historic agreement
-
శిలాజ ఇంధనాలకు బైబై
దుబాయ్: హరిత గృహ వాయువుల ఉద్గారానికి, తద్వారా భూతాపానికి, భూగోళంపై ప్రకృతి విపత్తులకు, జీవకోటి మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన శిలాజ ఇంధనాల వాడకానికి వీడ్కోలు చెప్పే దిశగా అడుగులు వేసేందుకు దాదాపు 200 దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు దుబాయ్‌లో జరుగుతున్న ‘కాప్–28’ సదస్సులో చరిత్రాత్మక ఒప్పందానికి అన్ని దేశాలు మద్దతు పలికాయి. ‘శిలాజ ఇంధనాల వాడకం మానేద్దాం.. మార్పు సాధిద్దాం’ అంటూ ప్రతిన బూనాయి. కాప్–28 సదస్సులో బుధవారం చివరి సెషన్ జరిగింది. శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా కీలక ఒప్పందాన్ని సభ్యదేశాల ప్రతినిధులంతా ముక్తకంఠంలో ఆమోదించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగింది. 2050 నాటికి నెట్‌జీరో(సున్నా) ఉద్గారాలే లక్ష్యంగా ఒప్పందంలో 8 సూత్రాల ప్రణాళికను జోడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఏడాది కాప్ సదస్సులో చెప్పుకోదగ్గ తీర్మానాలేవీ ఉండబోవన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. భూగోళాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉంటుందని కాప్–28 అధ్యక్షుడు సుల్తాన్ అల్–జబేర్ తేలి్చచెప్పారు. పారిస్ ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పని చేయాలని, పటిష్టమైన, నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాలని కాప్–28 సదస్సు పిలుపునిచ్చింది. ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని గణనీయంగా తగ్గించాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉందని స్పష్టం చేసింది. చేతలు కావాలి: బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించుకోవాలని గతంలో జరిగిన కాప్ సదస్సుల్లో ప్రత్యేకంగా సూచించారు. ఈసారి మాత్రం ఈ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. బొగ్గుతో విద్యు త్ను ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో చైనా, భారత్ ముందంజలో ఉన్నాయి. తమ విద్యుత్ అవసరాలు తీర్చుకోవడానికి బొగ్గుపై ఆధారపడుతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించడానికి బుధవారం ఆమోదించిన ఒప్పందమే అతిపెద్ద కార్యాచరణ ప్రణాళిక అని సుల్తాన్ అల్–జబేర్ అన్నారు. కాప్–28 టాప్ 10 చరిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్–28 సదస్సు ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. 1. చరిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్–28 సదస్సు ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. 2. సంపన్న దేశాల నిర్వాకం వల్లే వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. వాటి వల్ల పేద దేశాలు నష్టపోతున్నాయి. పేద దేశాలకు వాటిల్లుతున్న నష్టానికి గాను బడా దేశాలు పరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదన చాలాఏళ్లుగా ఉంది. ఈ సదస్సులో దానికి కార్యరూపం వచి్చంది. వాతావరణ మార్పుల వల్ల నష్టపోయే పేద దేశాలకు ఆర్థిక సాయం అందించడం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. 3. నిర్దేశిత గడువు కంటే నెట్జిరో కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని కెనడా, బెల్జియం వంటి దేశాలు ప్రకటించాయి. 2030 నాటికి ఉద్గారాలను 50 శాతం తగ్గించుకుంటామని దుబాయ్ వెల్లడించింది. 4. 2030 కంటే ముందే గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడానికి శుద్ధ ఇంధనాల వనరుల వాడకాన్ని గణనీయంగా పెంచుకోవాలని నిర్దేశించారు. 5. క్లైమేట్ యాక్షన్ కోసం సంపన్న దేశాల నుంచి నిధులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. 6. జీవ వైవిధ్యానికి, మానవళికి ఎలాంటి హాని కలగకుండా వాతావరణ మార్పుల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని నిర్దేశించారు. 7. ప్రస్తుతం అమల్లో ఉన్న పారిస్ ఒప్పందం లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శిలాజ ఇంధనాల వినియోగం, ఉత్పత్తిని తగ్గించుకోవాలని ఆదేశించారు. 8. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ క్లైమేట్ ఫండ్ తరహాలో క్లైమేట్ ఫైనాన్స్, సపోరి్టంగ్ ఫండ్స్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు కొన్నిదేశాలు, సంస్థలు మద్దతు ప్రకటించాయి. 9. కాప్–26 సదస్సు ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కర్బన్ ఉద్గారాల సమాచారాన్ని నమోదు చేసే విషయంలో నిబంధనలు సవరించారు. 10. అన్ని దేశాల, అన్ని వర్గాల అవసరా లను దృష్టిలో పెట్టుకొని శిలాజ ఇంధనాల నుంచి ఇతర ప్రమాద రహిత ఇంధనాల వైపు క్రమానుగతంగా మారాలని సూచించారు. -
దేశ ఆయుధ పరిశ్రమలో నవశకం !
