heroine problem
-
ఆ నలుగురికి హీరోయిన్ ప్రాబ్లమ్!
పాతికేళ్లు నిండిన ఎవరినైనా టాలీవుడ్లో నలుగురు హీరోల పేర్లు చెప్పమంటే వచ్చే సమాధానం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్. మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమాపై ముద్ర వేసిన ఈ నలుగురు హీరోలతో సినిమాలు చేయడానికి ఒకప్పుడు హీరోయిన్లు పోటీ పడేవారు. ఒక్క చాన్స్ కోసం వెయ్యికళ్లతో ఎదురు చూసేవారు. సీనియర్ హీరోలుగా ఉన్నప్పుడు కూడా నిండా ఇరవై నిండని అమ్మాయిలు హీరోయిన్లుగా వీళ్లతో ఆడి పాడేవారు. కానీ ఇప్పుడు ఆ నలుగురు హీరోలు సీనియర్స్ కేటగిరీని కూడా దాటిపోయారు. వాళ్ల సినిమాలకు మెగాఫోన్ పట్టడానికి ఇప్పటికీ డెరైక్టర్లు పోటీ పడుతున్నారన్నది నిజమే కానీ... జోడీ కట్టడానికి మాత్రం హీరోయిన్లు కరువైపోతున్నారు. చిరు, బాలయ్య, నాగ్, వెంకీలతో జతకట్టడానికి యంగ్ హీరోయిన్స్ వెనకడుగు వేస్తున్నారు. ఆ మాటకొస్తే కొత్త హీరోయిన్స్‌ను ఈ సూపర్ సీనియర్లకు మ్యాచ్ చేయడం డెరైక్టర్లకు కూడా ఇబ్బందిగా మారుతోంది. ఈ పరిస్థితిపై పూర్తి కథనం ఈ రోజు మధ్యాహ్నం 12.30 ని.లకు సాక్షి టీవీలో ప్రసారమయ్యే ‘హీరోయిన్ కావలెను’ స్పెషల్ డ్రైవ్‌లో చూడొచ్చు. -
బాలయ్య హీరోయున్స్కి చాన్సులు రావా..?
-
మూడు నెలలు హీరోయిన్ దొరకలేదు: సంపు
తాను సినిమా చేయడానికి నిర్మాత, దర్శకుడు, కథ.. అన్నీ సిద్ధమైపోయినా మూడు నెలల పాటు హీరోయిన్ దొరకలేదని సంచలన హీరో సంపూర్ణేష్ బాబు తెలిపాడు. 'సాక్షి' కార్యాలయానికి వచ్చిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడినప్పుడు.. హృదయ కాలేయం సినిమా ఆలస్యం కావడానికి, దాదాపు ఏడాది పాటు బయటకు రాకపోవడానికి కారణమేంటని ప్రశ్నించినప్పుడు ఈ విషయం బయటపెట్టాడు. నిజానికి తన పక్కన హీరోయిన్గా నటించడానికి ఎవరూ ముందుకు రాలేదని, మూడు నెలల పాటు వెతికి వెతికి, చివరకు తప్పనిసరైతే ఎవరైనా అబ్బాయికే అమ్మాయి వేషం వేయించి అయినా హీరోయిన్గా పెట్టేద్దామని అనుకుంటుండగా ఈ హీరోయిన్ దొరికిందని, దాంతో ఇక అప్పటినుంచి ప్రాజెక్టు వేగం పుంజుకుందని చెప్పాడు. ప్రేక్షకుల నుంచి ఇంత ఆదరణ లభిస్తుందని తాను అస్సలు ఊహించలేదని, కానీ స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా ప్రేక్షక దేవుళ్లు విపరీతంగా ఆదరించారని తెలిపాడు. అమెరికాలో 20 స్క్రీన్లలో ఈ సినిమా విడుదల చేయగా, అక్కడ కూడా ప్రేక్షకులు ఈలలు వేసి, చప్పట్లు కొట్టినట్లు తెలిసిందని, వాళ్ల అభిమానానికి తాను ఎంతగానో రుణపడి ఉంటానని అన్నాడు. రాబోయే సినిమా 'కొబ్బరిమట్ట'ను కూడా ప్రేక్షకులు ఇదే స్థాయిలో ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపాడు.