Hindu terror
-
ముంబై దాడికి హిందూ రంగు
-
చిక్కుల్లో కమల్
సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మ గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సినీనటుడు మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. కమల్ తన వ్యాఖ్యలతో మత విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీశారని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో ఆయనపై క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశంలో తొలి హిందూ ఉగ్రవాది అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు రేపిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని అరవకురిచ్చిలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూ మతాన్ని ఉగ్రవాదంతో ముడిపెడుతూ కమల్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని ఆయనపై క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది. మరోవైపు కమల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ సోమవారం ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీకి నివేదించింది. కాగా, చెన్నైలోని కమల్ హాసన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. -
కమల్‌పై కేసు నమోదు
సాక్షి,న్యూఢిల్లీ: హిందూ తీవ్రవాదంపై వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు కమల్ హాసన్‌పై కేసు నమోదైంది. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 511, 298, 295(ఏ), 505(సీ) కింద అభియోగాలు నమోదు చేశారు. కమల్ ఇటీవల రాసిన ఓ వ్యాసంలో దేశంలో హిందూ తీవ్రవాదం పెచ్చరిల్లిందని, హిందూ తీవ్రవాదం లేదని ఎవరూ ప్రశ్నించలేరని, హిందువుల్లోనూ తీవ్రవాదం ప్రబలిందని కమల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే.త్వరలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్న కమల్‌పై నమోదైన అభియోగాలపై శనివారం విచారణ నిర్వహిస్తారు. కమల్ హాసన్‌పై నమోదైన ఆరోపణలకు, నమోదైన సెక్షన్లను పరిశీలిస్తే..సెక్షన్ 500 కింద కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు శిక్ష విధిస్తారు. 511 కింద నేరాలకు పూనుకోవడం, సెక్షన్ 298 కింద పరుష వ్యాఖ్యలతో ఏ వ్యక్తి మతపరమైన భావాలు దెబ్బతినేలా వ్యవహరించడం, సెక్షన్ 295(ఏ) కింద మత విశ్వాసాలాను, మతాన్ని కించపరచడం ద్వారా ఏ వర్గంవారి మత భావాలను దెబ్బతీయడం, సెక్షన్ 505(సీ) కింద ఒక వర్గం, మతాన్ని ఇతర మతం, వర్గంపై దాడులకు పురికొల్చేలా వ్యవహరించడం వంటి అభియోగాలను కమల్ హాసన్‌పై నమోదు చేశారు. -
‘హిందూ ఉగ్రవాదం’ నీరుగార్చింది
ఉగ్రవాదంతో పోరుపై యూపీఏ సర్కారును దుయ్యబట్టిన రాజ్‌నాథ్ * లోక్‌సభలో బీజేపీ, కాంగ్రెస్ గొడవ న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం సృష్టించిన ‘హిందూ ఉగ్రవాదం’ పదం ఉగ్రవాదంపై పోరును బలహీనపరచిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మండిపడ్డారు. ఉగ్రవాద దాడులపై దర్యాప్తు దిశను పక్కదారి పట్టించేందుకు ఈ పదాన్ని తెచ్చారన్నారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ ఉగ్రవాద దాడిపై ఆయన శుక్రవారం లోక్‌సభలో ప్రకటన చేస్తూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఆయన ఈ అంశంపై రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ కూడా ఎదురుదాడి చేసింది. లలిత్ మోదీ, వ్యాపం అంశాలపై పార్లమెంటు వర్షాకాల సమావేశాలను అడ్డుకుంటూ వస్తున్న కాంగ్రెస్ సభ్యులు గురుదాస్‌పూర్ ఘటనపై హోంమంత్రి ప్రకటన సందర్భంగాఆందోళనను పక్కనపెట్టి సీట్లలో కూర్చున్నారు. గురుదాస్‌పూర్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చారని రాజ్‌నాథ్ తెలిపారు. ఆయన ప్రకటన తర్వాత కాంగ్రెస్ సభ్యలు తిరిగి సభాపతి స్థానం వద్దకు దూసుకుపోయి సభాకార్యకలాపాలను అడ్డుకున్నారు. సమావేశాలను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడాన్ని దష్టిలో ఉంచుకుని రాజ్‌నాథ్ తన ప్రకటనలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1962 నాటి చైనా యుద్ధం, తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం సహా పలు విషయాల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఉటంకించారు. ‘‘ఉగ్రవాదం దేశానికి అతి పెద్ద సవాలుగా మారింది. దీనిని ఎదుర్కొనే విషయంలో పార్లమెంటులోకానీ, దేశంలోకానీ ఏ విధమైన విభేదాలు తగవు. ఒకవైపు మన జవాన్లు ఉగ్రవాదంపై పోరులో తమ ప్రాణాలను సైతం అర్పిస్తుంటే.. మరోవైపు సభ్యులు సభలో గలాటాను సృష్టిస్తున్నారు.. అడ్డుకుంటున్నారు. దీనిని దేశం ఎలా ఆమోదిస్తుంది?’’ అని అన్నారు. సరైన రీతిలో నోటీసిస్తే ఈ అంశంపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధమన్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో రాజ్‌నాథ్ వారిపై విరుచుకుపడుతూ.. 2013లో అప్పటి హోంమంత్రి(పి.చిదంబరం) ఉగ్రవాద ఘటనలపై దర్యాప్తు దిశను పక్కకు మళ్లించేందుకోసం ‘హిందూ ఉగ్రవాదం’ అనే పదాన్ని సృష్టించారని, ఇది ఉగ్రవాదంపై మన పోరును బలహీనపరచిందని అన్నారు. దీనిపై పాక్‌కు చెందిన హఫీజ్ సయీద్ (లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు) అప్పటి హోంమంత్రిని ప్రశంసించారని గుర్తుచేశారు. అటువంటి అవమానకర పరిస్థితిని తమ ప్రభుత్వం మళ్లీ తలెత్తనివ్వబోదన్నారు. ఉగ్రవాదానికి కులం లేదా మతం ఉండదంటూ.. ఉగ్రవాదం వల్ల తలెత్తుతున్న తీవ్ర పరిణామాలపై మనమంతా తప్పక చర్చించాలన్నారు. రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు మాట్లాడేందుకు యత్నించగా.. స్పీకర్ అనుమతించలేదు. మధ్యాహ్నం సభ తిరిగి మొదలయ్యాక.. రాజ్‌నాథ్ రాజకీయాలకు పాల్పడుతూ పార్లమెంటును విభజిస్తున్నారని ఖర్గే(కాంగ్రెస్) ఆరోపించారు. మంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అందుకు డిప్యూటీ స్పీకర్ తంబిదురై అంగీకరించలేదు.