ముస్లింల గురించి మాట్లాడటం మానితే మేలు కదా!
హిందుత్వకు హిందువులపై కంటే ముస్లింలపైనే ఆసక్తి ఎక్కువ. ప్రతికూలాత్మక అంశాలతోనే అది రూపొందింది. ముస్లింల పట్ల ప్రతికూలాత్మకతవల్ల హిందువులకు ఒరిగేదేమీ లేదు. అది అర్థశాస్త్రానికి చేసిన దోహదమేమీ లేదు. తమ భావజాల కర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సోషలిస్టు అని తెలిస్తే చాలా మంది హిందుత్వవాదులు ఆశ్చర్యపోతారు. మన్మోహన్సింగ్ ఉదారవాద విధానాల తదుపరి బీజేపీ ఉపాధ్యాయ ఆర్థిక భావనలను పూర్తిగా విడిచిపెట్టేసింది. ఇక విజ్ఞాన శాస్త్రానికి హిందుత్వ చేసిన దోహదం శూన్యం. హిందుత్వవాదులకు తమ భావజాలాన్ని సవాలు చేసే విద్యావేత్తలను చూస్తే కంపరమెత్తుతుంది. వారిని హత్య గావిస్తుంటారు. ‘సంస్కృతి’కి మించి అందులో సారాంశంగా చెప్పుకోదగినదేమీ లేదు. అందులోనూ దానిది మితవాద కథనం మాత్రమే.
మధ్యతరగతి హిందువులలో చాలా మందిలాగే, ప్రత్యే కించి గుజరాతీ హిందువులలాగే నేనూ జాతీయవాదం, మతాలపట్ల కొన్ని ప్రత్యేక భావాలతో పెరిగాను. హిందుత్వ అనే భావన సారం అత్యంత మౌలికమై నది, నిరపేక్షమైనది. కాబట్టి ఎవరైనాగానీ చిన్నతనంలో దాని పట్ల సులువుగా ఆకర్షితులవుతారు. అది దేశం పట్ల, సంస్కృతి పట్ల పెల్లుబికే ప్రేమ పునాదులపై నిలిచినట్టనిపి స్తుంది. ఆ రెండూ ఒక్కటిగా కలగలిసినదే హిందూ మతం. కాబట్టి హిందూ అనే పదం మతానికే కాదు జాతీయతకు, సంస్కృతికి కూడా సంకేతం. ఇది అతి గొప్ప వ్యక్తులు చెప్పి నది కాబట్టి మనం దాన్ని సత్యంగా అంగీకరిస్తాం. మన భారతీయులకు చదవడం కంటే ఎక్కువగా పూజించడం అలవాటు కాబట్టి ఆ వ్యక్తుల పేర్లు పదే పదే వినిపించడం వల్ల సహజంగానే మీరు వారిని గొప్పవారుగా భావిస్తారు.
ఉద్వేగం ఎక్కువ... మేధోపర అంశాలు తక్కువ
వాస్తవానికి నేను ఇరవైల ప్రాయంలో ఉండగా సావర్కర్ రాసిన ‘హిందుత్వ’ పుస్తకాన్ని చదివాను. అది నన్ను నిరు త్సాహపరచింది. ఆయనను అంత గొప్పవాడిగా ఎందుకు భావిస్తారో అంతుబట్టలేదు. అది అత్యంత సర్వసాధారణ మైన పుస్తకం. అందులో కొత్తదనమేమీ లేదు. నిజానికి సావర్కర్ ఎక్కువగా చదివిన వాడేమీ కాదు. ఇతరుల రచ నల నుంచి ఉల్లేఖింపులు లేదా ప్రస్తావనలు అందులో తక్కువగానే ఉన్నాయి. దేశం పట్ల బేషరతు ప్రేమ అనేదే ఆయన ప్రధాన భావ న. అయితే ముందే నేను చెప్పినట్టుగా అది మన దేశంలో చాలా మందికి సులువుగా అబ్బేదే.
వివేకానందుని సమగ్ర రచనలను (ప్రధానంగా ఉప న్యాసాలు, ఉత్తరాలతో కూడిన 8 సంపుటాలు) చదివాక కూడా నాకా సందేహం తీరలేదు. గోల్వాల్కర్ రచనలను (ప్రధానంగా ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలే), ఆర్ఎస్ఎస్ ప్రధాన భావజాల కర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ రచనలను కూడా చదివిన తర్వాతగానీ హిందుత్వలో ఉన్నదంతా ఇం తేనని నాకు కనువిప్పు కలుగలేదు. అది, ఆలోచనాలోచనా లను మూసేసుకున్న వారికై ఉద్దేశించిన భావజాలం. అం దులో మేధోపరమైన దానికంటే ఉద్వేగపరమైనదే ఎక్కువ.
ప్రతికూలాత్మకతే హిందుత్వ పునాది
అప్పటికే హిందుత్వ సారాన్ని అయిష్టపడటం ప్రారంభిం చిన నాకు ఈ విషయాన్ని కనిపెట్టడం గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. ప్రతికూలాత్మక అంశాలతో ఎలా హిందుత్వ రూపుదిద్దుకుందో నేను గ్రహించడం మొదలుపెట్టాను. దాని ప్రధాన డిమాండ్లు మూడు:
ఒకటి: రామ జన్మభూమి (ముస్లింల మసీదు అక్కడ ఉండటానికి వీల్లేదు.)