వాషింగ్టన్: గగనతలంలో శత్రుదేశంపై పైచేయి సాధించేందుకు మెరుపువేగంతో దూసుకెళ్లి దాడి చేసే యుద్ధవిమానాలు అవసరం. ఆ విమానాలకు అపార శక్తిని సరఫరాచేసే జెట్ ఇంజన్లే గుండెకాయ. అలాంటి అత్యంత అధునాతన ఎఫ్414 జెట్ ఇంజన్లను భారత్‌లోనే తొలిసారిగా తయారుచేసేందుకు మార్గం సుగమమైంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇది సాధ్యమైంది. భారత్‌లోనే ఫైటర్‌జెట్ ఇంజన్లను తయారుచేసేందుకు సంబంధించిన చరిత్రాత్మక అవగాహన ఒప్పందం జనరల్ ఎలక్ట్రిక్(జీఈ) ఏరోస్పేస్, హిందుస్తాన్ ఎరోనాటిక్స్ (హాల్) మధ్య అమెరికాలో కుదిరింది. ‘భారత వాయుసేనకు చెందిన అధునాతన తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో శక్తివంత ఎఫ్414 ఇంజన్లను బిగిస్తారు. ఈ ఇంజన్లను భారత్‌లోనే తయారుచేస్తామని జీఈ ప్రకటించింది. ఒప్పందాలు ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారత్–అమెరికా మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. అవి.. 1. ఇరుదేశాల నడుమ కుదిరిన మారీటైమ్ ఒప్పందం ప్రకారం.. ఆసియా ప్రాంతంలో సంచరించే అమెరికా నావికాదళం నౌకలు ఒకవేళ మరమ్మతులకు గురైతే భారత్‌లోని షిప్‌యార్డుల్లో ఆగవచ్చు. మరమ్మతులు చేసుకోవచ్చు. 2. సముద్రాలపై నిఘా కోసం ఆర్మ్డ్ ఎంక్యూ–9బీ సీ గార్డియన్ డ్రోన్లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. దీనిపై ఒప్పందం కుదిరింది. 3. అమెరికాకు చెందిన చిప్ తయారీ కంపెనీ ‘మైక్రాన్’ గుజరాత్లో సెమీ కండక్టర్ల తయారీ, పరీక్షల ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 800 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ఇంజన్ అసమానం ‘ఎఫ్414 ఇంజన్ పనితీరుతో ఏదీ సాటిరాదు. మా కస్టమర్ దేశాల సైనిక అవసరాలు తీర్చడంలో, అత్యుత్తమ ఇంజన్లను అందించేందుకు సదా సిద్దం. ఇరుదేశాల ధృడ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న మోదీ, బైడెన్ దార్శనికతలో మేం కూడా భాగస్వాములు కావడం గర్వంగా ఉంది’ అని లారెన్స్ జూనియర్ అన్నారు. తొలి దఫాలో 99 ఇంజన్లను తయారుచేస్తారు. ఇన్నాళ్లూ రష్యా, ఐరోపా దేశాల నుంచే యుద్ధవిమానాలను కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న భారత్ ఇప్పుడు అమెరికా దిగ్గజ సంస్థతో తయారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో భారత ఆయుధ పరిశ్రమలో నూతన శకం ఆరంభం కానుంది. ఎఫ్414–ఐఎన్ఎస్6 ఇంజన్ల ఉమ్మడి తయారీ భాగస్వామ్యంతోపాటు అడ్వాన్స్డ్ మీడియా కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఏఎంసీఏ)ఎంకే2 ఇంజన్ ప్రోగ్రామ్ కోసం భారత్‌తో జీఈ కలిసి పనిచేయనుంది. ప్రస్తుతం భారత వాయుసేన తేలికపాటి 88 యుద్ధ విమానాల కోసం హాల్.. జీఈ 404 ఇంజన్లనే దిగుమతి చేసుకుని వాటికి బిగిస్తోంది. ఇకపై శక్తివంత ఎఫ్414 ఇంజన్ల సామర్థ్యంతో గగనతలంలో భారత వాయుసేన సత్తా మరింత ఇనుమడించనుంది. ఇటీవల ఫ్రాన్స్‌కు చెందిన యుద్దవిమానాల తయారీ సంస్థ దసాల్ట్ నుంచి 36 రఫేల్ యుద్దవిమానాలను భారత్ కొనుగోలుచేయడం తెల్సిందే. -
