Higher Power Committee
-
సౌమ్యా స్వామినాథన్‌కు అరుదైన గౌరవం
న్యూయార్క్: ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ సౌమ్యా స్వామినాథన్(57)కు అరుదైన గౌరవం దక్కింది. మందులకు లొంగని సూపర్‌బగ్‌లపై పరిశోధనలకు సలహాలందించే హైపవర్ కమిటీలో ఆమెను చేరుస్తూ ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటరస్ నిర్ణయం తీసుకున్నారు. సౌమ్య ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ రీసెర్చ్ విభాగంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భారత హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ కూతురు. -
విన్నపాలు వినవలె..!
హైపవర్ కమిటీకి విజ్ఞాపనల వెల్లువ - కేకే నివాసంలో రెండోరోజు భేటీ అయిన కమిటీ - కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు విజ్ఞప్తులు - సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కోసం కమిటీని కలసిన మంత్రి కేటీఆర్ - దేవరకొండను జిల్లా చేయండి: ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, బాలూ నాయక్ - మొత్తం 630 దరఖాస్తులు అందాయి: కేకే సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల డిమాండ్లను పరిశీలించేందుకు ఏర్పాటైన ైెహ పవర్ కమిటీకి వినతులు వెల్లువెత్తుతున్నాయి. మరో ఆరు రోజుల్లో కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్న నేపథ్యంలో కూడా కమిటీకి ఇంకా దరఖాస్తులు అందుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న హై పవర్ కమిటీ ఆయన నివాసంలో బుధవారం రెండోరోజూ భేటీ అయ్యింది. వాస్తవానికి పది పాత జిల్లాలకు తోడు మరో 17 కొత్త జిల్లాలు కలిపి మొత్తంగా 27 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే సిరిసిల్ల, జనగామ, గద్వాల ప్రత్యేక జిల్లాల కోసం పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. దీంతో ఈ మూడింటికి తోడు ఆదిలాబాద్ జిల్లాలో అదనంగా ఆసిఫాబాద్ జిల్లాను కూడా ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెండ్రోజులపాటు పార్టీ నాయకులతో జరిపిన సమావేశాల్లో సూత్రప్రాయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నాలుగు జిల్లాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయం తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించేందుకు హైపవర్ కమిటీని నియమించారు. అయితే రెండ్రోజులుగా కమిటీకి మరికొన్ని కొత్త జిల్లాలు కావాలంటూ విజ్ఞప్తులు అందుతున్నాయి. ఉదయం నుంచే తాకిడి హైపవర్ కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్ రెడ్డి, జోగు రామన్న.. కేకే నివాసానికి చేరుకోక ముందే నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉదయం ఏడున్నర గంటలకే కేకేను కలసి వెళ్లారు. అలాగే అలంపూర్ ఎమ్మెల్యే సంపత్.. కమిటీని కలిసి కొత్తగా ఏర్పాటు కాబోయే గద్వాలకు జోగులాంబ పేరును పెట్టాలని కోరారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి రెండోరోజు కూడా కల్వకుర్తి అఖిలపక్ష నేతలతో కలిసి వచ్చారు. వెల్దండ, ఊర్కొండ, వంగూరు, చారగొండ, కల్వకుర్తి మండలాలతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బాలూ నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వచ్చి కమిటీతో భేటీ అయ్యారు. దేవరకొండను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, స్థానిక ప్రజాప్రతినిధులు ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని కమిటీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్మూరు నియోజకవర్గం పరిధిలోని ఆలూరును మండలంగా మార్చాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వినతి పత్రం ఇచ్చారు. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి కమిటీని కలిసి.. రంగారెడ్డి జిల్లాలో బార్వాద్ గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు వచ్చిన కార్యకర్తలు, కొద్దిసేపు కేకే నివాసం ఎదుట బైఠాయించారు. అక్కడే ఉన్న చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిని కూడా వారు నిలదీశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి కూడా కమిటీని కలిసి వెళ్లారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కమిటీని కలిసి కల్లూరు రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. గార్ల, బయ్యారం, వెంకటాపురం, వాజేడు మండలాలను ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పరిధిలోనే ఉంచాలని కోరారు. ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయండి సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లు ఉన్న చోట్ల ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయాలని న్యూడెమొక్రసీ పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీకి చెందిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, పార్టీ ప్రతినిధులతో కలిసి వచ్చి హైపవర్ కమిటీని కలిశారు. తెలంగాణలో భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారంలో ఐటీడీఏలు ఉన్నాయని, ఇవి జిల్లా కేంద్రాలుగా ప్రత్యేకంగా ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. 630 దరఖాస్తులు స్వీకరించాం: కేకే ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని హైపవర్ కమిటీ చైర్మన్ కేకే తెలిపారు. ఇప్పటి దాకా 630 దరఖాస్తులు అందాయన్నారు. మరికొన్ని కొత్త జిల్లాలు కావాలన్న దరఖాస్తులు కూడా అందాయని, వాటినీ పరిశీలిస్తున్నట్లు వివరించారు. రాజన్న జిల్లాగా ఏర్పాటు చేయాలి: కేటీఆర్ సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాలను కలుపుతూ సిరిసిల్లను రాజన్న జిల్లాగా ఏర్పాటు చేయాలని హైపవర్ కమిటీని కోరినట్లు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌తో కలసి బుధవారం ఆయన హైపవర్ కమిటీని కలిశారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సిరిసిల్ల జిల్లా ఏర్పాటవుతుందన్న విశ్వాసం తమకుందన్నారు. కొత్తగా రుద్రంగి, మానాల మండలాలను ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు. -
వద్దంటే రద్దయిపోతారు
♦ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకూ కొత్త ఎస్ఎస్ఆర్ అమలుకు సన్నాహాలు ♦ అంచనాల పెంపునకు అడ్డుచెబుతున్న కమిటీలపై వేటు.. సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా ప్రాజెక్టుల అంచనాలను పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అడ్డు చెబుతున్న కమిటీలపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. అంచనాల పెంపుపై తమ నిర్ణయాలను వ్యతిరేకించిన అధికారులున్న కమిటీలనే రద్దు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) నియమావళికి వ్యతిరేకంగా పోలవరం హెడ్‌వర్క్స్ పనులకు కొత్త ఎస్ఎస్ఆర్ అమలు చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని మిగతా సాగునీటి ప్రాజెక్టులకూ కొత్త ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్)ను వర్తింపజేయడానికి సిద్ధమవుతోంది. ఈపీసీ విధానంలో కొత్త ఎస్ఎస్ఆర్ వర్తింపజేయాల్సిన అవసరం లేకపోయినా.. పోలవరంలో భారీ మామూళ్ల రుచి చూసిన చినబాబు.. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు కొత్త ఎస్ఎస్ఆర్ అమలు చేయిస్తామని, ఫలితంగా దక్కే అదనపు సొమ్ములో వాటా ఇవ్వాలంటూ కాంట్రాక్టర్లతో మాట్లాడుకున్నట్లు జల వనరుల శాఖలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇసుక ఉచితం.. స్టీలు, అల్యూమినియం, పెట్రోలు-డీజిల్, సిమెంట్ ధరలు తగ్గాయి. అన్నీ తగ్గిన నేపథ్యంలో.. అంచనా వ్యయం తగ్గాలి. కానీ కొత్త ఎస్ఎస్ఆర్ అమలు పేరిట అంచనా వ్యయాన్ని భారీగా పెంచడం, ఆ మేరకు కాంట్రాక్టర్ల నుంచి భారీగా సొమ్ము దండుకోవడమే లక్ష్యంగా.. చినబాబు ముఠా సాగిస్తున్న వ్యవహారాన్ని చూసి అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. పోలవరం హెడ్‌వర్క్స్ పనుల అంచనా వ్యయాన్నే కొత్త ఎస్ఎస్ఆర్ పేరిట రూ. మూడు వేల కోట్లు పెంచిన ప్రభుత్వం.. మిగతా ప్రాజెక్టుల పనుల అంచనా వ్యయాన్ని కొత్త ఎస్ఎస్ఆర్ అమలు చేయడం ద్వారా ఖజానా మీద రూ. 