
ప్రత్యేక హోదా కోసం రహదారుల దిగ్బంధం
శింగనమల(అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా శింగనమల నియోజికవర్గం వ్యాప్తంగా శనివారం వైఎస్‌ఆర్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి ఆద్వర్యంలో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ సీపీ నాయకులు పెద్ద ఎత్తున రహదారుల దిగ్బంధం చేశారు. పుట్లూరు, యల్లనూరు, నార్పల, బుక్కరాయసముద్రం, శింగనమల, గార్లదిన్నె మండలాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు.
వైఎస్‌ఆర్ సీపీ చేపడుతున్న బంద్‌కు వ్యాపారుల నుంచి మద్దతు రావడంతో దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. శింగనమల చెరువుకట్ట వద్ద అనంతపురం-తాడిపత్రి ప్రదానరహదారిపై వందలాది మంది ఆలూరు సాంబశివారెడ్డి ఆద్వర్యంలో రోడ్డుపై బైఠాయిండం జరిగింది. ఈ బంద్‌కు వామపక్షాలు మద్దతు అందించాయి.