రణక్షేత్రంలో శాంతి వీచిక
దోహా/న్యూఢిల్లీ/వాషింగ్టన్: అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న అఫ్గానిస్తాన్‌లో శాంతిస్థాపనకు దారులు తెరుచుకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఉగ్రసంస్థ తాలిబన్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం.. అఫ్గానిస్తాన్‌లోని తన బలగాలను అమెరికా దశలవారీగా 14 నెలల్లో ఉపసంహరించుకోనుంది. అఫ్గాన్ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్న భారత్, మొదటిసారిగా దోహా చర్చలకు తన రాయబారి పి.కుమరన్‌ను పంపింది. ఒప్పందం నేపథ్యంలో భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా కూడా అఫ్గాన్‌లో రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. అక్కడి ప్రముఖ నేతలు, వివిధ రాజకీయ పక్షాలతో చర్చలు జరుపుతున్నారు. ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తున్న అమెరికా, తాలిబన్ ప్రతినిధులు ప్రత్యక్ష సాక్షి మైక్ పాంపియో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమక్షంలో శనివారం ఖతార్ రాజధాని దోహాలోని ఓ హోటల్లో ఒప్పందం కుదిరింది. అమెరికా ప్రతినిధి జల్మే ఖలీల్జాద్, తాలిబన్ నేత ముల్లా బరాదర్ ఒప్పందంపై సంతకాలు చేశారు. 18 ఏళ్ల అఫ్గాన్ అంతర్యుద్ధానికి ముగింపు పలికేందుకు ఏడాదిగా జరుగుతున్న చర్చలు సాకారమైనట్లు ప్రకటించారు. సంతకాలు ముగిసిన వెంటనే అక్కడ అల్లాహూ అక్బర్ అనే నినాదాలు మిన్నంటాయి. కొత్త భవిష్యత్తు కోసం అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అఫ్గాన్ ప్రజలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ‘శాంతి ఒప్పందంతో మా దేశ ప్రజలంతా చాలా సంతోషంతో ఉన్నారు. మా కార్యకలాపాలన్నిటినీ నిలిపివేస్తున్నాం’ అని తాలిబన్ ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్ ప్రకటించారు. తర్వాత ఏం జరుగుతుంది? మార్చి 10వ తేదీ నుంచి నార్వే రాజధాని ఓస్లోలో జరిగే చర్చల్లో అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్, ఇతర గ్రూపులు, మహిళా ప్రతినిధులు ముఖాముఖి పాల్గొననున్నారు. 2001 తర్వాత తాలిబన్లతో అఫ్గాన్‌లోని ఎన్నికైన ప్రభుత్వం చర్చలు జరపడం ఇదే ప్రథమం కానుంది. ఈ సమయంలో తాలిబన్ సహా ఇతర గ్రూపులు ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడకుండా ఉండటం కీలకం కానుంది. ఇదే శాంతి నెలకొనేందుకు అనువైన సమయమని అమెరికా భావిస్తోంది. చర్చల్లో అమెరికా ప్రతినిధులు ఉన్నప్పటికీ అఫ్గాన్ పక్షాల మధ్య చర్చలు సాగేందుకు సాయపడటమే వారి లక్ష్యంగా ఉండనుంది. ఒప్పందం ప్రకారం.. ►ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో ఉన్న 13 వేల మంది తమ సైనికులను వచ్చే 3–4 నెలల్లో 8,600కు అమెరికా తగ్గించుకోనుంది. మిగతా బలగాలను కూడా 14 నెలల్లో దఫాలుగా ఉపసంహరించు కుంటుంది. అయితే, ఒప్పందంలో అంగీకరించిన షరతులను తాలిబన్లు అమలు చేసే తీరును బట్టి మాత్రమే ఈ ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. ►తాలిబన్లు అమెరికాతోపాటు దాని మిత్ర దేశాలపై అఫ్గాన్ కేంద్రంగా చేసుకుని ఎలాంటి దాడులకు ప్రయత్నించరాదు. ►అఫ్గాన్ ప్రభుత్వ జైళ్లలో ఉన్న సుమారు 5 వేల మంది తాలిబన్లను విడుదల చేయాలి. ►తాలిబన్, అఫ్గాన్ ప్రభుత్వం మధ్య మధ్యవర్తిత్వం నెరిపేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేకంగా దోహాలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. ఒప్పందంలోని అంశాల అమలుకు ఈ విభాగమే జవాబుదారీగా ఉంటుంది. అఫ్గాన్ ప్రభుత్వం ఏమంటోంది? ఈ ఒప్పందంపై అఫ్గాన్‌లోని ఎన్నికైన ప్రజా ప్రభుత్వం వైఖరి స్పష్టం కాలేదు. ఇటీవలి ఎన్నికల ఫలితాలు, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నాయి. ఓస్లో చర్చలనాటికి అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, ఆయన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అబ్దుల్లా అబ్దుల్లా మధ్య ఒప్పందం కుదిరితే శాంతి చర్చల్లో తాలిబన్లపై వీరిదే పైచేయి అవుతుందని భావిస్తున్నారు. శాంతికి చక్కని అవకాశం: పాంపియో అమెరికా వాస్తవికతో చేసిన ఆలోచనే ఈ శాంతి ఒప్పందమనీ, అఫ్గాన్‌లో శాంతి నెలకొనేందుకు దక్కిన చక్కని అవకాశమని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పేర్కొన్నారు. ఒప్పందంపై సంతకాలు చేశాక మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ దాడుల సూత్రధారి అయిన తాలిబన్‌పై తనకు ఇప్పటికీ ఆగ్రహంగా ఉందన్నారు. తమ సైనికుల త్యాగాలను తాము మరిచిపోలేమని తెలిపారు. ఒప్పందం ప్రకారం తాలిబన్లు వ్యవహరించకుంటే అఫ్గాన్ భద్రత విషయంలో తగిన విధంగా వ్యవహరిస్తామన్నారు. అఫ్గాన్‌లో భారత విదేశాంగ కార్యదర్శి శాంతి ఒప్పందం నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా శుక్రవారమే కాబూల్ చేరుకున్నారు. శుక్ర, శనివారాల్లో ఆయన అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్, మాజీ అధ్యక్షుడు కర్జాయ్ తదితరులతో విస్తృతంగా చర్చలు జరిపారు. శాంతి ఒప్పందానికి మద్దతు పలికారు. దేశాభివృద్ధికి తోడ్పాటు కొనసాగిస్తామన్నారు. అనుమానాలు.. ►జైళ్లలో ఉన్న 5 వేల మంది తాలిబన్లను ప్రభుత్వం విడుదల చేస్తుందా? ►అమెరికాతోపాటు మిత్ర దేశాలపై దాడులకు పాల్పడకుండా తాలిబన్లు ఉంటారా? ►తాలిబన్ మూకలు ఆయుధాలను వీడేందుకు అంగీకరిస్తాయా? ►తాలిబన్లు అధికారం నుంచి వైదొలిగాక పొందిన హక్కులు మహిళలకు ఉంటాయా? ►వివిధ పక్షాలు, భిన్న పరిస్థితులతో కూడిన క్లిష్టమైన ఈ వ్యవహారంలో మున్ముందు ఏం జరుగనుందో ఊహించడం కష్టమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఉదాహరణకు.. సైనిక బలగాల్లో తాలిబన్ల విలీనం, పాలన తీరు వంటి అంశాల్లో అంతతొందరగా స్పష్టత రాకపోవచ్చని పేర్కొన్నారు. ఎందుకీ ఒప్పందం? అమెరికా జంట భవనాలపై సెప్టెంబర్ 11, 2001న అల్ కాయిదా జరిపిన వైమానిక దాడులతో ప్రపంచమే ఉలిక్కి పడింది. ఈ దాడి జరిగిన నెల రోజులకే అఫ్గానిస్తాన్‌పై అగ్రరాజ్యం ప్రతీకార దాడుల్ని మొదలు పెట్టింది. అయినప్పటికీ అమెరికా దాడుల వెనుక ప్రధాన సూత్రధారి ఒసామా బిన్ లాడెన్, ఇతర అల్ కాయిదా నాయకుల్ని అప్పగించ డానికి అధికార తాలిబన్లు అంగీకరించలేదు. 