రెండు: ఉమ్మడి పౌరస్మృతి (ముస్లింలకు వారి స్వంత కుటంబ చట్టం ఉండరాదు.)
మూడు: జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ను తొలగించాలి (ముస్లింలకు రాజ్యాంగబద్ధమైన స్వయం ప్రతిపత్తి ఉండటానికి వీల్లేదు).
ఈ మూడూ ముస్లింలకు ప్రతికూలమైననే తప్ప వాటి వల్ల హిందువులకు ఒరిగేదేమీ లేదు. హిందుత్వ భావ జాలం చేయగలిగిందల్లా ఆగ్రహాన్ని, ద్వేషాన్ని రగల్చడం మాత్రమే. ఇతరుల వైపు వేలెత్తి చూపుతూ, వారిని తప్పు పట్టేది మాత్రమే. మనది ఎప్పటికీ గొప్ప దేశమనే భావ నతో... ఇతరులు, మనం కాదు, తిరిగి భారతదేశాన్ని గొప్ప దేశంగా చేయడానికి కృషి చేసి తీరాలని అది ఊహిస్తుంది.
పిల్లల జగడాలమారి తనం
నా దృష్టిలో ఇది నేనే మాత్రం ఆమోదించలేని పిల్లకాయ తనం. భారతదేశానికి, భారతీయులకు హిందుత్వ భౌతికం గా అంత ఎక్కువ నష్టం కలిగించకపోయి ఉంటే నేను దాన్నీ, దాని వకాలతుదార్లను విస్మరించేవాడినే. హిందుత్వ చాలావరకు సంస్కృతికి చె ందినది కాబట్టే కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి మహేష్ శర్మ ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు. అది అర్థశాస్త్రానికి చేసిన దోహద మేమీ లేదు. తమ భావజాల కర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సోషలిస్టు అని తెలిస్తే చాలా మంది హిందుత్వవాదులు ఆశ్చర్యపోతారు.
మన్మోహన్సింగ్ ఉదారవాద విధానాల తదుపరి బీజేపీ ఉపాధ్యాయ ఆర్థిక భావనలను పూర్తిగా విడిచిపెట్టేసింది. ఇక విజ్ఞానశాస్త్రానికి హిందుత్వ చేసిన దోహదం శూన్యం. హిందుత్వవాదులకు తమ భావజా లాన్ని సవాలు చేసే విద్యావేత్తలను చూస్తే కంపరమెత్తు తుంది. వారిని హత్య గావిస్తుంటారు. ‘సంస్కృతి’కి మించి అందులో సారాంశంగా చెప్పుకోదగినదేమీ లేదు. అందు లోనూ దానిది మితవాద కథనం మాత్రమే.
ముస్లింలపైనే ఆసక్తి
కాబట్టే మహేశ్ శర్మ వంటి వారు పతాక శీర్షికలకు ఎక్కు తారు తప్ప, శాస్త్రవిజ్ఞాన శాఖ మంత్రి (ఎవరైతే వారు) పేరు ప్రముఖంగా వినపడదు. హిందుత్వకు అందులో ఆసక్తిలేదు. పేరును తప్పిస్తే దానికి ఉన్న ఆసక్తి అంతా ముస్లింలపైనే తప్ప హిందువులపైన కాదు. భగవద్గీతలాగా బైబిల్, ఖురాన్లు భారతీయ ఆత్మకు కేంద్రం కావు అని శర్మ మొదట అన్నారు. ఆ తదుపరి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గురించి ఇలా అన్నారు:
‘‘ఔరంగజేబు రోడ్డు పేరును మార్చి, ముస్లిమే అయి నా మహా మనీషి అయిన ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహ నీయుని పేరు పెడుతున్నాం.’’ ఒక హిందుత్వవాది ఇలాంటి వ్యర్థ ప్రేలాపనకు దిగ డం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. కాకపోతే ఆ మంత్రికి ఇంకా చిన్న పిల్లాడి మనస్తత్వం ఎందుకు వదలలేదా అనేది మాత్రం నాకు కొంత అర్థంకాని సమస్యగానే ఉంది. ఆయన చిన్నతనంలో మత దురభిమానానికి గురికావడం నేను అర్థం చేసుకోగలిగేదే. నేనూ కౌమార్యంలో దానికి ఆకర్షి తుడినైన వాడినే. కౌమార్యంలో పక్షపాతంతో, ఆలోచనకు తలుపులు మూసుకున్న వైఖరితో ఉండటం సులువే. అయి తే పెద్దవాళ్లు ప్రపంచాన్ని పెద్దలుగానే చూడాలి తప్ప బడి పిల్లల జగడాలకోరు దృష్టితో కాదు.
హిందుత్వ...ముస్లింల గురించి మాట్లాడటం మానేసి, హిందువుల వైపు చూస్తే హిందువులకు గొప్పమేలు చేసినట్ట వుతుంది. అలాంటి భావజాలాన్నయితే నేనూ అనుసరించే విషయాన్ని యోచిస్తాను.
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత, aakar.patel@icloud.com
- ఆకార్ పటేల్