HIPL
-
హాకీ లీగ్ చరిత్రలో రికార్డు వేలం
హాకీ ఇండియా లీగ్ సీజన్ 4లో.. జర్మన్ మిడ్ ఫీల్డర్, టూ టైం ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మోర్టిజ్ రికార్డు సృష్టించాడు. లీగ్ చరిత్రలో తొలిసారి లక్ష డాలర్ల మార్క్ దాటేశాడు. ఇవాళ జరిగిన ఆటగాళ్ల వేలం లో కలింగ లాన్సర్స్ 1,05,000 డాలర్ల (భారత కరెన్సీలో 69 లక్షల రూపాయల)కు మోర్టిజ్ ను కొనుగోలు చేసింది. జర్మనీకే చెందిన 2012 లండన్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఫార్వర్డ్ ఆటగాడు ఫ్లోరియన్ ఫుచ్స్, టోబియాస్ హుకే 63 లక్షల 54 వేల రూపాయులు ధర పలికారు. ఈ సీజన్ లో భారీ అంచనాలతో వేలంలో దిగిన భారత హకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ కోసం అన్ని జట్లు భారీగా పోటీ పడ్డాయి. 20 వేల డాలర్ల బేస్ ప్రైజ్ వద్ద వేలం ప్రారంభం కాగా.. పంజాబ్ వారియర్స్ 38 లక్షల 39వేల రూపాయలకు సర్ధార్ ను దక్కించుకుంది. అయితే.. భారత ఆటగాళ్లు...రూపీందర్ పాల్ సింగ్, ధరమ్ వీర్ సింగ్ లు సర్ధార్ కంటే ఎక్కువ ధర పలికారు. ఢిఫెండర్ రూపీందర్ ను ఢిల్లీ వారియర్స్ 45 లక్షల రూపాయలకు కొనుగోలు చేయగా.. ధరమ్ వీర్ సింగ్ ను కలింగ లాన్సర్స్ 39లక్షల71 వేల రూపాయలకు దక్కించుకుంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెల్లీ ఫెయిర్‌వెదర్ వేలాన్ని పర్యవేక్షించారు. -
నేడు హెచ్ఐఎల్ వేలం
సర్దార్ సింగ్, రూపిందర్పాల్పైనే దృష్టి న్యూఢిల్లీ: రాబోయే రెండు ఎడిషన్ల కోసం హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) వేలం నేడు (గురువారం) జరగనుంది. భారత కెప్టెన్ సర్దార్ సింగ్, డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్‌పాల్ సింగ్ ఈ వేలానికి ప్రధాన ఆకర్షణకానున్నారు. 135 మంది భారత ఆటగాళ్లతో పాటు జేమీ డ్వేయర్, నికోలస్ జాకోబి, ఆండ్రూ హెవార్డ్, గోవెర్స్, లుకాస్ రేలాంటి 137 మంది విదేశీ ప్లేయర్లు ఈ వేలానికి అందుబాటులో ఉన్నారు. ఎఫ్ఐహెచ్ సీఈఓ కెల్లీ ఫెయిర్వెయిదర్ ఈ వేలానికి హాజరుకున్నారు. ఒక్కో ఫ్రాంచైజీ నుంచి యజమాని, కోచ్, ఇతర అధికారులు వేలంలో పాల్గొంటారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఫ్రాంచైజీ 20 మంది ఆటగాళ్లను తీసుకోవాలి. ఇందులో 12 మంది భారత ఆటగాళ్లు, 8 మంది విదేశీ ప్లేయర్లు కచ్చితంగా ఉండాలి. మెరికల్లాంటి ఆటగాళ్లను తీసుకోవడానికి ఫ్రాంచైజీలకు ఇదో మంచి అవకాశమని హెచ్ఐఎల్ చైర్మన్ నరీందర్ బాత్రా అన్నారు.