'దేశంలో హిందువుల జనాభా తగ్గుతోంది' | Hindu Population Reducing In India, Tweets Minister Kiren Rijiju | Sakshi
Sakshi News home page

'దేశంలో హిందువుల జనాభా తగ్గుతోంది'

Published Mon, Feb 13 2017 3:32 PM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

'దేశంలో హిందువుల జనాభా తగ్గుతోంది'

'దేశంలో హిందువుల జనాభా తగ్గుతోంది'

న్యూఢిల్లీ: దేశంలో హిందువుల జనాభా తగ్గుతోందని, ఎందుకంటే హిందువులు మతమార్పిడి అయినవారు కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు పేర్కొన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ను బీజేపీ హిందూ రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి బీజేపీయే కారణమని, రాష్ట్రాభివృద్దికి కిరెన్ రిజిజు చేసిందేమీ లేదని కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. ఇరుగుపొరుగు దేశాలతో పోలిస్తే దేశంలోని మైనార్టీలు సురక్షితంగా ఉన్నారని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.

పొరుగు దేశాల్లో అభద్రతగా భావిస్తున్న మైనార్టీలు శరణార్థులుగా భారత్కు వస్తున్నారని, భారత్ చాలా సహనశీలి దేశమని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. భారత్‌ లౌకిక దేశమని పేర్కొన్నారు. దేశంలో అన్ని మతాల ప్రజలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement