highways blockade
-
ప్రత్యేక హోదా కోసం రహదారుల దిగ్బంధం
శింగనమల(అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా శింగనమల నియోజికవర్గం వ్యాప్తంగా శనివారం వైఎస్ఆర్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి ఆద్వర్యంలో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నాయకులు పెద్ద ఎత్తున రహదారుల దిగ్బంధం చేశారు. పుట్లూరు, యల్లనూరు, నార్పల, బుక్కరాయసముద్రం, శింగనమల, గార్లదిన్నె మండలాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. వైఎస్ఆర్ సీపీ చేపడుతున్న బంద్‌కు వ్యాపారుల నుంచి మద్దతు రావడంతో దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. శింగనమల చెరువుకట్ట వద్ద అనంతపురం-తాడిపత్రి ప్రదానరహదారిపై వందలాది మంది ఆలూరు సాంబశివారెడ్డి ఆద్వర్యంలో రోడ్డుపై బైఠాయిండం జరిగింది. ఈ బంద్‌కు వామపక్షాలు మద్దతు అందించాయి. -
విభజన జ్వాల
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : తెలంగాణ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ రెండోరోజు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జిల్లా బంద్ సంపూర్ణంగా జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. పలుచోట్ల జాతీయ రహదారులను వైఎస్సార్సీపీ కార్యకర్తలు దిగ్బంధించడంతో వాహనాలు బారులు తీరాయి. గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, హోటళ్లు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాం కులను వైఎస్సార్సీపీ కార్యకర్తలు దగ్గరుండి మూయించారు. ముం దు జాగ్రత్త చర్యగా ఆర్టీసీ సర్వీసులను డిపోల నుంచి కదలనీయలేదు. బంద్ సందర్భంగా నెల్లూరు నగరంతో పాటు ముఖ్య పట్టణాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆత్మకూరులో మేకపాటి గౌతంరెడ్డి సహా మేరిగ మురళీధర్, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ కూడలిలో గంటకు పైగా రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. నెల్లూరురూరల్ నియోజకవర్గంలోని రామలింగాపురం, హరనాథపురం, వీఆర్సి సెంటర్, మద్రాసు బస్టాండ్, ఆర్టీసీ, కేవీఆర్ పెట్రోలు బంక్, దర్గామిట్ట, వేదాయపాళెం, బీవీనగర్ తదితర ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి మాజీ కార్పొరేటర్ తాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మోటారు సైకిళ్ల ర్యాలీ జరిగింది. ఆత్మకూరు మండలం నెల్లూరు పాళెం వద్ద నెల్లూరు- ముంబయి రహదారిపై సమన్వయకర్త మేకపాటి గౌతంరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణుల ఆందోళనను పోలీసులు భగ్నం చేశారు. మేకపాటి గౌతంరెడ్డి, జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. మద్దూరుపాడు జాతీయ రహదారిని వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో దిగ్బంధించారు. సుమారు గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమైక్యాంధ్ర కోసం పట్టణంలోని విద్యాసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ బాలచెన్నయ్య, పాశం సునీల్‌కుమార్‌లు గూడూరులో బంద్‌ను పర్యవేక్షించారు. పోటుపాళెం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా వైఎస్సార్సీపీ పిలుపు మేరకు సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలులో రెండో రోజు శనివారం రాస్తారొకో నిర్వహించారు. మండల కన్వీనర్ పచ్చిపాల జయరామిరెడ్డి ఆధ్వర్యంలో దుకాణాలు మూయించారు.వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన బంద్‌ను సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు పర్యవేక్షించారు. అనంతరం బాలాయపల్లి మండలంలో గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమానికి హాజరయ్యారు. తడలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నెలవల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నాయుడుపేటలో సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సూళ్లూరుపేటలో బంద్ పాటించారు. -
‘సమైక్యం’ కోసం దిగ్బంధం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ ప్రస్థానం కొనసాగిస్తోంది. అందులో భాగంగా బుధ, గురువారాల్లో రహదారుల దిగ్బంధనానికి సమాయత్తమైంది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు రహదారులను దిగ్బంధించనున్నాయి. ఇందుకోసం జిల్లా పార్టీ నేతలు కూడా సర్వసన్నద్ధమయ్యారు. ఈ మేరకు వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ జిల్లాలోని నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదే విధంగా నియోజకవర్గ సమన్వయకర్తలు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో చర్చించారు. జిల్లాలో ఇంతవరకు కనీవినీ ఎరుగని రీతిలో రెండు రోజులపాటు ప్రధాన రహదారుల దిగ్బంధనానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. మండల, పట్టణ కన్వీనర్లకు ఆ కార్యాచరణను వివరించారు. పార్టీ శ్రేణులతోపాటు సమైక్యవాదుల సహకారంతో ఈ ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉద్యుక్తమవుతున్నారు. పకడ్బందీ వ్యూహం... రెండు రోజులపాటు ప్రధాన రహదారుల దిగ్బంధనానికి వైఎస్సార్సీపీ పక్కా ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో రెండు ప్రధాన రహదారులపై దృష్టి కేంద్రీకరించింది. కోల్కత్తా-చెన్నై జాతీయ రహదారి, త్రోవగుంట- దిగమర్రు రాష్ట్ర రహదారులను అష్టదిగ్బంధనం చేయాలని నిర్ణయించింది. జాతీయ రహదారిపై మేదరమెట్ల, మార్టూరు, మద్దిపాడు, ఒంగోలు, సింగరాయకొండ, ఉలవపాడు, తెట్టు... ఇలా ప్రతి చోటా రాకపోకలను అడ్డుకోనున్నారు. త్రోవగుంట- దిగమర్రు రాష్ట్ర రహదారిపై కూడా పలు చోట్ల వాహనాల రాకపోకలను అడ్డుకోవడానికి వైఎస్సార్సీపీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. ఈ బాధ్యతను చీరాల నియోజకవర్గ నేతలు వహిస్తారు. అదే విధంగా పశ్చిమ మండలాల్లోని దర్శి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో కూడా పలుచోట్ల రహదారులను దిగ్బంధించనున్నారు. బృందాలవారీగా... రెండు రోజులపాటు రహదారుల దిగ్బంధనానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహంతో రంగంలోకి దిగనుంది. ఇందుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలతో బృందాలను ఏర్పాటు చేసింది. ఒక బృందాన్ని అడ్డుకున్నా... మరో బృందం వెంటనే రంగంలోకి దిగాలన్నది వ్యూహం. అందుకోసం ప్రత్యేకమైన పాయింట్లను కూడా గుర్తించారు. ఈ పాయింట్లకు ఇన్చార్జిలను నియమించారు. ప్రతి ఇన్చార్జికి కొంతమంది నేతలు, కార్యకర్తల బృందాన్ని కేటాయించారు. ఒక బృందం తరువాత ఒక బృందం రహదారులను దిగ్బంధిస్తారు. రహదారుల దిగ్బంధన కార్యక్రమంలో మొదటి రోజుకు భిన్నంగా రెండోరోజు ఆందోళనను వైఎస్సార్సీపీ రూపొందించింది. పలు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలతో కొన్ని ప్రత్యేక పాయింట్లలో రహదారులను దిగ్బంధించనున్నారు. 6, 7 తేదీల్లో రహదారుల దిగ్బంధనంతో ప్రజల సమైక్యాంధ్ర స్ఫూర్తిని మరోసారి రగిలించాలన్నది తమ లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.