2002లో ప్రపంచ దేశాల సహకారంతో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఫోర్స్ (ఐఎస్ఏఎఫ్)ను అమెరికా ఏర్పాటు చేసింది. జర్మనీ, బ్రిటన్ ఇతర 39 నాటో దేశాల సంకీర్ణ బలగాలు అఫ్గాన్‌లో బలగాలను మోహరించి తాలిబన్లను అధికారం నుంచి దింపేశాయి. అధికారంలో ఉన్నప్పుడు అరాచక పాలన సాగించిన తాలిబన్లు, అధికారాన్ని కోల్పోయాక ఉగ్రవాదులుగా మారి హింసకు తెరతీశారు. 2004లో అమెరికా మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వానికి అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ దాడులకు పాల్పడ్డారు. ఒక దశాబ్దం పాటు హింసతో అఫ్గాన్ అతలాకుతలమైంది. 2011లో లాడెన్ హతం, ఆ తర్వాత మూడేళ్లకే తాలిబన్లు కాస్త బలహీన పడడంతో అమెరికా చేపట్టిన ఆపరేషన్ పూర్తయింది. 2014లో కొన్ని నాటో దేశాలు తమ బలగాలను ఉపసంహరిం చాయి. అమెరికా, మరికొన్ని దేశాల తమ బలగాలను అఫ్గాన్ భద్రత, ఆ దేశ సైన్యానికి శిక్షణ, పునర్నిర్మాణం కోసం అక్కడే మోహరించాయి. దేశ పునర్నిర్మాణం కోసం ఒకరినొకరు సహకరించుకోవడానికి అఫ్గాన్– నాటో మధ్య 2015లో ఒప్పందం కూడా జరిగింది. మరోవైపు తాలిబన్లు కూడా తమ ఉనికిని చాటుతూ దాడులకు దిగుతూనే ఉన్నారు. 2018లో అఫ్గాన్‌లో 70శాతం ప్రాంతాల్లో తాలిబన్లు ఉన్నట్టు బీబీసీ సర్వేలో తేలింది. 2001 నుంచి ఇప్పటివరకు అఫ్గాన్‌లో తాలిబన్ల పీచమణచడానికి ఆ దేశ పునర్నిర్మాణం, తమ సైనికుల అవసరాలు తీర్చడం కోసం అమెరికా కోట్లాదిగా డాలర్లు కుమ్మరించింది. తాలిబన్ల దాడులతో అమెరికా, అఫ్గాన్ ప్రభుత్వ సైనికులు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. చివరికి తాలిబన్లు అడుగు ముందుకు వేసి 2018 డిసెంబర్లో అమెరికాతో శాంతి చర్చలు జరపడానికి ముందుకు వచ్చారు కానీ, అఫ్గాన్ ప్రభుత్వంతో చర్చలకు నిరాకరించారు. అమెరికా బలగాలను మోహరించడం వల్ల ఖజానాపై వ్యయం తడిసి మోపెడు కావడంతో శాంతి స్థాపన దిశగా అడుగులు వేసింది. ఖతార్‌లో ఇరుపక్షాలు దఫాలుగా చర్చలు జరిపాయి. ►2010–12 మధ్య అఫ్గాన్‌లో ఉన్న అమెరికా సైనికులు: 1,00,000కు పైగా ►ప్రస్తుతం అఫ్గాన్‌లో నాటో బలగాలు: 13,000 అమెరికా బలగాలు: 10,000. ఆ తర్వాత అత్యధిక బలగాలున్నవి: జర్మనీ, బ్రిటన్ ►కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్న సాధారణ అమెరికా పౌరులు: 11,000 ►మృతి చెందిన అమెరికా సైనికులు: 2,300 గాయపడిన వారు: 20,660 ►అంతర్జాతీయ సంకీర్ణ బలగాల మృతులు: 3,500 ►2014 నుంచి ఇప్పటివరకు మృతి చెందిన అఫ్గాన్ సైనికులు: 45,000 ►ఐరాస అంచనాల ప్రకారం 2009 నుంచి మృతి చెందిన, గాయపడిన పౌరులు: 1,00,000కు పైమాటే ►2010–12లో ఏడాదికి అమెరికాకు అయిన∙వ్యయం: 10,000 కోట్ల డాలర్లు ►2016–2018 మధ్య కాలంలో ఏడాదికైన ఖర్చు: 4,000 కోట్ల డాలర్లు ►2001–2019 మధ్య అమెరికా తన సైన్యంపై చేసిన ఖర్చు: 77,800 కోట్ల డాలర్లు ►అఫ్గాన్ పునర్నిర్మాణ ప్రాజెక్టుల కోసం చేసిన వ్యయం: 4,400 కోట్ల డాలర్లు ►బ్రౌన్ యూనివర్సిటీ కాస్ట్ ఆఫ్ వార్ ప్రాజెక్టు అంచనాల ప్రకారం అఫ్గాన్‌లో అమెరికా ఇప్పటివరకు చేసిన వ్యయం: 1,00,000 కోట్ల డాలర్లు -
చరిత్రాత్మక ఒప్పందం
-
చరిత్రాత్మక ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై నిర్మించే మూడు ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్రల మధ్య చారిత్రక ఒప్పందాలు కుదిరాయి. మంగళవారం ముంబైలోని సహ్యాద్రి అతిథి గృహంలో జరిగిన అంతర్రాష్ట్ర జలాల బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. తమ్మిడిహెట్టి, మేడిగడ్డ, ఛనాఖా-కొరట బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి పరస్పర అంగీకారాన్ని తెలిపారు. ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గిరీశ్ మహాజన్, అంతర్రాష్ట్ర జలాల బోర్డు సభ్యులైన ఇరు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈటల రాజేందర్, సుధీర్ మంగత్రాయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం, రెవెన్యూ శాఖ మంత్రులు మహమూద్ అలీ, చంద్రకాంత్ పాటిల్, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావులతోపాటు మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్కసుమన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పుట్ట మధు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రాజెక్టు సీఈలు నల్లా వెంకటేశ్వర్లు, భగవంత్‌రావు, ఇతర బోర్డు సభ్యులు, సాగునీటి మంత్రి ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒప్పందాలివీ.. 1) మేడిగడ్డ.. గోదావరిపై 100 మీటర్ల ఎత్తులో 16 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం. మెదక్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కొత్తగా 18.19 లక్షల ఎకరాలకు సాగు నీటితోపాటు శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాల పరిధిలోని మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. 2) తమ్మిడిహెట్టి.. ప్రాణహితపై తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో 1.8 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బ్యారేజీని నిర్మిస్తారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, సిర్పూర్-కాగజ్‌నగర్ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. 3) ఛనాఖా-కొరట.. పెన్‌గంగపై 213 మీటర్ల ఎత్తులో 0.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఛనాఖా-కొరట బ్యారేజీని నిర్మిస్తారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, జైనథ్, బేల మండలాలకు సాగునీరు అందుతుంది.