సీఎం సభకు భారీ ఏర్పాట్ల
పెనుమంట్ర/పోడూరు, న్యూస్‌లైన్ :ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సభ కోసం పెనుమంట్ర మండలం మార్టేరు, పోడూరు మండలం జగన్నాథపురం సరిహద్దులోని తేతలి కనికిరెడ్డి రైస్‌మిల్లు ఆవరణలో భారీ ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం వరకూ ఆవరణలోని చెత్తను తొలగింపచేసిన అధికారు లు సభావేదిక, బారికేడ్లను హుటాహుటిన నిర్మిం చే పనిని కొనసాగిస్తున్నారు. సభావేదికకు వెళ్లే మార్గంలోని 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను, విద్యుత్ లైన్లను శాశ్వతంగా తొలగించారు. రచ్చబండ సభలో పెనుగొండ, ఆచంట, పెనుమంట్ర మండలాలకు చెందిన సుమారు 8,600 మందికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా వివిధ పథకాల మంజూరు పత్రాలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, డీఆర్డీఏ పీడీ వై.రామకృష్ణ దగ్గరుండి ఇక్కడి పనులను పర్యవేక్షిస్తున్నారు. నరసాపురం డీఎస్పీ కె.రఘువీరారెడ్డి పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రూ.18 కోట్లతో నిర్మించే మార్టేరు-ఆచంట రోడ్డు విస్తరణ పనులకు మార్టేరు సెంటర్లో శంకుస్థాపన చేస్తారు.