Hindu Population
-
చొరబాటుదార్లను తరిమికొట్టాలి
రాంచీ: అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ వివాదాస్పద మరోసారి వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ నుంచి చొరబాటుదారులను తరిమికొట్టాలని అన్నారు. లేకపోతే రాష్ట్రంలో హిందువుల జనాభా మరో 20 ఏళ్లలో సగానికి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జార్ఖండ్లో జేఎంఎం కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి హిందువులంతా ఐక్యంగా ఉండాలని కోరారు. శనివారం పాలాములో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో హిమంతబిశ్వ శర్మ ప్రసంగించారు. ఆయన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సహ–ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. చొరబాటుదార్లను బయటకు వెళ్లగొట్టడానికి, హిందువులను కాపాడడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. జార్ఖండ్లో పలు ప్రాంతాల్లో హిందువుల జనాభా ఇప్పటికే భారీగా తగ్గిపోయిందని గుర్తుచేశారు. భారతదేశాన్ని హిందువులు కాపాడుతున్నారని, జైశ్రీరామ్ అని నినదించడానికి అందరూ ఐక్యమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఓ వర్గం ప్రజలు ఎల్లప్పుడూ జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీకే ఓటు వేస్తున్నారని, హిందువుల ఓట్లు మాత్రం పారీ్టల వారీగా చీలిపోతున్నాయని తెలిపారు. అలా కాకుండా హిందువులంతా ఒక్కటై జేఎంఎం కూటమిని ఓడించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాం«దీపై హిమంతబిశ్వ శర్మ మండిపడ్డారు. రాహుల్ విభజన రాజకీయాలు చేస్తున్నారని, హిందువుల మధ్య చిచ్చుపెట్టి విడదీస్తున్నారని ఆరోపించారు. జార్ఖండ్లో అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. అస్సాంలో జార్ఖండ్ గిరిజనులకు గుర్తింపేదీ?: హేమంత్ సోరెన్ అస్సాంలో జార్ఖండ్ గిరిజనుల గుర్తింపును హిమంతబిశ్వ శర్మ ప్రభుత్వం చెరిపేస్తోందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. జార్ఖండ్ నుంచి వెళ్లిన గిరిజనులకు అస్సాంలో ఎస్టీ హోదా కలి్పంచడం లేదని విమర్శించారు. శనివారం కుంతీ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో సోరెన్ మాట్లాడారు. జార్ఖండ్ మూలాలున్న ప్రజలు అస్సాం టీ తోటల్లో పని చేస్తున్నారని, వారి బతుకులు దుర్బరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అస్సాం ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. బీజేపీపై సోరెన్ నిప్పులు చెరిగారు. ఆ పార్టీ కుల మతాల పేరిట సమాజాన్ని విచి్ఛన్నం చేస్తోందని దుయ్యబట్టారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధిస్తామని, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హేమంత్ సోరెన్ ధీమా వ్యక్తంచేశారు. -
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
న్యూఢిల్లీ: భారత్లోని హిందువుల జనాభా తగ్గుతోందని, మైనారిటీల జనాభా క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యయనంలో తేలింది. 1950 నుంచి 2015 మధ్య దేశంలోని మొత్తం జనాభాలో హిందువుల జనాభా 7.8 శాతం తగ్గినట్లు వెల్లడయ్యింది. 1950లో దేశ జనాభాలో హిందువులు 84 శాతం మంది ఉండగా, 2015 నాటికి దాదాపు 78 శాతానికి పడిపోయినట్లు అధ్యయనం వెల్లడించింది. ఇదే సమయంలో మొత్తం జనాభాలో ముస్లింల జనాభా 9.84 శాతం నుంచి 14.09 శాతానికి చేరింది. -
పాకిస్తాన్లో హిందూ జనాభా ఎంతో తెలుసా?
పెషావర్: పాకిస్తాన్లో 22,10,566 మంది హిందువులు నివసిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. దేశంలో నమోదైన మొత్తం 18,68,90,601 మంది జనాభాలో మైనారిటీ హిందువుల వాటా 1.18% మాత్రమేనని సెంటర్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పాకిస్తాన్ వెల్లడించిన నివేదిక పేర్కొంది. దేశ జనాభాలో మైనారిటీల వాటా 5% కాగా, వీరిలో హిందువులే అత్యధికులని ఈ నివేదిక ఉటంకించింది. దేశంలో 1,400 మంది నాస్తికులు సహా 17 వేర్వేరు మతాలు, ఆచారాలను గుర్తించినట్లు మార్చిలో వెల్లడించిన ఎన్ఏడీఆర్ఏ డేటా పేర్కొంది. హిందూ జనాభాలో 95% మంది సింధ్ ప్రావిన్స్లోనే నివసిస్తున్నారంది. పేదరికంలో మగ్గుతున్న మైనారిటీల ప్రాతినిధ్యం పాక్ చట్టసభల్లో దాదాపుగా లేనట్లేనని వెల్లడించింది. మైనారిటీలపై వేధింపులు సర్వసాధారణమని ఈ నివేదిక తెలిపింది. చదవండి: అణు నిఘాను ఇరాన్ అడ్డుకుంటోంది -
కుల సమాజమే కానీ...
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ... దేశంలో మత అసహనం, హిందువుల్లో ఉన్మాదం పెరుగుతోందని; ప్రజాస్వామ్య సంస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయనీ బీజేపీ వ్యతిరేక పార్టీలు చేస్తున్న ఆరోపణలలో నిజం ఎంత అనే విషయాన్ని వాస్తవిక దృష్టికోణంలో పరిశీలించాలి. హిందుత్వ సంస్థలు హిందువులను రెచ్చగొడుతున్నాయనీ, మైనారిటీలపై ముఖ్యంగా... ముస్లింలపై విద్వేషాన్ని, పగను ప్రోది చేస్తున్నాయని ఆ పార్టీల ఆరోపణ! వాస్తవంగా ఈ దేశంలో హిందువులు ఒక మత సమూహం కాదు. ఇది కులపరంగా విభజితమైన సమాజం. ఈ సమాజంలో అనాదిగా అసంఘటిత ఛాయలే దర్శనమిస్తున్నాయి. ఈ సమాజం నుండి రాజకీయంగా ఎదిగిన నాయకులందరూ కులపరమైన ఆలోచనా దృక్పథంతోనే ఉంటారు. అంతేకానీ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి ఇత్యాది విషయాలను అర్థం చేసుకునే స్థాయి వీరికి ఉండదు. అదే ఉంటే దేశ విభజన జరిగేది కాదు. కశ్మీర్ రావణ కాష్ఠం అయ్యేది కాదు. కాశ్మీరు లోయ నుండి 3 లక్షల మంది హిందువులను తరిమివేయడం జరిగేది కాదు. హిందువులందరూ ఒకే సమూహం అనే భావం ఉన్నట్లయితే ఈ ఘటనలన్నింటికీ ప్రతిచర్యలు వేరే విధంగా ఉండేవి. ఈ దేశంలో మైనారిటీల పట్ల లౌకికవాద పార్టీ నాయకులు అందరూ మూకుమ్మడిగా ఒకే మాట మీద ఉండటంతో... కులాల వారీగా విభజితమైన హిందువుల్లో అసంతృప్తి, ఆవేదన పుట్టుకొచ్చి కొంత చైతన్యం అంకురించింది. దాన్ని హిందుత్వ రాజకీయ పార్టీ అయిన బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుని కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాలలోనూ అధికారంలోకి వచ్చింది అనేది వాస్తవం. (క్లిక్: ఇలా ఎన్ని పేర్లు మారుద్దాం?) లౌకిక వాదులుగా చెప్పుకునేవారు ప్రధాని మోదీపై వ్యతిరేకత, ద్వేషాలను.. దేశంపై వ్యతిరేకతగా