Hina Rabbani Khar
-
బ్లాక్ లిస్ట్ నుంచి పాక్ బయటపడనుందా?
FATF kept Pakistan on the grey list: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) పాకిస్తాన్‌ని గ్రే లిస్ట్(బ్లాక్ లిస్ట్)లో ఉంచిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు తాజాగా పాక్ త్వరలోనే ఆ గ్రే లిస్ట్ నుంచి బయటపడునుందని పాక్ విదేశాంగ వ్యవహారాల మంత్రి హీనా రబ్బానీ ఖార్ చెబుతున్నారు. అంతేకాదు ఆ బ్లాక్‌లిస్ట్ నుంచి బయటపడేందకు పాక్ కేవలం ఒక అడుగు దూరంలోనే ఉన్నట్లు తెలిపారు. 2018 నుంచి ఎఫ్ఏటీఎఫ్ పాక్‌ని బ్లాక్‌లిస్ట్‌లో ఉంచింది. అప్పటి నుంచి ఇస్లామాబాద్ బయటపడేందకు పలు రకాలుగా కృషి చేసింది. ఈ మేరకు ఎఫ్ఏటీఎఫ్ తీవ్రవాదం, మనీలాండరింగ్‌కు సంబంధించిన ఫైనాన్సింగ్ విషయాల్లో సాధించిన పురోగతిని ధృవీకరించింది. అంతేకాదు గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్‌ను రక్షించడానికి జీ7 దేశాలు ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ క్రైమ్ వాచ్డాగ్ పాక్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మొత్తం 34 అంశాలను కవర్ చేస్తూ.. రెండు కార్యాచరణ ప్రణాళికలను గణనీయంగా పూర్తి చేసింది. దీపిలె భాగంగా అక్టోబర్‌లో జరిగే తదుపరి ఎఫ్ఏటీఎఫ్ సమావేశాని కంటే ముందే ఇస్లామాబాద్‌లో పర్యటించనున్నట్లు ఎఫ్ఏటీఎప్ తెలిపింది. ఆ పర్యటనలో ఇస్లామాబాద్‌లో ఉగ్రవాదం, మనీలాండరింగ్ సంబంధించిన ఆర్థిక విషయాల్లో ఏర్పాటు చేసిన చట్టాలు, తీసుకుంటున్న చర్యలను గురించి ఎఫ్ఏటీఎప్ తనీఖీలు చేయనున్నట్లు పేర్కొంది ఈ క్రమంలో పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖార్ మాట్లాడుతూ...ఈ జాబితా నుంచి పాక్ కచ్చితంగా తప్పుకుంటుందని విశ్వసిస్తున్నాం. పాక్‌లో త్వరలో కొత్త సంస్కరణ జరుగుతాయి. ఇది ఒక రకంగా పాక్ ఆర్థిక వ్యవస్థ పై విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. గ్రే లిస్ట్ నుంచి నిష్క్రమించడం వల్ల విదేశీ పెట్టుబడులు, పెరుగడమే కాకుండా, ఐఎంఎప్ రుణాలను కూడా పొందగలుగుతుంది. మళ్లీ పాక్ ఇలాంటి గ్రే లిస్ట్‌లోకి వెళ్లకుండా తగు చర్యలు తీసుకుంటాం " అని అన్నారు. (చదవండి: నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు, గుడ్‌బై!) -
కశ్మీర్‌పై హినా రబ్బానీ ఖర్ వ్యాఖ్యలు
కశ్మీర్ వివాదంపై పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి హినా రబ్బానీ ఖర్ తాజాగా స్పందించారు. యుద్ధం ద్వారా కశ్మీర్ పాకిస్థాన్ సాధించుకోలేదని, భారత్-పాక్ మధ్య చర్చల ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. జీయో న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. ఇరుదేశాల మధ్య అత్యంత వివాదాస్పద అంశమైన కశ్మీర్ అంశంపై చర్చలు ఉమ్మడి విశ్వాసం ఉన్నప్పుడు సాధ్యపడుతాయని పేర్కొన్నారు. ‘కశ్మీర్‌ను యుద్ధం ద్వారా పాకిస్థాన్ సాధించుకోలేదని నేను భావిస్తున్నా.. యుద్ధం చేయనప్పుడు చర్చలే మనకున్న ప్రత్యామ్నాయం. చర్చలు జరగాలంటే అందుకు ఇరుదేశాల మధ్య సాధారణ సంబంధాలు, పరస్పర విశ్వాసం ఉండాల్సిన అవసరముంది’ అని ఆమె పేర్కొన్నారు. అప్పుడు మాత్రమే పరిష్కారం! భారత్‌లో బీజేపీ ప్రభుత్వం, పాకిస్థాన్‌లో సైనిక ప్రభుత్వం ఉన్నప్పుడే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కొందరు విశ్వసిస్తున్నట్టు ఆమె చెప్పారు. సైన్యం భాగస్వామిగా ఉన్న దౌత్య అంశాలపై పాకిస్థాన్ సైనిక ప్రభావం తప్పకుండా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. -
షాహిద్ ఆఫ్రిది, హీనాతో ఆ ఉగ్రవాది సోదరుడు..
న్యూఢిల్లీ: పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ భారత్‌లో చేపట్టిన భారీ రాకెట్‌కు సంబంధించి మరిన్ని వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ రాకెట్లో భాగంగా ఢిల్లీలో రెక్కీ నిర్వహించేందుకు వచ్చి అరెస్టయిన ఉగ్రవాది మహమ్మద్ ఎజాజ్ సోదరుడి ఫొటోలు తాజాగా వెలుగుచూశాయి. పాకిస్థాన్ జాతీయుడైన ఎజాజ్ సోదరుడు ఫవాద్ ఆ దేశానికి చెందిన ప్రముఖులతో దిగిన ఫొటోలు పోలీసులకు చిక్కాయి. ఫవాద్ పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది, ఆ దేశ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌తో సన్నిహితంగా మెలుగుతూ దిగిన ఫొటోలు వెలుగుచూశాయి. ఈ ఫొటోలు నిజమైనవా? కాదా? అన్నది ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు. ఉగ్రవాది మహమ్మద్ ఎజాజ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ధ్రువపత్రాలతో బంగ్లాదేశ్ మీదుగా భారత్‌కు వచ్చిన ఎజాజ్ ఈ ఏడాది మార్చ్, జూలై నెలల్లో రెండుసార్లు ఢిల్లీని సందర్శించాడు. ఈ సందర్భంగా పార్లమెంటు, రాజ్‌పథ్ ఎదురుగ్గా దిగిన ఫొటోలు పాకిస్థాన్‌కు మెయిల్ చేశాడు. ఢిల్లీలో రెక్కీ నిర్వహించేందుకు తనను ఐఎస్ఐ ఇక్కడికి పంపిందని అతడు పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు.