పాకిస్తాన్‌లో హిందూ జనాభా ఎంతో తెలుసా? | National Database Reports Says Over 22 Lakh Hindus In Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌లో హిందూ జనాభా ఎంతో తెలుసా?

Published Fri, Jun 10 2022 10:18 AM | Last Updated on Fri, Jun 10 2022 10:40 AM

National Database Reports Says Over 22 Lakh Hindus In Pakistan - Sakshi

పెషావర్‌: పాకిస్తాన్‌లో 22,10,566 మంది హిందువులు నివసిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. దేశంలో నమోదైన మొత్తం 18,68,90,601 మంది జనాభాలో మైనారిటీ హిందువుల వాటా 1.18% మాత్రమేనని సెంటర్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ పాకిస్తాన్‌ వెల్లడించిన నివేదిక పేర్కొంది. దేశ జనాభాలో మైనారిటీల వాటా 5% కాగా, వీరిలో హిందువులే అత్యధికులని ఈ నివేదిక ఉటంకించింది.

దేశంలో 1,400 మంది నాస్తికులు సహా 17 వేర్వేరు మతాలు, ఆచారాలను గుర్తించినట్లు మార్చిలో వెల్లడించిన ఎన్‌ఏడీఆర్‌ఏ డేటా పేర్కొంది.  హిందూ జనాభాలో 95% మంది సింధ్‌ ప్రావిన్స్‌లోనే నివసిస్తున్నారంది. పేదరికంలో మగ్గుతున్న మైనారిటీల ప్రాతినిధ్యం పాక్‌ చట్టసభల్లో దాదాపుగా లేనట్లేనని వెల్లడించింది. మైనారిటీలపై వేధింపులు సర్వసాధారణమని ఈ నివేదిక తెలిపింది.   
చదవండి: అణు నిఘాను ఇరాన్‌ అడ్డుకుంటోంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement