Highway bandh
-
కొనసాగుతున్న రహదారుల దిగ్బంధం
-
శ్రీకాకుళం జిల్లాలో కదంతొక్కిన వైఎస్ఆర్ సీపీ శ్రేణులు
-
కొనసాగుతున్న రహదారుల దిగ్బంధం
హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా రెండోరోజు కూడా వైఎస్ఆర్ సీపీ రహదారుల దిగ్బంధం కొనసాగుతోంది. సీమాంధ్ర జిల్లాల్లో వైఎస్ఆర్ సీపీ రహదారులను దిగ్బందిస్తున్నారు. నేతలు నిన్న పోలీసుల ఒత్తిళ్లు అరెస్టులకు తలొగ్గకుండా రహదారులను దిగ్భందించిన బెజవాడ వాసులు గురువారం కూడా కదం తొక్కారు. విభజన ప్రకటన ఆగే వరకు రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తొమ్మిదో నంబర్ జాతీయ రహదారిపై ఇబ్రహీం పట్నం వద్ద భైఠాయించారు. దీంతో హైదరాబాద్ విజయవాడల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఝాం అయింది. విద్యార్థులు, మహిళలు కూడా స్వచ్ఛందంగా దిగ్భందనంలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం క్రిష్టవరం టోల్‌ప్లాజా వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. అర్ధరాత్రి జాతీయ రహదారిపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గ నాయకుడు జ్యోతుల నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే జిల్లాలో దిండి-చించినాడ బ్రిడ్జిపై మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు, బొంతు రాజేశ్వరరావు, మత్తి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్ 216ను వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు దిగ్బంధించారు. దాంతో వాహనాలు నిలిచిపోయాయి. అలాగే నగరంలోని ఓఎన్జీసీ రిఫైనరీ ఎదుట వైఎస్ఆర్ సీపీ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, వేణుగోపాలరావు, మందపాటి కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో దిగ్బంధం చేశారు. ముమ్మడివరంలో గుత్తుల సాయి ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధంతో ట్రాఫిక్ స్తంభించింది. -
రహదారుల దిగ్బంధం
బొబ్బిలి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ శ్రేణులు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నాయి. బుధ, గురువారాల్లో రహదారుల దిగ్బంధానికి ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఇందుకోసం జిల్లా నేతలు, కార్యకర్తలు భారీ స్థాయి లో సమాయత్తమవుతున్నారు. రాష్ర్ట విభజన ప్రక్రియ ప్రకటన వెలువడినప్పటి నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్న ఆ పార్టీ శ్రేణులు ఈ నెల 6, 7 తేదీల్లో జిల్లా సరిహద్దులతో పాటు, జాతీయ రహదారులు, ప్రధాన రహదారులను దిగ్బంధించేందుకు సిద్ధమవుతున్నాయి. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో మంగళవారం బొబ్బిలి కోటలో సమావేశం నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు చర్చించారు. ఆందోళన కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, రెండు రోజుల కార్యక్రమం కాబట్టి సమన్వయంతో పక్కాగా చేయాలని సూచించారు. విజయనగరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 అమలులో ఉండడంతో ఈ ఆందోళన కార్యక్రమాలు ఎలా చేయాలి అన్న అంశంపై విజయనగరం, నెల్లిమర్ల, ఎస్.కోట నియోజకవర్గ సమన్వయకర్తలు గురాన అయ్యలు, సింగుబాబు, బోకం శ్రీనివాస్, డాక్టరు గేదెల తిరుపతిరావు, వేచలపు చిన రామునాయుడులతో చర్చించారు. విశాఖ జిల్లాల్లో ఉండే నియోజకవర్గాల సరిహద్దుల వద్ద వాహనాల రాకపోకలను నిలిపివేసి నిరసనలు తెలియజేయాలని సూచించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లంతా ఒకే దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ విజయవంతం చేయాలని సుజయ్ సూచించారు. ఇతర మార్గాల్లోంచి వాహనాలు రాకుండా చూడాలన్నారు. రహదారుల దిగ్బంధం సందర్భంగా వంటావార్పుల తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ జిల్లా సరిహద్దు తగరపువలస సమీపంలో ఆందోళన కార్యక్రమాన్ని చేస్తామని నెల్లిమర్ల నాయకులు తెలి పారు. బొబ్బిలి, పార్వతీపురం పోలీస్ సబ్ డివి జన్లకు సంబంధించి పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో జాతీయ, రాష్ర్ట రహదారులున్నందున పాచిపెంట మండలం పి కోనవలస, కోటిపాం, ఖడ్గవలస, చినమేరంగి జంక్షన్ల వద్ద రహదారులను దిగ్బంధిస్తామని ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల విజయరామరాజు, రాయల సుందరరావు, గరుడబిల్లి ప్రశాంత్‌లతో పాటు గ్రంథాలయ మాజీ చైర్మన్ దత్తి లక్ష్మణరావు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గుల్లిపల్లి సుదర్శనరావులు వివరించారు. పార్వతీపురం నియోజకవర్గంలో ఒడిశా నుంచి వచ్చిన వాహనాలు, శ్రీకాకుళం నుంచి వచ్చినవి అడ్డుకోవాలని నిర్ణయించారు. వెంకంపేట గోళీలు, నవిరి కాలనీ, సీతానగరం వంతెనల వద్ద ఈ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. ఈ నియోజకవర్గం సమన్వయకర్తలు కొయ్యాన శ్రీవాణి, జమ్మాన ప్రసన్నకుమార్, గర్భాపు ఉదయభానులకు వీటిని ఎలా నిర్వహించాలో సుజయ్ సూచించారు. చీపురుపల్లి నియెజకవర్గానికిసంబంధించి రాజాం, శ్రీకాకుళం అనుసంధానమైన రహదారులపై ఆందోనళ నిర్వహించనున్నట్టు నియోజకవర్గ ఇన్చార్జ్ సిమ్మినాయుడు, తుమ్మగంటి