hill stone
-
విరిగి పడిన కొండ చరియలు
-
విరిగి పడిన కొండ చరియలు
శ్రీశైలం ప్రాజెక్టు: మంగళవారం వేకువజామున కురిసిన వర్షానికి డ్యాం పైభాగంలో ఉన్న కొండ చరియలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. డ్యాం దాటిన తరువాత ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. వేకువజామున హైదరాబాద్ వైపునకు వెళ్లే వాహనదారులు అడ్డుగా పడిన రాళ్లను పక్కకు తోసివేశారు. వాహనాలు రాకపోకలు కొనసాగించే సమయంలో కొండచరియలు విరిగిపడితే ప్రాణనష్టం సంభవించేది.