కాష్మోరా సెట్ చూసి భయపడ్డా - హీరో కార్తీ
‘‘ఈ సినిమాలో హిస్టారికల్ వారియర్ లుక్ ఫైనలైజ్ చేసి, షూటింగ్ స్టార్ట్ చేశాం. ఆ తర్వాత ‘బాహుబలి’ విడుదలైంది. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన ఆ సినిమా డైనోసార్లా.. మా సినిమానేమో చిన్న పప్పీలా అనిపించింది. మా దగ్గర అంత బడ్జెట్ లేదు. ‘మగధీర’ తరహాలో హిస్టారికల్ ఎపిసోడ్ అరగంట ఉన్నా, ‘బాహుబలి’లా సెట్ వేయాలి. లేదంటే సినిమా చేయలేం. ఓ సెట్ వేశారు. అది చూసి, షాకయ్యా. బాగా ఖర్చుపెట్టారు. నిర్మాత ప్రభు నా పిన్ని కొడుకు. ఏం సినిమా చేస్తున్నారని పిన్ని తిడుతుందేమోనని భయపడ్డా. ఇలాంటి సినిమా తీయడానికి నిర్మాతలకు ధైర్యం కావాలి’’ అని హీరో కార్తీ అన్నారు.
కార్తీ, నయనతార, శ్రీదివ్య నటీనటులుగా గోకుల్ దర్శకత్వంలో పీవీపీ సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థలు నిర్మించిన సినిమా ‘కాష్మోరా’. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాశ్ బాబు నిర్మాతలు. సంతోష్ నారాయణన్ స్వరపరిచిన ఆడియో సీడీలను హీరో మాధవన్ ఆవిష్కరించారు. మాధవన్ మాట్లాడుతూ - ‘‘ఎంతో ప్యాషన్‌తో.. లైఫ్, సోల్ పెట్టి ఇటువంటి సినిమాలు తీస్తారు. మూడేళ్ల నుంచి సినిమా చేయడమంటే మామూలు విషయం కాదు.
ట్రైలర్, పోస్టర్ చూస్తే సినిమా ఎంత డిఫరెంట్‌గా ఉండబోతుందో తెలుస్తోంది’’ అన్నారు. ‘‘సినిమాలో హారర్, కామెడీ, అడ్వంచరస్ యాక్షన్ ఉన్నాయి. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా.. లవ్, రొమాన్స్ లేవు’’ అని కార్తీ తెలిపారు. ‘‘తెలుగులో ‘కాష్మోరా’ అనే పదం సుపరిచితమే. ‘ఊపిరి’ తర్వాత కార్తీకి ఇది డిఫరెంట్ మూవీ అవుతుంది’’ అన్నారు పీవీపీ. గోకుల్, వంశీ పైడిపల్లి, శ్రీదివ్య పాల్గొన్నారు.