సూరినాయుడు వివరించారు. సమావేశంలో ఎస్సీ విభాగం జిల్లా కన్వీనరు ఆదాడ మోహనరావు, బొబ్బిలి నాయకులు మాజీ జెడ్పీటీసీలు డాక్టరు బేతనపల్లి శివున్నాయుడు, తెంటు సత్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు. విజయమ్మ ఆరా... రెండు రోజుల పాటు నిర్వహించినున్న రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి జిల్లా నాయకులు ఎలా సమాయత్తమవుతున్నారన్న విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం ఆరా తీశారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావుతో ఫోన్లో మాట్లాడి ఏర్పాట్లు గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని అన్ని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు సూచించారు. మంత్రుల కమిటీ సమావేశాల జోరును పెంచి, విభజన ప్రక్రియను వేగవంతం చేస్తోందని, అందువల్ల సమెక్యం కోసం పోరాడే మనం ఆందోళనలను మరింత ఉధృతం చేయాలన్నారు. పండగైనా ఉద్యమాలు చేయడానికి ఎవరూ వెనుకంజ వేయకూడదని సూచించారు. విభజన ప్రక్రియను అడ్డుకొని తీరుతాం రాష్ట్ర విభజన ప్రక్రియను అన్ని విధాల అడ్డుకుంటామని, అందుకు శాయశక్తులా కృషి చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటులో శీతాకాల సమావేశాల్లో బిల్లును పెట్టి రాష్ట్రాన్ని విడగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని తెలి పారు. మంత్రుల కమిటీలతో ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పావులను కదుపుతోందని, దానికి అడ్డుకట్టవేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 48 గంటల పాటు రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చిందని తెలిపారు. ఆర్టీసీ డిపోల నుంచి బస్సులను తీసి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఉంటుంది కాబట్టి విద్యాసంస్థలు సహకరించాలన్నారు. -
నేటి ఉదయం నుంచి రహదారుల బంద్
శ్రీకాకుళం, శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న నినాదంతో నిరంతర పోరాటం సాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా మరో కార్యాచరణకు ఉద్యుక్తమైంది. పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్దేశించిన నెల రోజుల పోరాట కార్యక్రమంలో భాగంగా జిల్లా 48 గం టలపాటు రహదారుల దిగ్బంధానికి సిద్ధమైంది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు రహదారులను బంద్ చేసేందుకు పార్టీ శ్రేణులు కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. సమైక్యవాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ నేతలు పిలుపునివ్వడంతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, ఎన్జీవో, విద్యార్థి సంఘాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు వర్గాల నుంచి ఈ కార్యక్రమాలనికి స్పం దన కనిపిస్తోంది. దిగ్బంధన కార్యక్రమంపై మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు సమావేశమై చర్చించి, కార్యాచరణను సిద్ధం చేశారు. ముఖ్యంగా జాతీయ రహదారి సాగుతున్న ఇచ్ఛాపురం, పలాస, నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, టెక్కలి నియోజకవర్గాల పరిధిలో ఆయా ప్రాంతాల నాయకులు బాధ్యత తీసుకుని రాకపోకలను స్తంభింపజేస్తారు. పాలకొండ, రాజాం, పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గాల నాయకులు తమ పరిధిలోని ప్రధాన రహదారులను దిగ్బంధిస్తారు. ఇందులో భాగంగా పలు చోట్ల రహదారులపై వంటావార్పు కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. సమైక్యవాదులందరూ పాల్గొనాలి : కృష్ణదాస్ రహదారుల దిగ్బంధన కార్యక్రమంలో పార్టీ శ్రేణులతోపాటు సమైక్యవాదులందరూ పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీల పరంగా సమైక్యాంధ్ర కోసం ఒక్క వైఎస్ఆర్ సీపీయే పోరాటం చేస్తోందన్నారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్దేశంచిన నెల రోజుల పోరాట కార్యక్రమంలో భాగంగా బుధ, గురువారాల్లో ప్రధాన రహదారులను దిగ్భంధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు ఇతర అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. వారిని భాగస్వాములను చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. పార్టీ సమన్వయకర్తలతో ఈ కార్యక్రమంపై చర్చించారు. సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు వరుదు కల్యాణి, వై.వి.సూర్యనారాయణ, పీఎంజే బాబు, విశ్వసరాయి కళావతి, గొర్లె కిరణ్‌కుమార్, కిల్లి రామ్మోహనరావు, బొడ్డేపల్లి మాధురి, దువ్వాడ శ్రీనివాస్, వజ్జ బాబూరావు, కలమట వెంకటరమణలతోపాటు పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బొడ్డేపల్లి పద్మజ, ప్రచార కమిటీ రాష్ట్ర సభ్యుడు మార్పు ధర్మారావు, పార్టీ జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జి.టి.నాయుడు, పార్టీ జిల్లా ఆడహక్ కమిటీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, శ్రీకాకుళం పట్టణ అధ్యక్షుడు ధర్మాన ఉదయ్‌భాస్కర్, పార్టీ నాయకులు ప్రధాన రాజేంద్ర, కరిమి రాజేశ్వరరావు, తంగి శివప్రసాద్, మహమ్మద్ సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.