతంత్ర సంస్థ. ఇది సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. 2016 ఫిబ్రవరి నెలలో కాజోల్‌ను ఈ బోర్డులో పార్ట్ టైం సభ్యురాలిగా నియమించారు. అయితే గత నాలుగు సమావేశాల నుంచి ఆమె అసలు హాజరు కావడం లేదు. దాంతో ఆమెను ఆ పదవి నుంచి తప్పించాలని భావిస్తున్నారు. చైర్మన్‌కు చెప్పకుండా వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైతే వాళ్ల సభ్యత్వాన్ని రద్దుచేయచ్చని ప్రసారభారతి నిబంధనలు చెబుతున్నాయి. ముందుగానే ఉన్న వృత్తిపరమైన కమిట్మెంట్ల వల్లే గత మూడు నాలుగు సమావేశాలకు కాజోల్ హాజరు కాలేదని ఆమె ప్రతినిధి జైవీర్ అన్నారు. అంతేకాక ఈ సంవత్సరంలో చాలాకాలం పాటు కుటుంబపరమైన వైద్య కారణాలు కూడా అందుకు ఉన్నాయన్నారు. గత కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయినందుకు ఆమె కూడా చాలా బాధపడ్డారని తెలిపారు. కానీ బోర్డులోని పలువురు సభ్యులు మాత్రం గత సమావేశంలోనే ఆమె రాకపోవడాన్ని ప్రస్తావించి, కాజోల్‌ను తొలగించాలని అన్నారు. ముందుగా ఆమెకు ఒక నోటీసు పంపుతామని, ఆ తర్వాత ఆమెపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మంత్రిత్వశాఖ నిర్ణయిస్తుందని బోర్డు వర్గాలు తెలిపాయి. బోర్డు సమావేశాలకు వచ్చేందుకు సభ్యులకు విమాన చార్జీలు, హోటల్ చార్జీలు, ఇతర అలవెన్సులు ఇస్తారు.