మార్చుకోవడం.. వారి విచిత్రమైన భావదాస్యపు ఆలోచనకు ప్రతీక! ప్రపంచంలో ఏ దేశంలోనూ మన దేశంలోని మైనార్టీలు అనుభవించే స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కనిపించవు. పాక్ వంటి చోట్ల దేశ విభజన తర్వాత హిందూ జనాభా తగ్గిపోతుంటే.. మనదేశంలో మాత్రం ముస్లిం జనాభా పెరిగిపోవడం మైనారిటీలకు ఇక్కడ ఉన్న స్వేచ్ఛకు సంకేతంగా చెప్పవచ్చు. (క్లిక్: ఆ హత్యను ఖండిస్తున్నాం) – ఉల్లి బాల రంగయ్య రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
వారిలో హిందువులే ఎక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని హిందువుల్లో అధిక శాతం మంది వ్యవసాయాన్ని నమ్ముకోగా, ఎక్కువ శాతం ముస్లిం జనాభా వ్యవసాయేతర వృత్తుల వైపు మొగ్గు చూపుతున్నారని 2011 జనాభా లెక్కల రిపోర్టు వెల్లడించింది. మతాల ప్రాతికపదికన హిందూ, ముస్లిం జనాభా ఉద్యోగ, వ్యవసాయ వివరాలను శుక్రవారం ప్రకటించింది. మొత్తం హిందువుల్లో 45.40 శాతం మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తుండగా.. ఈ మొత్తంలో 28 శాతం మంది భూమిని సాగు చేయడం ద్వారా ఉపాధి పొందుతున్నారని తెలిపింది. 60 శాతం ముస్లిం జనాభా పారిశ్రామిక రంగంలో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది. అయితే, అక్షరాస్యతలో వారు హిందువుల కన్నా వెనకబడి ఉండడంతో ఉన్నతోద్యోగాలు పొందలేక పోతున్నారని తెలిపింది. పారిశ్రామిక రంగంలో దిగువ స్థాయి ఉద్యోగాలైన చేనేత, కుండల తయారీ, వడ్రంగి పని, హస్తకళలు వంటి కళాత్మక పనుల్లో ముస్లింలు ఎక్కువగా పని చేస్తున్నారని రిపోర్టు వెల్లడించింది. దేశంలో చాలా మంది ముస్లింలు భూములు లేని కారణంగానే పారిశ్రామిక రంగంలో ఉపాధి కోరుకుంటున్నారని విశ్లేషించింది. కాగా, దక్షిణ భారతంలో కంటే ఉత్తరం భారతంలో ముస్లిం జనాభా పెరిగిందని రిపోర్టు పేర్కొంది. సచార్ కమిటీ ప్రకారం.. 2005లో ఏర్పాటైన రాజేంద్ర సచార్ కమిటీ దేశంలో భూమి కల్గివున్న జనాభాలో హిందూ, ముస్లింలకు గణనీయమైన తేడా ఉందని నివేదించింది. గ్రామీణుల్లో 94 శాతం కుటుంబాలు సొంత భూమిని కలిగి ఉన్నాయని స్పష్టం చేసింది. వారిలో కూడా అగ్రవర్ణ హిందూ జనాభా చేతిలోనే అధిక భూమి ఉందని తెలిపింది. దాదాపు 87 శాతం జనాభా కనీసం ఒక ఎకరా భూమిని కలిగి ఉన్నారని తెలిపింది. కాగా, అన్ని మతస్తుల కంటే తక్కువగా (83 శాతం) ముస్లింలు భూమిని కలిగి ఉన్నారని వెల్లడించింది. అయితే, పట్టణ, నగర ప్రాంతాల్లో సొంత ఇళ్లు కలిగి ఉన్న వారిలో ముస్లింలే అధికంగా ఉన్నారని వెల్లడించింది. కాగా, 2001 నుంచి 2011 వరకు జనాభాలో 0.8 శాతం పెరుగుదల నమోదు కావడంతో ముస్లిం జనాభా 13.8 కోట్ల నుంచి 17.22 కోట్లకు ఎగబాకింది. అదే సమయంలో హిందూ జనాభా 0.7 శాతం తగ్గుదల నమోదు చేసింది. 2001లో 82.75 కోట్లుగా ఉన్న హిందూ జనాభా 96.63 కోట్లకు చేరింది. -
హిందువులపై దాడులకు రెండు రాష్ట్రాలు ఊతం
కోయంబత్తూర్: పశ్చిమ బెంగాల్లో తగ్గిపోతున్న హిందూ జనాభా, జీహాదిస్టులు పెరిగిపోవడంపై దృష్టి సారించనున్నట్లు ఆరెస్సెస్ ప్రకటించింది. మత రాజకీయాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొంది. ముస్లిం ఓట్ల కోసం మమత బెనర్జీ ప్రభుత్వం దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతోందని చెప్పింది. ఆరెస్సెస్లో విధివిధానాలను రూపొందించే అత్యున్నత విభాగం అయిన అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు. 1951లో ఈ రాష్ట్రంలో 78.45% ఉన్న హిందూ జనాభా 2011కు వచ్చే సరికి 70.54 శాతానికి పడిపోయిందని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే అన్నారు. ఇది దేశ సమగ్రతకు, ఏకత్వానికి సంబంధించిందన్నారు. బెంగాల్, కేరళ ప్రభుత్వాలు హిందువులపై దాడులను ప్రోత్సహిస్తున్నాయని ఆరెస్సెస్ ఆరోపించింది. -
'దేశంలో హిందువుల జనాభా తగ్గుతోంది'
న్యూఢిల్లీ: దేశంలో హిందువుల జనాభా తగ్గుతోందని, ఎందుకంటే హిందువులు మతమార్పిడి అయినవారు కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్ను బీజేపీ హిందూ రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి బీజేపీయే కారణమని, రాష్ట్రాభివృద్దికి కిరెన్ రిజిజు చేసిందేమీ లేదని కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. ఇరుగుపొరుగు దేశాలతో పోలిస్తే దేశంలోని మైనార్టీలు సురక్షితంగా ఉన్నారని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. పొరుగు దేశాల్లో అభద్రతగా భావిస్తున్న మైనార్టీలు శరణార్థులుగా భారత్కు వస్తున్నారని, భారత్ చాలా సహనశీలి దేశమని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. భారత్ లౌకిక దేశమని పేర్కొన్నారు. దేశంలో అన్ని మతాల ప్రజలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. -
అమెరికాలో పెరుగుతున్న హిందూ జనాభా
న్యూయార్క్: భారతదేశం నుంచి వలసలు పెరిగిపోవడం వల్ల అమెరికాలో హిందువుల జానాభా 22 లక్షల 30 వేలకు పెరిగింది. 2007 నుంచి 2014 నాటికి 85.8 శాతం మంది అంటే పది లక్షలకు పెరిగారు. హిందూమతాన్ని విశ్వసించేవారు ఈ దేశంలో నాలుగవ స్థానంలో ఉన్నారు. ప్యూ రిసెర్చ సెంటర్ వివిధ మతస్థులపై జరిపిన విస్తృత అధ్యయనం ప్రకారం అమెరికా జనాభాలో హిందువులు 2007లో 0.4 శాతం ఉండగా, 2014 నాటికి 0.7 శాతానికి పెరిగారు. అంటే ఏడు సంవత్సరాల కాలంలో పది లక్షలకు పైగా పెరిగారు. 2050 నాటికి అమెరికా జనాభాలో హిందువులు 1.2 శాతానికి అంటే 47 లక్షల 80వేలకు పెరుగుతారని ప్యూ అంచనా. అమెరికాలో క్రైస్తవుల తరువాత రెండవ స్థానంలో యూదులు, మూడవ స్థానంలో ముస్లింలు, నాలువ స్థానంలో హిందువులు ఉన్నారు.