hgmc elections
-
కారు కాదు రాకెట్
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం మిన్నంటిన సంబరాలు పార్టీ శ్రేణుల్లో ఉప్పొంగిన ఉత్సాహం వాడవాడలా విజయోత్సవాలు గ్రేటర్లో కారు దుమ్ము రేపింది. ఆకాశమే హద్దుగా... రాకెట్లా దూసుకుపోయింది. కారు రేపిన దుమ్ములో సైకిల్, కమలం, హస్తం అడ్రస్‌లు గల్లంతయ్యాయి. గులాబీ గాలి ముందు ఏ పార్టీ నిలవలేకపోయింది. కారు దెబ్బకు సైకిల్ ముక్కలు చె క్కలైంది. టీడీపీకి సింగిల్ డిజిట్ సీట్లు వస్తాయని అందరూ లెక్కలేస్తే...‘సింగిల్’ సీటుకే పరిమితమైంది. ఆ పార్టీకి ‘మహా’దెబ్బ పడింది. సైకిల్‌తో జత కట్టిన పాపానికి కమలమూ వాడిపోయింది. నిన్నటి వరకూ గ్రేటర్ పాలనలో భాగం పంచుకున్న కాంగ్రెస్‌కు తేరుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఉనికికే ముప్పు వాటిల్లింది. టీఆర్ఎస్ తరువాత అత్యధిక సీట్లను మజ్లిస్ పార్టీ గెలుచుకుంది. -
ప్రచారంలో వింతవింతలు
ఎంత ఎదిగినా.. బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు గోరుముద్దలు తినిపించినా.. స్కూలుకు వెళుతున్నప్పుడు.. పరీక్షలప్పుడు కొసరికొసరి వడ్డించినా.. తనంత ఎదిగిన బిడ్డకు ఆప్యాయపు ముద్దలు కలిపి పెట్టినా అమ్మచేతి ముద్దలో అదే ఆప్యాయపు కమ్మదనం.. సీతాఫల్మండి టీఆర్ఎస్ అభ్యర్థి సామల హేమ ప్రచారానికి వెళ్లేముందు అన్నం తినిపిస్తున్న తల్లి జ్యోతి నే చెప్పొచ్చేదేంటంటే.. షాపూర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ ఆరిఫ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్న ఎంపీ హన్మంతరావు, శ్రీశైలంగౌడ్ అవ్వా.. కారు గుర్తుంచుకో.. ప్రచారంలో భాగంగా జాంబాగ్ టీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్‌కుమార్ గౌడ్ తనకు ఓటు వేయాలని కాలనీలోని ఓ వృద్ధురాలిని కోరుతున్న దృశ్యం గెలుపు మంతనాలు.. గోషామహల్ డివిజన్ బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్‌తో కలిసి రోడ్‌షోలో పాల్గొన్న కేంద్రమంత్రి దత్తాత్రేయ, బద్దం బాల్‌రెడ్డి