hindupur depo
-
డిపోనకే పరిమితం
హిందూపురం టౌన్ : కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలవివాదంలో భాగంగా ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూపురం డిపో నుంచి కర్ణాటకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు మంగళవారం డిపోనకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. ఉదయం వెళ్లిన 4 బస్సులు మినహా మిగతా 10 బస్సులు డిపోలోనే నిలిచాయనినిలిచిన బస్సులు డిపో మేనేజర్ గోపీనాథ్ తెలిపారు. -
ఆర్ఎం ఆకస్మిక తనిఖీలు
హిందూపురం అర్బన్ : చాలాకాలంగా నడుస్తూ 12 లక్షలు కిలోమీటర్లు పూర్తయిన బస్సుల స్థానంలో కొత్త సర్వీసులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ చిట్టిబాబు అన్నారు. మంగళవారం ఆయన హిందూపురం డిపోలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డిపోలో అన్ని విభాగాలను పరిశీలించి సూచనలు, సలహాలు అందించారు. డిపో శుభ్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఎం గోపినాథ్‌కు ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బస్టాండుల్లో సౌకర్యాల కల్పనSకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రయాణికుల నుంచి సూచనలు వస్తే స్వీకరించి సరైన సదుపాయలు కల్పిస్తామని చెప్పారు. మూడునెలల క్రితం టెండర్లు ప్రక్రియ పూర్తి చేసుకుని రాష్ట్రానికి వచ్చిన 776 అదె ్దబస్సుల్లో జిల్లాకు 100కు పైగా వచ్చాయని తెలిపారు. విద్యార్థుల కోసం ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. పుష్కరాల సర్వీసుల ఆదాయ లెక్కింపులు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. అనంతరం సంస్థలోని రిటైర్డు ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ æసీటీఎం రాంబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కొట్టొస్తున్న వైఫల్యం
పుష్కారాలకు కండిషన్లో లేని బస్సులు అభద్రత నీడన ప్రయాణం వరుస ప్రమాదాలకు గురవుతున్న ‘పురం’ బస్సులు హిందూపురం అర్బన్ : కృష్ణా పుష్కరాలకు కండిషన్లో లేని బస్సులు పంపుతుండడంతో మార్గమధ్యలోనే అవి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆర్టీసీ అధికారులు పర్యవేక్షణ వైఫల్యం కారణంగా వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో బస్సులో ప్రయాణించేందుకు భక్తులు భయపడుతున్నారు. ప్రత్యేకించి హిందూపురం డిపో నుంచి ఐదు బస్సులను కృష్ణా పుష్కరాల కోసం కేటాయించగా, ఈ నాలుగు రోజుల్లో నాలుగు ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనల్లో ఒక ప్రయాణికురాలు మృత్యువాతపడింది. ఇంకొందరు ఆస్పత్రుల పాలయ్యారు. తాజాగా శనివారం రాత్రి హిందూపురం నుంచి బయలుదేరిన సూపర్ లగ్జరీ బస్సు ఆదివారం తెల్లవారుజామున కృష్ణా బ్యారేజ్ దాటగానే వెనుకనున్న రెండు చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదాలపై విచారణ చేస్తున్నాం హిందూపురం డిపోకు చెందిన బస్సుల వరుస ప్రమాదాలపై విచారణ చేస్తున్నాం. డ్రైవర్ల అజాగ్రత్త వల్లనే ప్రమాదాలకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూస్తోంది. బస్సుల కండిషన్లు, ప్రయాణికుల భద్రతపై దృష్టి సారిస్తున్నాం. – రాంబాబు, డిప్యూటీ సీఎంఈ