High-tension wire
-
సెల్ఫీ పిచ్చి.. హైటెన్షన్ వైర్లు తగిలి యువకుడి మృతి
జంషెడ్ పూర్ : సెల్ఫీసరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. గూడ్స్ రైలుపై ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఓ యువకుడు, మరో బాలుడికి హైటెన్షన్ వైర్లు తాకి షాక్ కొట్టింది. ఈ ఘటనలో ఎండీ ఫైజల్ (20) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, నవేద్ అక్తర్ (11)కు తీవ్రగాయాలయ్యాయి. జంషెడ్‌పూర్‌లోని టాటానగర్ రైల్వే స్టేషన్ సమపంలోని సల్గాజ్ హురిలోఈ ప్రమాదం జరిగింది. ఫైజల్ హైటెన్షన్ వైర్‌కే అతుక్కుపోగా, అక్తర్ షాక్‌కు రైలు నుంచి కిందపడిపోయాడు. గాయపడిన నవేద్ అక్తర్ ను టాటా మెయిన్ ఆస్పత్రికి తరలించారు. గూడ్స్ రైలు నింపురా యార్డు వెళ్లాల్సిన సమయంలో సిగ్నల్ కోసం వేచి చూస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. -
వినాయకనిమజ్జన విషాదం: విద్యుత్‌షాక్‌కు అయిదుగురి మృతి
దొడ్డబళ్లాపుర(కర్ణాటక): వినాయకుడిని నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా విషాదం నెలకొంది. విద్యుదాఘాతానికి అయిదుగురు దుర్మరణం చెందారు. దొడ్డబళ్లాపుర తాలూకా మధురె కనకవాడి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. గ్రామస్తులు గణేశుని విగ్రహం నిమజ్జనం చేయడానికి సమీపంలోని కాలువ వద్దకు వెళ్లారు. వినాయక నిమజ్జనం తరువాత తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌కు తెగిపడి ఉన్న విద్యుత్ హైటెన్షన్ వైరు తగిలింది. దాంతో విద్యుత్ షాక్‌కు అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురుకి కాలిన తీవ్ర గాయాలయ్యాయి. చాలా మంది ట్రాక్టర్‌పై నుంచి కిందకు దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ** -
పెళ్లి బస్సుపై తెగిపడిన హైటెన్షన్ వైర్లు
మధ్యప్రదేశ్ బిండి జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సుపై విద్యుతు హై టెన్షన్ వైర్లు పడ్డాయి. ఆ ఘటనలో ఐదుగురు మరణించగా, మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో 60 మంది బస్సులో ఉన్నారని ఐజీ డి.సి. సాగర్ వెల్లడించారు.