సర్దార్ సింగ్, రూపిందర్‌పాల్‌పైనే దృష్టి
న్యూఢిల్లీ: రాబోయే రెండు ఎడిషన్ల కోసం హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) వేలం నేడు (గురువారం) జరగనుంది. భారత కెప్టెన్ సర్దార్ సింగ్, డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్‌పాల్ సింగ్ ఈ వేలానికి ప్రధాన ఆకర్షణకానున్నారు. 135 మంది భారత ఆటగాళ్లతో పాటు జేమీ డ్వేయర్, నికోలస్ జాకోబి, ఆండ్రూ హెవార్డ్, గోవెర్స్, లుకాస్ రేలాంటి 137 మంది విదేశీ ప్లేయర్లు ఈ వేలానికి అందుబాటులో ఉన్నారు. ఎఫ్‌ఐహెచ్ సీఈఓ కెల్లీ ఫెయిర్‌వెయిదర్ ఈ వేలానికి హాజరుకున్నారు. ఒక్కో ఫ్రాంచైజీ నుంచి యజమాని, కోచ్, ఇతర అధికారులు వేలంలో పాల్గొంటారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఫ్రాంచైజీ 20 మంది ఆటగాళ్లను తీసుకోవాలి. ఇందులో 12 మంది భారత ఆటగాళ్లు, 8 మంది విదేశీ ప్లేయర్లు కచ్చితంగా ఉండాలి. మెరికల్లాంటి ఆటగాళ్లను తీసుకోవడానికి ఫ్రాంచైజీలకు ఇదో మంచి అవకాశమని హెచ్‌ఐఎల్ చైర్మన్ నరీందర్ బాత్రా అన్నారు.
నేడు హెచ్‌ఐఎల్ వేలం
Published Thu, Sep 17 2015 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 9:31 AM
Advertisement