20 వేల కోట్ల భారం వేయడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అంచనాల పెంపునకు అభ్యంతరాలు చెబుతున్న, అడ్డు తగులుతున్న ఎస్ఎల్ఎస్సీ, ఇంటర్నల్ బెంచ్ మార్క్ (ఐబీఎం) కమిటీతో పాటు జిల్లాస్థాయి స్టాండింగ్ కమిటీలను ఒక్క కలం పోటుతో రద్దు చేయడానికి ప్రభుత్వం తెగిస్తోంది. అన్ని కమిటీలనూ రద్దుచేసి ‘కమిషన్ ఆఫ్ టెండర్స్’కే బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈమేరకు ప్రతిపాదనలు రూపొందించే పనిలో అధికారులు ఉన్నట్లు సమాచారం. అడ్డు తొలగించుకుంటే సరి! పోలవరం హెడ్‌వర్క్స్ పనులకు కొత్త ఎస్ఎస్ఆర్ అమలు చేయడం వల్ల అంచనా వ్యయం రూ. 4,050 కోట్ల నుంచి దాదాపు రూ. ఏడు వేల కోట్లకు పెరిగిన విషయం తెలిసిందే. ఫలితంగా.. అధికార పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ‘ట్రాన్స్ట్రాయ్’కి భారీ ప్రయోజనం చేకూరింది. ఇదే తరహాలో తమకూ కొత్త ఎస్ఎస్ఆర్ వర్తింపజేయాలంటూ అధికారపార్టీకి చెందిన కాంట్రాక్టర్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. వాస్తవంగా ఈపీసీ పద్ధతిన ఒప్పందాలు జరిగిన ప్యాకేజీలకు ధరల విషయంలో మరే మార్పులు, చేర్పులు, మినహాయింపులు ఇవ్వడానికి వీల్లేదు. దీని ప్రకారం ఎస్‌ఎస్‌ఆర్‌లు పెంచడానికి మార్గదర్శకాలు అంగీకరించవు. కానీ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు కొత్త ఎస్ఎస్ఆర్ అమలు చేయిస్తామని, ఫలితంగా దక్కే అదనపు సొమ్ములో వాటా ఇవ్వాలంటూ చినబాబు ముఠా కాంట్రాక్టర్లతో మాట్లాడుకున్నట్లు జల వనరుల శాఖలో ప్రచారం జరుగుతోంది. గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వంశధార ప్రాజెక్టుల్లో పలు ప్యాకేజీలకు కొత్త ఎస్ఎస్ఆర్ వర్తింపజేయడంతో అంచనా వ్యయం భారీగా పెరిగింది. మిగతా ప్యాకేజీల్లోనూ ఎస్ఎస్ఆర్ అమలు చేయడం వల్ల ప్రభుత్వం మీద అదనంగా రూ. 20 వేల కోట్లకు పైగా భారం పడుతుందని జల వనరుల శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. చినబాబు సూచనల మేరకు.. కొత్త ఎస్ఎస్ఆర్ అమలు చేయాలని జల వనరుల శాఖకు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయని సమాచారం. అయితే కొత్త ఎస్ఎస్ఆర్ వర్తింపజేయడం నిబంధనలకు విరుద్ధమని, ఖజానాపై పెనుభారం పడుతుందంటూ ప్రతిపాదనను రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ(ఎస్ఎల్ఎస్సీ) వ్యతిరేకించింది. గతంలో కాంక్రీట్ పనులకు కొత్త ఎస్ఎస్ఆర్ అమలును, హంద్రీ-నీవా, గాలేరు-నగరి అంచనాల పెంపును ఈ కమిటీ వ్యతిరేకించిందింది. ప్రభుత్వ పెద్దలు సొమ్ము చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఐబీఎం కమిటీ, ఆర్థిక శాఖ కూడా పలుమార్లు వ్యతిరేకించాయి. అంచనాల పెంపును ఇద్దరు సీఎస్ లు కూడా వ్యతిరేకించిన విషయాన్ని ‘సాక్షి’ బయటపెట్టినప్పుడు ప్రభుత్వం ఇరుకున పడిన విషయం తెలిసిందే. ఇలా అంచనాల పెంపును కమిటీలు, అధికారులు వ్యతిరేకించిన ప్రతిసారీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతోంది. ఈ నేపథ్యంలో ఎస్ఎల్ఎస్సీ, ఐబీఎం కమిటీతో పాటు జిల్లాస్థాయి స్టాండింగ్ కమిటీలనూ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈమేరకు ప్రతిపాదనలు రూపొందించే పనిలో అధికారులు ఉన్నట్లు సమాచారం. హైపవర్ కమిటీని రద్దు చేస్తారా? రూ. 100 కోట్ల కంటే ఎక్కువ విలువైన టెండర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైపవర్ కమిటీ ఆమోదించిన తర్వాతే కాంట్రాక్టును ఇవ్వాలనే నిబంధన ఉంది. పట్టిసీమ, కుప్పం బ్రాంచ్ కెనాల టెండర్ల విషయంలో హైపవర్ కమిటీ సానుకూల నిర్ణయం తీసుకోకుండా వెనకాడినప్పుడు ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఒత్తిడి తెచ్చి సానుకూల నిర్ణయం తెప్పించుకున్నారు. సర్కారు పెద్దలు చెప్పినట్లుగా నిర్ణయాలు తీసుకుంటే.. కమిటీలో తమకు స్థానం ఎందుకు? అని ప్రశ్నిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో హైపవర్ కమిటీని కూడా రద్దు చేసి, ‘కమిషన్ ఆఫ్ టెండర్స్’కే బాధ్యత అప్పగిస్తే సరిపోతుందనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు జల వనరుల శాఖలో ప్రచారం జరుగుతోంది.